బాగా స్లోగా..వచ్చినవాడే ('ఎవడే సుబ్రమణ్యం' రివ్యూ)

By Srikanya

Rating:
2.0/5

తెలుగులో కాన్సెప్టు ఓరియెంటెడ్ చిత్రాలు బాగా తక్కువ. ముఖ్యంగా కొద్దిగా ప్రయోగం కలిగలిపినవి అయితే మరీను. అయితే అశ్వనీదత్ లాంటి పెద్ద నిర్మాతకు చెందిన బ్యానర్ నుంచి నాని వంటి హీరో చేస్తున్న చిత్రం అంటే ప్రయోగానికైనా థియోటర్స్ లో మంచి యోగమో పడుతుంది. అదే జరిగింది ఈ చిత్రానికి ...మంచి ఓపినింగ్స్ వచ్చాయి. అయితే దర్శకుడు ఫీల్ కోసమనో లేక చెప్పాలనుకున్నది ప్రేక్షకుడుకి బాగా ఇంకాలనో బాగా స్లో పేసెడ్ గా కథనం నడుపుతూ వచ్చారు.

అసలే కొత్త తరహా కథ దానికి తోడు స్లోగా నడక...ఎంటర్టైన్మెంట్ అనేది మచ్చుకైనా లేకపోవటం కాస్త ఇబ్బందికర వ్యవహారమే. అలాగే క్లైమాక్స్ సైతం చాలా నీరసంగా మార్చేసాడు. అయితే ఓ విషయంలో దర్శక,నిర్మాతలను అభినందించాలి. అదే రొటీన్ కు భిన్నంగా వెళ్లి కొత్తదనంగా ప్రయత్నించాలనే ఆలోచన. జయాపజయాలకు అతీతంగా ఇలాంటి ప్రయత్నాలు కొన్ని జరిగితేనే తెలుగు సినిమా కొత్త పుంతలు తొక్కుతుంది. అయితే ఈ లోగా ఉన్నంతలో ప్రేక్షకులూ కాస్త పెద్ద మనస్సు చేసుకుని ఇలాంటివి ఆదరిస్తేనే సుమా.

Nani's Yevade Subramanyam  review

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

"లైఫ్ లో నువ్వు ఎవరూ అనేది నీ బ్యాంక్ బ్యాలెన్స్ తోనే తెలుస్తుంది " అనేది మనసా వాచా నమ్మి అనుసరిస్తున్న వాడు సుబ్రమణ్యం(నాని)అలియాస్ సుబ్బు. ఇలాంటి వర్కోహాలిక్ కు ఇంకా చెప్పాలంటే కెరిర్ ఓరియెంటెడ్ కుర్రాడికి రిషి(విజయ్ దేవరకొండ) అనే చిన్ననాటి స్నేహితుడు ఉంటాడు. రిషిది క్వయిట్ ఆపోజిట్ మనస్వత్వం.. జీవితం ఉన్నది అనుభవించటానికి, ఆనందించటానికి అనేది అతని ఫిలాసఫి. ఈ క్రమంలో సుబ్బు తను నమ్మి ఆచరిస్తున్న సిద్దాంతంతో ఓ కార్పోరేట్ కంపెనీకు సీఈవో గా ఎదుగుతాడు. అంతేకాదు అతనికి రితు వర్మ తో ఎంగేజ్ మెంట్ సైతం అవుతుంది. ఈ లోగా ఓ రోజు అతన్ని గోవానుంచి రిషి ...తన స్నేహితురాలు ఆనందిని(మాళవిక నాయిర్) తో సహా వచ్చి కలుస్తాడు. అంతేకాదు రిషి అతన్ని ... తనకు అత్యంత ఇష్టమైన హిమాలయాలలోని రిషికేష్ దగ్గరలోని ధూథ్ కాశి వెళ్దామని బలవంటపెడతాడు. సుబ్బు దానికి ఒప్పుకోడు. అయితే ఓ అనుకోని పరిణామంతో అక్కడికి ఆనందినితో కలిసి బయిలుదేరతాడు. ఈ క్రమంలో అతనికి అసలు జీవితమంటే ఏమిటో తెలుస్తుంది. ఇంతకీ ఆ ఊహించని సంఘటన ఏమిటి.. ఇంతకీ ఆనందిని అసలు కథేంటి...సుబ్బుని జీవితం అంటే తెలుసుకునేలా చేసిన పరిస్ధితులు ఏమిటి అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఇలాంటి చిత్రాలు హాలీవుడ్ లో వస్తూంటాయి.అప్పుడుప్పుడూ బాలీవుడ్ లోనూ పలకరిస్తున్నాయి. తెలుగుకి మాత్రం చాలా కొత్త. భిన్న వ్యక్తిత్వాలున్న ముగ్గురు వ్యక్తులు హిమాలయ కొండల్లో చేసే ప్రయాణమే ఈ సినిమా. కథగా కొత్తగా ఏదో చెప్పాలన్న తాపత్రయంతో ఉన్న ఈ దర్శకుడు దాని ఎగ్జిక్యూషన్ లోనే దారి తప్పాడనిపిస్తోంది. అలాగే కొంతదూరం వెళ్లాక.. కథనం సైతం చాలా ప్రెడిక్టుబుల్ గా ఎదర ఏం జరుగుతుందో తెలిసిపోయేలా సాగింది. అన్నిటికన్నా ముఖ్యంగా నాని పాత్ర తో ఐడింటిఫై అవటం చాలా కష్టం అనిపిస్తుంది. ఇలాంటి సినిమా చూసిన తర్వాత..చాలా విషయాలు గుర్తు పెట్టుకుని బయిటకు వచ్చేలా డిజైన్ చెయ్యగలగాలి. అంటే సీన్స్ ,స్క్రీన్ పై చాలా కష్టపడాలి.

