twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నన్ను దోచుకుందువటే మూవీ రివ్యూ అండ్ రేటింగ్

    |

    Recommended Video

    Nannu Dochukunduvate Movie Review

    Rating:
    2.5/5
    Star Cast: సుధీర్‌బాబు, నభా నటేష్, నాజర్, తులసి, పృథ్వీరాజ్, నల్ల వేణు
    Director: ఆర్ఎస్ నాయుడు

    సమ్మోహనం చిత్ర సక్సెస్‌తో హీరో సుధీర్ బాబు మంచి జోష్ మీద ఉన్నాడు. హీరోగానే కాకుండా తాజాగా సుధీర్‌బాబు ప్రొడక్షన్ స్థాపించి నన్ను దోచుకుందువటే అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ప్రేమ నేపథ్యంగా ఓ భావోద్వేగమైన పాయింట్‌తో రూపొందిన ఈ చిత్రంలో నభా నటేష్ హీరోయిన్‌గా నటించింది. సెప్టెంబర్ 21 రిలీజైన ఈ చిత్రం ఎలాంటి టాక్‌ను సొంతం చేసుకొంది? సుధీర్ బాబును నిర్మాతగా మరో మెట్టు ఎక్కించిందా? అని తెలుసుకొనేందుకు కథలోకి వెళ్లాల్సిందే.

    నన్ను దోచుకుందువటే స్టోరి

    నన్ను దోచుకుందువటే స్టోరి

    కార్తీక్ (సుధీర్‌బాబు) సాఫ్ట్‌వేర్ కంపెనీలో మేనేజర్‌గా పనిచేస్తుంటాడు. కెరీర్ తప్ప మరో విషయం తెలియదు. అమెరికాకు వెళ్లాలనే బలమైన కోరికతో కెరీర్ ప్లాన్ చేసుకొంటాడు. అనుకోని పరిస్థితుల్లో కార్తీక్ జీవితంలోకి షార్ట్‌ఫిలింస్‌లో నటించే మేఘన (నభా నటేష్) ప్రవేశిస్తుంది. తండ్రి (నాజర్) కోసం కార్తీక్, మేఘన లవర్స్‌గా నాటకం ఆడుతారు. కానీ అనుకోకుండా ఒకరంటే మరొరకరి ఇష్ట ఏర్పడి ప్రేమలో పడుతారు. ఓ పరిస్థితి కారణంగా మేఘన ప్రేమను దూరంగా పెట్టాలనుకొంటాడు?

    నన్ను దోచుకుందువటేలో ట్విస్టులు

    నన్ను దోచుకుందువటేలో ట్విస్టులు

    తండ్రి కోసం ఏ పరిస్థితుల్లో కార్తీక్, మేఘన నాటకం ఆడాల్సి వస్తుంది? అమితంగా ప్రేమించే మేఘనను కార్తీక్ ఎందుకు కాదంటాడు? తండ్రి కలలను నిజం చేయడం కోసం కార్తీక్ ఎందుకు పరితపిస్తాడు? చివరకు అమెరికాకు వెళ్లాడా? మేఘనను పెళ్లి చేసుకొన్నాడా? తండ్రి కలలను నిజం చేశాడా? అనే ప్రశ్నలకు సమాధానమే నన్ను దోచుకుందువటే సినిమా కథ.

    ఫాస్టాఫ్ రివ్యూ

    ఫాస్టాఫ్ రివ్యూ

    సాఫ్ట్‌వేర్ కంపెనీలో చాలా స్ట్రిక్ట్ మేనేజర్‌గా సుధీర్ బాబు ఎంట్రీతో కథ ప్రారంభమవుతుంది. ఆఫీస్ పనుల్లో మునిగిపోవడం కారణంగా నానమ్మ అంత్యక్రియలకు హాజరుకాకపోవడం, ఆ తర్వాత ఊర్లో మేనమామ కూతురిని పెళ్లి ప్రతిపాదన రావడం లాంటి అంశాలతో కథ చాలా నెమ్మదిగా సాగుతుంది. మేనమామ కూతుర్ని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక సిరి అనే మరో అమ్మాయి తన జీవితంలో ఉందని అబద్ధం ఆడటంతో మేఘన ఆ జీవితంలోకి ప్రవేశించడం కొంత రోటీన్‌గానే అనిపిస్తుంది. మేఘన పాత్ర ఎంట్రీ కావడంతో సినిమా చకచకా ఇంటర్వెల్ వరకు చేరుకొంటుంది. ఓ ఎమోషనల్ పాయింట్‌తో సినిమా తొలి భాగం ముగుస్తుంది.

    సెకండాఫ్ రివ్యూ

    సెకండాఫ్ రివ్యూ

    ఇక సెకండాఫ్‌కు వచ్చే సరికి మేఘన, కార్తీక మధ్య కలహాలు, విభేధాలతో కథ చాలా రొటీన్‌గా సాగుతుంది. ఆఫీస్ వ్యవహారాలు, ప్రేమ, తండ్రి అనారోగ్యం లాంటి అంశాలతో కలగపులగంగా మారుతుంది. కానీ ప్రీ క్లైమాక్స్ నుంచి సినిమా అసలు కథలోకి వెళ్తుంది. చివరి 20 నిమిషాల్లో భావోద్వేగాలు ప్రేక్షకుడిని థ్రిల్ చేస్తాయి. ఓ చక్కటి ముగింపుతో సినిమా ఫర్వాలేదనే ఫీలింగ్ కలుగుతుంది.

