twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Nani's గ్యాంగ్ లీడర్ రివ్యూ అండ్ రేటింగ్

    |

    Recommended Video

    Nani's Gang Leader Movie Review || గ్యాంగ్ లీడర్ రివ్యూ అండ్ రేటింగ్

    Rating:
    2.5/5
    Star Cast: నాని, కార్తికేయ, ప్రియాంక, లక్ష్మీ, శరణ్య
    Director: విక్రమ్‌ కె.కుమార్‌

    నేచురల్‌ స్టార్‌ నాని వరుస విజయాలతో తన రేంజ్ పెంచుకొంటూ వెళ్తున్నాడు. ఎంసీఏతో కమర్షియల్ హీరోగా మార్కులు కొటేసి.. ఆ తర్వాత జెర్సీతో అత్యుత్తమ ప్రతిభను కనబరిచాడు. ఇక తాజాగా గ్యాంగ్ లీడర్‌ చిత్రం కోసం వెర్సటైల్‌ డైరెక్టర్‌ విక్రమ్‌ కే కుమార్‌తో జతకట్టారు. ఈ క్రేజీ కాంబినేషన్‌కు హీరో కార్తీకేయ, నూతన తార ప్రియాంక మోహన్ జతకలిశారు. ఇలాంటి ప్రత్యేకతలు ఉన్న చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై రవిశంకర్‌, మోహన్‌(సీవీఎం) నిర్మించారు. Nani's గ్యాంగ్ లీడర్ టీజర్‌, ట్రైలర్‌, ఇటీవల విడుదల చేసిన ప్రమోషనల్‌ సాంగ్‌తో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సెప్టెంబర్‌ 13న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం ఎలా ఉందనే విషయాన్ని తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.

    Nani's గ్యాంగ్ లీడర్ కథ

    Nani's గ్యాంగ్ లీడర్ కథ

    తమ కుటుంబాలకు అన్యాయం చేసిన గుర్తు తెలియని వ్యక్తిపై ప్రతీకారం తీర్చుకోవడానికి సరస్వతి (లక్ష్మీ), వరలక్ష్మి (శరణ్య), ప్రియ (ప్రియాంక మోహన్)తో మొత్తం ఐదుగురు సిద్ధమవుతారు. ఆ క్రమంల పెన్సిల్ పార్థసారథి (నాని) అనే క్రైమ్, థ్రిల్లర్ రచయితను కలిసి తమ ప్లాన్ వివరిస్తే నిరాకరిస్తాడు. కానీ స్వప్రయోజనం కోసం మహిళా గ్యాంగ్‌ ప్లాన్ ఓకే చెబుతాడు. ఆ క్రమంలో అంబులెన్స్ డ్రైవర్ నుంచి అంతర్జాతీయ కారు రేసర్‌గా ఎదిగిన దేవ్ (కార్తీకేయ) తమకు అన్యాయం చేసిన వ్యక్తి అని గుర్తిస్తారు.

    Nani's గ్యాంగ్ లీడర్‌లో ట్విస్టులు

    Nani's గ్యాంగ్ లీడర్‌లో ట్విస్టులు

    కారు రేసర్ దేవ్ ఎందుకు ఐదుగురు కుటుంబాలను రోడ్డున పడేశాడు. 300 కోట్ల బ్యాంక్ దోపిడికి ఈ మహిళల కుటుంబాలకు సంబంధమేమిటి? బ్యాంక్ దోపిడికి అంబులెన్స్ డ్రైవర్ దేవ‌కు సంబంధమేమిటి? ఇంటర్నేషనల్ రేసర్‌గా దేవ్ ఎలా మారాడు? గ్యాంగ్ లీడర్‌గా మారిన నాని ఐదుగురు మహిళల కోసం ప్రతీకారం ఎలా తీర్చుకొన్నాడు. ఐదుగురిలో ఒకరైన ప్రియతో ప్రేమలో పడిన పార్థసారథి తన లవ్‌ను గెలిచాడా? అనే ప్రశ్నలకు సమాధానమే Nani's గ్యాంగ్ లీడర్ కథ.

     ఫస్టాఫ్ అనాలిసిస్

    ఫస్టాఫ్ అనాలిసిస్

    బ్యాంక్ దోపిడితో Nani's గ్యాంగ్ లీడర్ కథ మొదలవుతుంది. ఆ తర్వాత ఐదుగురు మహిళలు కలుసుకోడం, పెన్సిల్ పార్థసారథి ఇంట్రడక్షన్ చకచకా జరిగిపోతాయి. నాని, మహిళా గ్యాంగ్ కలిసిన తర్వాతే కథలో వేగం మందగించింది. సాగదీస్తూ కథను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతుంది. ఇక కార్తీకేయ ఎంట్రీ తర్వాత కొంత వేగం పుంజుకొన్న మళ్లీ కథ, కథనాల్లో అదే నత్తనడక కనిపిస్తుంది.