ఇక నటీనటుల్లో నాని ఫెరఫార్మెన్స్ చాలా బాగుంది. మిగతా ఇద్దరు హీరోయిన్స్ ఓకే అనిపిస్తారు. విజయ్ బాగా చేసారు. కృష్ణరాజు గారు పాత్ర వల్ల సినిమాకు ఒరిగిందేమోలేదు కానీ ఆయన్ని తీసుకోవటంతో కాస్త నిండుతనం వచ్చింది. టెక్నికల్ గా అద్బుతం కాదు కానీ ఓకే అనిపిస్తుంది. ముఖ్యంగా ఇలాంటి సినిమాకు విజువల్స్ ప్రాణంగా ఉండాలి. ఆ విషయంలో కెమెరా డిపార్టమెంట్ మరింత కసరత్తు చేస్తే బాగుండేదనిపిస్తుంది(లిమిటేషన్స్ ఏమున్నాయో మరి). నిర్మాణపరంగా స్వప్న తమ బ్యానర్ కు తగినట్లు గ్రాండ్ గా తీసారు. బ్యాక్ గ్రౌండ్, పాటలు ఈ సినిమాకు బాగా ప్లస్ అయ్యాయి. కొత్త దర్శకుడు ... స్క్రిప్టు మీద కూర్చుని ఉంటే ఇంతకన్నా మంచి అవుట్ పుట్ వచ్చి ఉండేది. అయినా కొత్తగా ట్రై చేయాలనే ఆలోచనే గొప్పది కాబట్టి అభినందనలు.

ఫైనల్ గా ట్రైలర్స్ ఉన్నంత గొప్పగా సినిమాలు ఉండవని మరోసారి ప్రూవ్ చేసిన సినిమాల్లో ఇది కూడా చేరిందనే చెప్పాలి. అలాగే...సెకండాఫ్ లో సీన్స్ బాగా సాగిన ఫీలింగ్ వచ్చింది. అక్కడ ఏమన్నా ట్రిమ్ చేసే అవకాసం ఉందేమో చూస్తే...నమ్మి థియోటర్ కు వెళ్లిన వారికి కాస్త సుఖంగా ఉంటుంది. ఏదైమైనా ఈ చిత్రం మల్టిఫ్లెక్స్ ల్లోకి వెళ్లినంతగా మిగతా సెంటర్లకు వెళ్తుందా అంటే సందేహమే. రెగ్యులర్ మసాలా చిత్రాలు చూసి బోర్ కొట్టినవారు.. కొత్త తరహా చిత్రం చూడాలి అనుకుంటే కొంచెం ఓపిక చేసుకుంటే ఇది మంచి ఆప్షనే.

బ్యానర్: స్వప్న సినిమా
నటీనటులు నాని, మాళవిక నాయర్, విజయ్ దేవరకొండ, రితు వర్మ, షావుకారు జానకి తదితరులు
సంగీతం: రధన్‌,
ఛాయాగ్రహణం: అమిత్‌, భరత్‌.
నిర్మాత: ప్రియాంకదత్
రచన,దర్శకత్వం: నాగ్ అశ్విన్
విడుదల తేదీ: 21,మార్చి 2015

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X