Shyam Singha Roy Movie Review: నాని పవర్‌ఫుల్‌గా.. సాయిపల్లవి ఎమోషనల్‌గా.. కథే అత్యంత బలంగా..

Rating:
3.0/5

నటీనటులు: నాని, సాయిపల్లవి, కృతిశెట్టి, మడోన్నా సెబస్టియన్, జిషు సేన్ గుప్తా, మురళీ శర్మ, రాహుల్ రవీంద్రన్, అభినవ్ గోమటం, మనీష్ వాద్వా, లీలా సామ్సన్ తదితరులు
దర్శకత్వం: రాహుల్ సంక్రిత్యన్
కథ: సత్యదేవ్ జంగా
నిర్మాత: వెంకట్ బోయనపల్లి
సినిమాటోగ్రఫి: సాను జాన్ వర్గీస్
ఎడిటర్: నవీన్ నూలి
మ్యూజిక్: మికీ జే మేయర్
బడ్జెట్: 50 కోట్లు
బ్యానర్: నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్
రిలీజ్ డేట్: 2021-12-24

శ్యామ్ సింగరాయ్ కథ..

శ్యామ్ సింగరాయ్ కథ..

సినిమా డైరెక్టర్ కావాలనే లక్ష్యంతో వాసు గంటా (నాని) షార్ట్ ఫిలిం తీసే ప్రయత్నంలో ఉంటాడు. తన కథకు సరిపడే హీరోయిన్ వెతికే క్రమంలో కీర్తి (క‌తి శెట్టి)ని చూసి ఇంప్రెస్ అయి ప్రేమలో పడుతాడు. తాను తీసిన షార్ట్ ఫిలింతో సినిమా అవకాశాన్ని చేజిక్కించుకొన్న వాసు తొలి మూవీతో బ్లాక్‌బాస్టర్‌ను తన ఖాతాలో వేసుకోవడమే కాకుండా బాలీవుడ్‌లో సినిమా తీసే ఛాన్స్ కొట్టేస్తాడు. ఇలాంటి పరిస్థితుల్లో సినిమా కథ తమ పుస్తకాల నుంచి కాపీ కొట్టారనే శ్యామ్ సింగరాయ్ (ఎస్ఆర్) అనే పబ్లిషర్ కేసు పెట్టడంతో పోలీసులు డైరెక్టర్ వాసును అరెస్ట్ చేస్తారు.

కథలో ట్విస్టులు

కథలో ట్విస్టులు

వాసు కథకు, శ్యామ్ సింగరాయ్ పుస్తకాలకు లింకు ఏమిటి? నిజంగానే శ్యామ్ సింగరాయ్ కథలను వాసు కాపీ కొట్టాడా? అసలు శ్యామ్ సింగరాయ్ ఎవరు? శ్యామ్ సింగరాయ్‌కు నాని జీవితానికి ఏమైనా సంబంధం ఉందా? శ్యామ్ సింగరాయ్ పబ్లిషర్ పెట్టిన కేసుతో నాని ఎలాంటి సమస్యల్లో పడ్డారు. ఈ కేసు వాసు జీవితాన్ని ఎలాంటి మలుపు తిప్పింది. శ్యామ్ సింగరాయ్‌కి మైత్రేయి అనే దేవదాసి (సాయిపల్లవి) జీవితానికి ఎలాంటి రిలేషన్ ఉంది? తనపై పెట్టిన కాపీరైట్ యాక్ట్ కేసు నుంచి వాసు ఎలా బయటపడ్డారు అనే ప్రశ్నలకు ఎమోషనల్ సమాధానమే శ్యామ్ సింగరాయ్ సినిమా కథ.

శ్యామ్ సింగరాయ్ బలం ఏమిటంటే?

శ్యామ్ సింగరాయ్ బలం ఏమిటంటే?

