twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘wild dog’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్

    |

    రేటింగ్: 2.75
    నటీనటులు: నాగార్జున, అలీ రెజా, దియా మీర్జా, సయామీ ఖేర్ తదితరులు
    దర్శకత్వం: అశీషోర్ సోలోమన్

    విభిన్న కథలు, ప్రయోగాలకు నాగార్జున ఎప్పుడూ ముందుంటారు. ఫలితాల గురించి ఆలోచించకుండా ప్రయోగాలు చేయడంతో నాగార్జున తరువాత ఎవ్వరైనా. అలాంటి కింగ్ నాగార్జున వైల్డ్ డాగ్ అనే చిత్రంతో నేడు (ఏప్రిల్ 2) ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరీ ఈ కథ ఎంత వరకు ప్రేక్షకులను మెప్పించింది.. అందులో నాగార్జున వైల్డ్ డాగ్‌గా ఎంత వరకు ఆకట్టుకున్నాడనేది ఓ సారి చూద్దాం.

    కథ..

    కథ..

    ఎన్ఐఏ సీనియర్ ఆఫీసర్ విజయ్ వర్మ (నాగార్జున). కొన్ని కారణాల వల్ల విజయ్ వర్మను సస్పెండ్‌ను చేస్తారు. పుణెలో జరిగిన బాంబ్ బ్లాస్ కేసు అంతు చిక్కకుండా ఉంటుంది. దాన్ని పరీష్కరించేందుకు విజయ్ వర్మను రంగంలోకి దించేందుకు పై అధికారులు ప్రయత్నిస్తుంటారు. చివరకు విజయ్ వర్మ పెట్టిన కండీషన్‌కు ఎన్ఐఏ అధికారులు ఒప్పుకుంటారు. అలా కేసును టేకప్ చేసిన విజయ్ వర్మను కొన్ని కారణాల వల్ల మళ్లీ సస్పెండ్ చేస్తారు.

    కథలో ట్విస్టులు..

    కథలో ట్విస్టులు..

    విజయ్ వర్మను ఎందుకు సస్పెండ్ చేశారు? పుణె కేసును శోధించే క్రమంలో విజయ్ వర్మకు తెలిసిన నిజాలు ఏంటి? మళ్లీ సస్పెండ్ అయిన విజయ్ వర్మ తాను టేకప్ చేసిన కేసును ఎలా పరిష్కరించాడు? అసలు పుణె బాంబ్ బ్లాస్ట్ వెనుకున్నది ఎవరు? అతడిని చివరకు విజయ్ వర్మ ఏం చేశాడు? వంటి ఆసక్తికరమైన అంశాలకు సమాధానమే వైల్డ్ డాగ్.

    ఫస్టాఫ్ అనాలిసిస్..

    ఫస్టాఫ్ అనాలిసిస్..

    ముందుగా చెప్పుకున్నట్టే వైల్డ్ డాగ్ అంతా కూడా ఓ మూడ్‌లో వెళ్తుంది. విజయ్ వర్మ కూతురు గోకుల్ చాట్ బాంబ్ బ్లస్ట్‌తో చనిపోవడం, ప్రియా వర్మ (దియా మీర్జా)తో ఎమోషనల్ సీన్స్‌తో అలా కథ ముందుకు వెళ్తుంది. మొదటి భాగంలో ఎక్కువగా ఎమోషనల్ కంటెంట్‌కు చోట ఇచ్చినట్టు కనిపిస్తుంది. ప్రియ పాత్రను అర్దాంతరంగా ముగించేసిన ఫీలింగ్ వస్తుంది. ఇంటర్వెల్ వరకు సినిమాలోని అసలు కథ మొదలవుతుంది.

    సెకండాఫ్ అనాలిసిస్..

    సెకండాఫ్ అనాలిసిస్..


    పుణె బాంబ్ బ్లాస్ట్‌కు కారణమైన ఖలీద్‌ను పట్టుకునేందుకు నేపాల్ వెళ్లడం, అక్కడ వైల్డ్ డాగ్ టీం చేసే విన్యాసాలు, ఉగ్రవాదిని పట్టుకునే క్రమంలో టీంకు ఎదురైన ఘటనలో ద్వితీయార్థం ఆసక్తికరంగా మారుతుంది. అయితే కొన్ని సన్నివేశాలు మాత్రం రొటీన్ అనే ఫీలింగ్‌ను కలిగిస్తాయి. ఇక చివర్లో ఇచ్చిన ట్విస్ట్‌లు మాత్రం అందరినీ ఆకట్టుకునేలా ఉన్నాయి. మొత్తానికి ద్వితీయార్థం సినిమాకు ప్రధానంగా మారేలా ఉంది.