    సెకండాఫ్ అనాలిసిస్

    సెకండాఫ్ అనాలిసిస్

    ఇక సెకండాఫ్‌‌లో కథ, కథనంలో ఇంటెన్సిటీ కనిపిస్తుంది. కొన్ని ఎమోషన్స్‌ ప్రేక్షకులను తట్టే ప్రయత్నం జరిగినట్టు కనిపిస్తుంది. ఇక చిన్న నాని, ప్రియ లవ్ ట్రాక్ ఉండాలన్నట్టు ఉంటుంది. లక్ష్మీకి సంబంధించిన చిన్న ట్విస్టు సినిమాపై ఆసక్తి రేపుతుంది. కానీ అప్పటికే సమయం మించిపోవడంతో రొటీన్‌గా క్లైమాక్స్ ముగుస్తుంది. చివర్లలో చిన్నారితో ఉండే సీన్ కొంత ఫీల్‌గుడ్ ఫ్యాక్టర్ కనిపిస్తుంది. ఓవరాల్‌గా కథలో బలమైన పాయింట్ ఉన్నప్పటికీ ఎలాంటి భావోద్వేగాలు పండించలేకపోవడం Nani's గ్యాంగ్ లీడర్ ప్రత్యేకమైన సినిమాగా మారలేకపోయిందనే ఫీలింగ్ కలుగుతుంది.

    దర్శకుడు విక్రమ్ కుమార్ గురించి

    దర్శకుడు విక్రమ్ కుమార్ గురించి

    Nani's గ్యాంగ్ లీడర్ సినిమా విషయానికి వస్తే దర్శకుడు విక్రమ్ కుమార్ కథ, కథనాలను బలంగా రాసుకోలేకపోయాడనే విషయం స్పష్టంగా కనిపిస్తుంది. సినిమా స్క్రీన్ ప్లే విషయంలో సాదాసీదాగా సాగడం ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడుతున్నాడా? అనిపిస్తుంది. కథలో ఎలాంటి స్పెషల్ ఎలిమెంట్స్ లేకపోయినా.. అశ్లీలత, అసభ్య సంభాషణలు, అనవసరపు రొమాన్స్‌కు మొగ్గు చూపకపోవడం దర్శకుడిగా కొంత సక్సెస్ సాధించారని చెప్పవచ్చు. ఈ అంశమే ఫ్యామిలీ ఆడియెన్స్‌ను రప్పించడానికి అవకాశం కనిపిస్తున్నది.

    నాని ఫెర్ఫార్మెన్స్

    నాని ఫెర్ఫార్మెన్స్

    ఇక నాని విషయానికి వస్తే.. తన పాత్ర బరువునే కాకుండా మరో ఐదుగురి పాత్రల బరువును కూడా మోసినట్టు కనిపిస్తుంది. కథ, కథనాలపై కొంత జాగ్రత్త పడి ఉంటే, డెఫినెట్‌గా నాని కెరీర్‌లో మంచి ఎమోషనల్ సినిమా అయ్యేది. ఆ అవకాశాన్ని చేరజార్చుకొన్నాడా? అనే ఫీలింగ్ కలుగుతుంది. నాని నేచురల్ స్టార్.. కథలో ఎలాంటి బలం లేకపోయినా నాని సినిమాను నిలబట్టే ప్రయత్నం చేశాడని అనిపిస్తుంది. నాని కెరీర్‌లో గొప్పగా చెప్పుకొనే పాత్ర మాత్ర కాదని చెప్పవచ్చు.

    కార్తికేయ యాక్టింగ్

    కార్తికేయ యాక్టింగ్

    RX 100 మూవీతో మంచి బ్లాక్‌బస్టర్ చేజిక్కించుకొన్న కార్తీకేయ విలన్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించాడు. దేవ్‌గా తనదైన మార్కు నటనను ప్రదర్శించాడు. క్లాసీ లుక్‌, సీరియస్‌గా కనిపించాడు. కొన్ని సీన్లలో నేచురల్ స్టార్‌తో పోటీ పడి నటించినట్టు కనిపిస్తుంది. హీరోగానే పరిమితం కాకుండా, ఇమేజ్ చట్రంలో బందీ కాకుండా నటుడిగా ప్రూవ్ చేసుకొనే ప్రయత్నం చేయడం అభినందనీయం.

    మిగితా పాత్రల్లో

    మిగితా పాత్రల్లో

    హీరోయిన్ ప్రియాంక పాత్రకు పెద్దగా ప్రాధాన్యం లేకపోవడం, గుంపులో గోవిందమ్మగా మారడంతో పెద్దగా ఆమె ప్రతిభ బయటకు రాలేకపోయింది. లక్ష్మీ, శరణ్య పాత్రలు బాగున్నాయి. తన ఎమోషనల్ నటనతో లక్ష్మీ మరోసారి ఓ బేబి సినిమాను గుర్తు చేసింది. వెన్నెల కిషోర్ కామెడీ, సత్య తదితరులు కామెడీ అక్కడక్కడా హస్యాన్ని పండించింది.