శ్యామ్ సింగరాయ్ సినిమాకు రచయిత సత్యదేవ్ జంగా అందించిన కథనే పూర్తి బలం. సత్యదేవ్ కథను డెవలప్ చేసిన విధానం, దేవదాసిల జీవితాన్ని కథకు ముడిపెట్టిన విధానం ఆకట్టుకొంటుంది. వాసు, శ్యామ్ సింగరాయ్ పాత్రలో జీవించిన నాని నటన సినిమాకు అదనపు ఆకర్షణ. ఇక సాయిపల్లవి ఎమోషనల్‌గా ప్రేక్షకులను ఆకట్టుకొంటే.. కృతిశెట్టి గ్లామర్ పరంగా మెప్పించింది. మడోన్నా సెబాస్టియన్ ఓ కీలకపాత్రలో కథకు ఆకర్షణీయంగా మారింది. నటీనటులు పెర్ఫార్మెన్స్‌తోపాటు సినిమాటోగ్రఫి, మిక్కి జే మేయర్ రీరికార్డింగ్ పాజిటివ్‌గా మారాయి. ఫస్టాఫ్‌గా సాఫ్ట్‌గా సాగిపొతే.. సెకండాఫ్‌లో ఒడిదుడుకులతో కాస్త ఇబ్బంది పెడతుంది.

 శ్యామ్ సింగరాయ్ బలహీనతలు ఏమిటంటే..

శ్యామ్ సింగరాయ్ బలహీనతలు ఏమిటంటే..

శ్యామ్ సింగరాయ్ మైనస్ పాయిట్ల విషయానికి వస్తే.. ఇంటర్వెల్‌ తర్వాత సాయిపల్లవి, నాని మధ్య వచ్చే 20 నిమిషాల డ్రామా కాస్త సహనానికి పరీక్ష పెట్టినట్టు ఉంటుంది. కాకపోతే ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు వచ్చే ఎపిసోడ్స్ ఆ లోపాలను సవరించడం కాస్త ఉపశమనం. ఈ సినిమాకు పాటలు మైనస్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రేక్షకులను ఆకట్టుకొనే పాటలు లేకపోవడంతో సినిమాలో జోష్ తగ్గినట్టు అనిపిస్తుంది. కొన్ని సన్నివేశాలు, కథనంలో లాజిక్కులకు పొంతన ఉండదు.

దర్శకుడు రాహుల్ సంక్రిత్యన్ గురించి

దర్శకుడు రాహుల్ సంక్రిత్యన్ గురించి

కథాభివృద్ది, కథనంలో అనుసరించిన విధానంతో దర్శకుడు రాహుల్ సంక్రిత్యన్ సక్సెస్ అయ్యాడు. సెకండాఫ్‌లో కథనం, ఎమోషనల్ సీన్లపై మరింత దృష్టిపెట్టి ఉంటే బాగుండేదనిపించింది. కథ, పాత్రలకు తగినట్టుగా నటీనటుల ఎంపిక ఆయన ప్రతిభకు అద్దం పట్టింది. టాక్సీవాలా తర్వాత ఈ సినిమాతో రాహుల్ ద్వితీయ విఘ్నం దాటిసినట్టే అని చెప్పవచ్చు.

నాని ఫెర్ఫార్మెన్స్ అదుర్స్

నాని ఫెర్ఫార్మెన్స్ అదుర్స్

వాసుగా, శ్యామ్ సింగరాయ్‌గా విభిన్నమైన పాత్రల్లో నటించిన నాని ఆ రెండు పాత్రలకు పూర్తిగా న్యాయం చేశాడు. వాసు పాత్రలో ఎనర్జిటిక్‌గా కనిపిస్తే.. శ్యామ్‌ సింగరాయ్ రోల్‌లో ఎమోషనల్ మెప్పించాడు. సెకండాఫ్‌లో ఎన్నడూ చూడని నాని చూస్తాం. రెండు పాత్రల్లో ఒదిగిపోయిన తీరు అందర్నీ ఆకట్టుకొంటుంది. క్లైమాక్స్‌లో నాని నటన భావోద్వేగానికి గురిచేస్తుంది. శ్యామ్ సింగరాయ్‌గా పవర్ ఫుల్ పాత్రలో రాణించాడు.