    నటీనటులు

    నటీనటులు

    విజయ్ వర్మ పాత్రలో నాగార్జున అవలీలగా నటించేశాడు. నాగార్జున తన పాత్రకు తగ్గ గంభీరాన్ని, కోపాన్ని, యాటిట్యూడ్‌ను అన్నింటిని చూపించేశాడు. దేశభక్తి గల అధికారిగా నాగార్జున జీవించేశాడు. విజయ్ వర్మ పాత్రలో నాగార్జున అదరగొట్టేశాడు. ఇక మిగిలిన పాత్రలో దియా మీర్జా, అలీ రెజా, సయామీ ఖేర్, అవినాష్ కురువిల్లా, మయాంక్, ప్రకాష్, ప్రదీప్ ఇలా అందరూ కూడా తమ పరిధి మేరకు నటించారు. ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్‌లో ప్రతీ ఒక్కరూ ఇరగ్గొట్టేశారు.

    దర్శకుడి ప్రతిభ..

    దర్శకుడి ప్రతిభ..

    వైల్డ్ డాగ్ కథను అందరికీ చేరేలా చెప్పడం చాలా కష్టమైన పని. ఎటువంటి కమర్షియల్ హంగులు లేకుండా ఇలాంటి ఓ సీరియస్ కథను మెప్పించేలా తీయడం మామూలు విషయం కాదు. కానీ సోలోమన్ వైల్డ్ డాగ్‌ను అందరికీ కనెక్ట్ అయ్యేలా తీయడంతో విఫలమైనట్టు కనిపిస్తోంది. ఇన్వెస్టిగేషన్ అనే ఒకే పాయింట్ చుట్టూ కథను తిప్పడంతో మిగతా అంశాలన్నీ సైడ్ అయిపోయాయ్. ఇలా సోలోమన్‌కు దర్శకుడిగా మొదటి సినిమా అనుకున్న ఫలితాన్ని ఇవ్వలేదనిపిస్తోంది.

    సాంకేతిక విభాగాల పనితీరు..

    సాంకేతిక విభాగాల పనితీరు..

    వైల్డ్ డాగ్ వంటి సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ ముఖ్యమైనవి. వాటిని మలిచిన తీరు, తెరపై చూపించిన విధానం బాగుంది. కెమెరామెన్ షానిల్ డియో యాక్షన్ సీక్వెన్స్‌ను మాత్రమే లొకేషన్స్‌ను కూడా బాగా చూపించారు. తమన్ తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో సన్నివేశాలను ఎలివేట్ చేసేశాడు. కొన్ని సన్నివేశాలకు కత్తెర వేస్తే ఇంకాస్త బాగుండేదనే ఫీలింగ్ కలుగుతుంది. ఈ విషయంలో ఎడిటర్ దృష్టి పెట్టాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గటున్నాయి.

    ప్లస్ పాయింట్స్..

    ప్లస్ పాయింట్స్..

    నాగార్జున
    కథ
    నేపథ్య సంగీతం

    మైనస్ పాయింట్స్
    ఆసక్తికరంగా సాగని కథనం
    కమర్షియల్ అంశాలు లేకపోవడం

    ఫైనల్‌గా..

    ఫైనల్‌గా..

    వైల్డ్ డాగ్ సినిమా ఓ వర్గం ప్రేక్షకులను మాత్రమే ఆకట్టుకునేలా ఉంది. మాస్ ఆడియెన్స్‌కు వైల్డ్ డాగ్ అంతగా ఎక్కక పోవచ్చు. బీ, సీ సెంటర్లలో టాక్‌ను బట్టి ఈ మూవీ ఏ మేరకు సక్సెస్ అవుతుందనేది ఆధారపడి ఉంటుంది. వైల్డ్ డాగ్ అనే టైటిల్ కొత్తగా ఉన్నా.. సినిమా మాత్రం మరీ అంత కొత్తగా అనిపించదు.

    నటీనటులు

    నటీనటులు

    నాగార్జున, అలీ రెజా, దియా మీర్జా, సయామీ ఖేర్ తదితరులు
    దర్శకత్వం : అశీషోర్ సోలోమన్
    నిర్మాత : నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి
    మ్యూజిక్ : తమన్
    సినిమాటోగ్రఫి : షానిల్ డియో
    రిలీజ్ డేట్ : 2021-04-02
    రేటింగ్ : 2.75

    English summary
    Wild Dog is a 2021 Indian Telugu-language action thriller film written and directed by debutant Ashishor Solomon. Starring Nagarjuna Akkineni, Dia Mirza, and Saiyami Kher. the film is produced by S. Niranjan Reddy and K. Anvesh Reddy under Matinee Entertainmen,
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X