Devil Twitter Review: డెవిల్‌కు ఊహించని టాక్.. అవి మాత్రం హైలైట్.. ఇంతకీ కల్యాణ్ హిట్ కొట్టాడా అంటే!
సినీ రంగంలోనే పెద్ద పేరున్న నందమూరి ఫ్యామిలీ నుంచి సినిమాల్లోకి వచ్చినా.. అన్ని విభాగాల్లోనూ మెప్పిస్తూ వరుస సినిమాలతో దూసుకుపోతోన్నాడు కల్యాణ్ రామ్. ఫలితాలను అస్సలు పట్టించుకోకుండా ప్రయోగాలు చేస్తూ ముందుకు సాగుతోన్న అతడు.. 'బింబిసార' తర్వాత ఆ రేంజ్ హిట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇందులో భాగంగానే ఇప్పుడు కల్యాణ్ రామ్ 'డెవిల్' అనే సినిమాను చేశాడు. క్రైమ్ థ్రిల్లర్ జోనర్‌లో రూపొందిన ఈ చిత్రం తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి దీనికి ట్విట్టర్‌లో ఎలాంటి టాక్ వచ్చిందో మీరే చూడండి!
డెవిల్‌గా వచ్చిన కల్యాణ్ రామ్ : నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా నటించిన సస్పెన్స్ సినిమానే 'డెవిల్'. అభిషేక్ నామా తెరకెక్కించిన మూవీని అభిషేక్ పిక్చర్స్ బ్యానర్‌పై దేవాంన్ష్ నామా సమర్పణలో అభిషేక్ నామా నిర్మించారు. ఇందులో సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ మూవీలో మాళవిక నాయర్, అజయ్, సత్య కీలక పాత్రలు చేశారు. ఈ చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతాన్ని ఇచ్చాడు.

అలాంటి స్టోరీతో వచ్చిందిగా : నందమూరి కల్యాణ్ రామ్ చేసిన మరో ప్రయోగాత్మక చిత్రమే 'డెవిల్'. బ్రిటీష్ కాలం నాటి కథతో రూపొందిన ఈ సినిమా క్రైమ్ థ్రిల్లర్ జోనర్‌లో వచ్చింది. ఇందులో ఓ హత్య జరగడం.. దానిని చేధించేందుకు సీక్రెట్ ఏజెంట్ అయిన హీరో ఎంట్రీ ఇవ్వడం.. ఆ తర్వాత అతడు ఎన్నో ఊహించని విషయాలను బయటపెట్టడం అనే అంశాలతోనే ఈ చిత్రం రూపొందింది.
ఫస్టాఫ్ అలా ఏవరేజ్ అంటూ : నందమూరి కల్యాణ్ రామ్ నటించిన 'డెవిల్' మూవీ ప్రీమియర్స్ చూసిన ఓ నెటిజన్ ఇలా స్పందించారు. 'డెవిల్ మూవీ ఫస్టాఫ్ ఏవరేజ్‌గా ఉంది. స్టోరీ చాలా ఆసక్తికరంగానే ఉంది. కానీ, స్క్రీన్‌ప్లే మాత్రం చాలా ఫ్లాట్‌గా సాగిపోయింది. అలాగే, కొన్ని అనవసరపు కమర్షియల్ అంశాలను పెట్టారు. ప్రీ ఇంటర్వెల్ నుంచి సినిమా బాగా పైకి లేచింది' అని ట్వీట్ చేశారు.
కల్యాణ్ రామ్ బ్యాక్ అంటూ : కల్యాణ్ రామ్ నటించిన 'డెవిల్' మూవీని వీక్షించిన మరో నెటిజన్ ట్విట్టర్‌లో 'సినిమా మంచి సీన్‌తో మొదలై అందరినీ కథలోకి తీసుకు వెళ్తుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ సూపర్‌గా ఉంది. సెకెండాఫ్ ఆసక్తికరంగా సాగింది. ఫస్టాఫ్ ఏవరేజ్‌గా ఉన్నా ప్రీ ఇంటర్వెల్ నుంచి అదిరింది. మొత్తంగా ఇది ఓ థ్రిల్లర్ మూవీ. కల్యాణ్ రామ్‌కు మరో హిట్ వచ్చింది' అని చెప్పుకొచ్చారు.
ఓవరాల్‌గా హిట్ సినిమా అని : కల్యాణ్ రామ్ - సంయుక్త మీనన్ జంటగా నటించిన 'డెవిల్' మూవీని చూసిన ఇంకో నెటిజన్ 'ఫస్టాఫ్ ఏవరేజ్‌గానే ఉంది. ప్రీ ఇంటర్వెల్, ఇంటర్వెల్ బ్లాంక్స్ మాత్రం బాగున్నాయి. సెకెండాఫ్ మాత్రం మంచి ఉపశమనం ఇచ్చేలా చివరి వరకూ ఆసక్తికరంగా సాగింది. బ్యాగ్రౌండ్ స్కోర్, విజువల్స్, సినిమాటోగ్రఫి బాగున్నాయి. ఓవరాల్‌గా హిట్ మూవీ' అని వెల్లడించారు.
మొత్తంగా కూర్చోబెట్టేశాడు : అభిషేక్ నామా దర్శకత్వంలో నందమూరి కల్యాణ్ రామ్ నటించిన 'డెవిల్' మూవీపై చూసిన ఓ నెటిజన్ ఇలా స్పందించారు. ఈ మేరకు ట్విట్టర్‌లో 'డెవిల్ ఎక్స్‌లెంట్ మూవీ. ట్విస్టులు, సస్పెన్స్‌తో చాలా ఆసక్తికరంగా సాగింది. అసలు ఏమాత్రం సందేహం లేకుండా సీట్లలో కూర్చోబెట్టేశాడు. కల్యాణ్ రామ్ మరో హిట్ కొట్టాడు. సంయుక్త గ్లామర్ బాగుంది' అని చెప్పాడు.
కల్యాణ్ వన్ మ్యాన్ షో : నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా చేసిన 'డెవిల్' మూవీని చూసిన ఇంకొక నెటిజన్ 'డెవిల్ సినిమా ఫస్టాఫ్ మొత్తం కథ ఆధారంగానే నడుస్తుంది. సెకెండాఫ్‌లో మాత్రం ఎన్నో చిల్ మూమెంట్లు ఉన్నాయి. అందుకే ఫస్టాఫ్ కంటే సెకెండాఫ్ బాగుంది. కల్యాణ్ రామ్ వన్ మ్యాన్ షో చేశాడు. డెవిల్ మొత్తంగా కమర్షియల్‌గా సాగే మంచి థ్రిల్లర్ మూవీ' అని వివరించారు.
ఊహించని విధంగానే : కల్యాణ్ రామ్ హీరోగా చేసిన 'డెవిల్' మూవీకి సంబంధించి ఇప్పటి వరకూ చూసిన ట్వీట్‌ను బట్టి ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. కానీ, ఊహించని విధంగా అందరూ ఫస్టాఫ్ ఏవరేజ్ అనే అంటున్నారు. కానీ, సెకెండాఫ్ లేపడంతో సంతృప్తిగా బయటకు వస్తున్నట్లు చెప్తున్నారు. మరి ఇదే టాక్ కంటిన్యూ అయితే మాత్రం కల్యాణ్ రామ్ హిట్ కొట్టడం ఖాయం అని చెప్పొచ్చు.


Click it and Unblock the Notifications