 సాయి పల్లవి నటన నెక్ట్స్ లెవెల్

సాయి పల్లవి నటన నెక్ట్స్ లెవెల్

ఇక సాయిపల్లవి మరోసారి అద్బుతమైన పాత్రలో ఒదిగిపోయారు. ఓ భారమైన పాత్రను చాలా తన ప్రతిభతో సునాయసంగా తెరపైన మెరుపులు మెరిపించారు. ఇప్పటి వరకు గ్లామర్‌ తారగా, ఫెర్ఫార్మర్‌గా చూసి ఉన్నాం. కానీ శ్యామ్ సింగరాయ్‌లో ఆమె ఫెర్ఫార్మర్‌గా మరో లెవెల్‌లో కనిపిస్తుంది. దేవదాసిగా, క్లైమాక్స్‌లో ఓ కీలక సన్నివేశంలో ప్రేక్షకుల మనసుకు మరింత దగ్గరవుతుంది.

కృతిశెట్టి, మడొన్నా గ్లామర్ గురించి

కృతిశెట్టి, మడొన్నా గ్లామర్ గురించి

ఇక షార్ట్ ఫిలిం హీరోయిన్‌గా, వాసు పాత్ర ప్రియురాలిగా రెండు డిఫరెంట్ వేరియన్స్‌లో మెరిసింది. హై ఎనర్జీ, గ్లామర్, చలాకీగా కృతిశెట్టి కనిపించింది. ఉప్పెన తర్వాత గ్లామర్‌కు పూర్తి స్కోప్ ఉన్న పాత్రలో నటించింది. ఇక మడోన్నా సెబాస్టియన్ కూడా ఎవరూ ఊహించిన పాత్రలో కనిపించి థ్రిల్ చేస్తారు. కాస్త డీ గ్లామర్‌గా కనిపించినప్పటికీ.. ఫెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకోవడం గ్యారెంటి.

సాంకేతిక విభాగాల పనితీరు

సాంకేతిక విభాగాల పనితీరు

ఇక సాంకేతిక విభాగాల పనితీరు గురించి వస్తే.. సినిమాటోగ్రఫిలో రెండు రకాల వేరియేషన్స్‌తో సాను జాన్ వర్గీస్ సినిమాటోగ్రఫి ఆకట్టుకొన్నారు. ఫస్టాఫ్ మోడరన్ లైఫ్ స్టైల్ ఫీల్‌ను కలిగిస్తే.. సెకండాఫ్‌లో పిరియాడిక్ మూడ్‌ను బాగా ఎలివేట్ చేశారు. లైటింగ్ పాత్రల మూడ్‌ తెరపైన స్పష్టంగా కనిపించింది. ఎడిటింగ్ విషయానికి వస్తే.. సెకండాఫ్‌లో కొంత మేరకు ల్యాగ్ అనిపిస్తుంది. పాటలు ఆకట్టుకొనే లేవు కానీ.. బీజీఎం సీన్లను మరో లెవెల్‌కు తీసుకెళ్లిందని చెప్పవచ్చు.

Recommended Video

Shyam Singha Roy Teaser : Nani పవర్ఫుల్ పాయింట్... కానీ Pushpa? | Sai Pallavi || Filmibeat Telugu
ఫైనల్‌గా...

ఫైనల్‌గా...

నటీనటులు ఫెర్ఫార్మెన్స్, రకరకాల ఎమోషన్స్‌తో కూడిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ శ్యామ్ సింగరాయ్. పునర్జన్మ కథతో చాలా సినిమాలు ప్రేక్షకులను మెప్పించినా.. శ్యామ్ సింగరాయ్ ఎమోషనల్‌తో కూడిన భారమైన కథ. సత్యదేవ్ జంగా కథను రాహుల్ తీర్చిదిద్దిన విధానం సినిమాకు పాజిటివ్‌గా మారింది. బీ, సీ సెంటర్లలో ఈ సినిమాకు పెద్దగా స్పందన ఆకట్టుకోపోవచ్చు కానీ... అర్బన్ ఏరియాలో మంచి రెస్పాన్స్ లభిస్తుంది. ఒకవేళ బీ, సీ సెంటర్లలో కూడా ఆకట్టుకోగలిగితే.. జెర్సీని మించిన వసూళ్లు వస్తాయి. ప్రస్తుత పరిస్థితుల్లో జెర్సీని మించిన వసూళ్లు సాధిస్తుందా అనే వేచిచూడాల్సిందే. చివరగా.. ఫ్యామిలీ, యూత్‌కు బాగా నచ్చే సినిమా అని ఎలాంటి సందేహాలు లేకుండా చెప్పవచ్చు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X