    అనిరుధ్ సంగీతంలో

    అనిరుధ్ సంగీతంలో

    Nani's గ్యాంగ్ లీడర్ సినిమా సాంకేతిక విభాగంలో మ్యూజిక్ గురించి ప్రస్తావిస్తే.. అనిరుధ్ సంగీతంలో ఎలాంటి కొత్తదనం లేదు. రీరికార్డింగ్ చాలా రొటీన్‌గా ఉంది. ఎండ్ టైటిల్‌లో వచ్చే సాంగ్, హొయనా పాట ఆకట్టుకొన్నది. ఇక విదేశాలను నుంచి దిగుమతి చేసుకొన్న సినిమాటోగ్రాఫర్ మిరోస్లా కుబా బ్రోజెక్‌ గొప్పగా ఆకట్టుకోలేకపోయాడు. క్వాలిటీపరంగా మెప్పించలేకపోయాడనే చెప్పవచ్చు.

    పని ఉందనే ఫీలింగ్ కలుగుతుంది

    పని ఉందనే ఫీలింగ్ కలుగుతుంది

    ఇక నవీన్ నూలి ఎడిటింగ్ కూడా అంత ఎఫెక్టివ్‌గా అనిపించదు. సన్నివేశాల్లో ల్యాగ్ ఎక్కువగా కనిపిస్తాయి. ఇంకా ఆయన చేతినిండా పని ఉందనే ఫీలింగ్ కలుగుతుంది. వెంకీ మాటలు అక్కడక్కడా పేలాయి. వెంకీ తన టాలెంట్‌ను రుజువు చేసుకోవడానికి బలమైన సన్నివేశాలు లేకపోవడం వల్ల మాటలు సాధారణంగా ఉన్నాయి. మైత్రీ మూవీస్ బ్యానర్‌లో వచ్చే సినిమాలు క్వాలిటీపరంగా బాగుంటాయి. కానీ ఈ సినిమాలో అలాంటిది కనిపించదు.

    ఫైనల్‌‌గా

    ఫైనల్‌‌గా

    Nani's గ్యాంగ్ లీడర్ పాయింట్ బాగున్నప్పటికీ.. కథ, కథనాలు ఇంప్రెసివ్‌గా లేకపోవడం ప్రధాన లోపంగా చెప్పవచ్చు. నటీనటుల ఫెర్ఫార్మెన్స్ మాత్రమే ఈ సినిమాను కాస్తో కూస్తో నిలబెట్టిందని చెప్పవచ్చు. ప్రస్తుతం మార్కెట్‌లో ఫ్యామిలీ ఆడియెన్స్‌కు చేరవయ్యే సినిమాలు లేకపోవడం వల్ల ఈ సినిమాకు ఆ వర్గం ప్రేక్షకుల నుంచి ఆదరణ లభించడానికి అవకాశం ఉంది. నానిని అభిమానించే వారికి ఈ సినిమా నచ్చుతుంది. ఓవర్సీస్, బీ, సీ సెంటర్లలో వచ్చే స్పందనను బట్టే కమర్షియల్‌గా రేంజ్ నిర్దారించబడుతుంది.

    బలం, బలహీనతలు

    బలం, బలహీనతలు

    నాని ఫెర్ఫార్మెన్స్
    కార్తీకేయ స్పెషల్ అప్పీయరెన్స్
    ప్రియాంక గ్లామర్
    లక్ష్మీ, శరణ్య యాక్టింగ్
    విక్రమ్ కుమార్ దర్వకత్వం
    సినిమాటోగ్రఫి

    నటీనటులు, సాంకేతికవర్గం

    నటీనటులు, సాంకేతికవర్గం

    నేచురల్‌ స్టార్‌ నాని, RX100 ఫేమ్‌ కార్తికేయ, ప్రియాంక, లక్ష్మీ, శరణ్య, అనీష్‌ కురువిళ్లా, ప్రియదర్శి, రఘుబాబు, వెన్నెల కిశోర్‌, జైజా, సత్య తదితరులు
    నిర్మాతలు: నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, మోహన్‌ (సివిఎం),
    కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: విక్రమ్‌ కె.కుమార్‌
    సంగీతం: అనిరుధ్‌ రవిచందర్‌,
    సినిమాటోగ్రఫీ: మిరోస్లా కుబా బ్రోజెక్‌,
    మాటలు: వెంకీ,
    రచనా సహకారం: ముకుంద్‌ పాండే,
    పొడక్షన్‌ డిజైనర్‌: రాజీవన్‌,
    ఆర్ట్‌ డైరెక్టర్‌: రామ్‌కుమార్‌,
    ఎడిటింగ్‌: నవీన్‌ నూలి,
    వి.ఎఫ్‌.ఎక్స్‌.: మకుట,
    కాస్ట్యూమ్‌ డిజైనర్‌: ఉత్తర మీనన్‌,
    స్టిల్స్‌: జి.నారాయణరావు,
    కో-డైరెక్టర్‌: కె.సదాశివరావు,
    ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌: శేషు,
    సీఈవో: చిరంజీవి (చెర్రీ)

    English summary
    Natural star Nani 24th movie titled as Gang leader. This title announced on eve of Nani's Birthday. Mythri movies are producing, Vikram K kumar is director. Anirudh will be music Director. This movie set to release on September 13th.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X