     దర్శకుడి ప్రతిభ

    దర్శకుడి ప్రతిభ

    దర్శకుడు ఆర్ఎస్ నాయుడు అనుకొన్న పాయింట్ ఫీల్‌గుడ్ పాయింటే. కాకపోతే కథ, కథనాలను బలంగా అల్లుకోలేకపోయాడని చెప్పవచ్చు. స్లో నేరేషన్ ఈ సినిమాకు మైనస్ పాయింట్. క్లైమాక్స్‌లో బలమైన పాయింట్‌ను చెప్పి.. తన లోపాలను కప్పిపుచ్చుకోవడంతో దర్శకుడిగా సక్సెస్ అయ్యాడని చెప్పవచ్చు. కథలో స్కోప్ ఉన్నప్పటికీ.. ఎమోషన్స్ నిపండంలో తడబాటుకు గురయ్యాడు. ఓవరాల్‌గా ఫర్వాలేదనిపించే మార్కులు సంపాదించుకొన్నాడు.

    సుధీర్ బాబు పెర్ఫార్మెన్స్

    సుధీర్ బాబు పెర్ఫార్మెన్స్

    సుధీర్‌బాబు పెర్ఫార్మెన్స్ నన్నుదోచుకుందువటే సినిమాకు ప్రధాన బలం. నటుడిగా రోజు రోజుకు తన స్థాయిని మెరుగుపరచుకొంటున్నాడు. శమంతకమణి, సమ్మోహనం సినిమాల తర్వాత మరోసారి మంచి పాత్రను ఎంచుకొన్నాడు. అవసరమైన చోట భావోద్వేగాలు పండించాడు. చివర్లో తండ్రి, కొడుకుల మధ్య ఆయన నటన సినిమాకు హైలెట్.

    నభా నటేష్ యాక్టింగ్, గ్లామర్

    నభా నటేష్ యాక్టింగ్, గ్లామర్

    నభా నటేష్ కొత్త అమ్మాయి అయినా సుధీర్ బాబుకు ధీటుగా తన నటనను ప్రదర్శించింది. పలు వేరియన్స్ ఉన్న పాత్రను సమర్ధవంతంగా పోషించి మెప్పించింది. చలాకీగా, హుషారుగా ప్రేక్షకులకు కొత్త అనుభూతికి గురి చేసింది. ఎమోషనల్ సీన్లలో ఓకే అనిపించేలా నటించింది. నటనను ఇంకా మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉంది.

    నాజర్ నటన

    నాజర్ నటన

    నన్ను దోచుకుందువటే చిత్రంలో ప్రధానంగా చెపుకోవాల్సిన పాత్ర నాజర్‌ది. ఇతరుల చేతిలో మోసపోయిన సర్వం ఆస్తితోపాటు అర్ధాంతరంగా భార్యను పోగొట్టుకొన్న వ్యక్తి పాత్రలో అద్బుతంగా నటించాడు. క్లైమాక్స్‌లో తండ్రి, కొడుకుల మధ్య వచ్చే సీన్లలో నాజర్ జీవించాడని చెప్పవచ్చు. ఇక ఈ చిత్రంలో తులసి, జీవా, వేణు తదితర పాత్రలు ఫర్వాలేదనిపిస్తాయి.

    సురేష్ రగతు సినిమాటోగ్రఫి

    సురేష్ రగతు సినిమాటోగ్రఫి

    సాంకేతిక విభాగాల్లో సురేష్ రగతు అందించిన సినిమాటోగ్రఫీ అదనపు ఆకర్షణ. గ్రామీణ నేపథ్యం, అర్బన్ లుక్ ఉన్న సీన్లను కనువిందుగా చిత్రీకరించాడు. టాప్ యాంగిల్ షాట్స్ బాగున్నాయి. లైటింగ్‌ను వాడుకొన్న విధానం, సీన్స్‌ను ఎలివేట్ చేసిన పద్దతి బాగుంది.

    ఎడిటర్ చోటా కే ప్రసాద్ గురించి

    ఎడిటర్ చోటా కే ప్రసాద్ గురించి

    నన్ను దోచుకుందువటే చిత్రానికి చోటా కే ప్రసాద్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు. అక్కడక్కడ కొన్ని సీన్లు లెంగ్త్ అయినప్పటికీ.. కథాపరంగా అవసరం కావడం వల్ల అలా ఉంచేశారా అనే ఫిలీంగ్ కలుగుతుంది. సినిమాలో కొంతలో కొంత ఎమోషన్స్ ఎలివేట్ అయ్యాయంటే ఎడిటర్ ప్రతిభ ఓ కారణంగా చెప్పవచ్చు.

    నిరాశ పరిచిన మ్యూజిక్

    నిరాశ పరిచిన మ్యూజిక్

    నన్ను దోచుకుందువటే లాంటి ఓ ప్రేమకథకు కావాల్సిన సంగీతం లేకపోవడం నిరాశ కలిగించే అంశం. ఒక్క పాట మినహాయిస్తే మిగితా పాటలు పెద్దగా ఆకట్టుకొనేలా లేవు. రీరికార్డింగ్‌పై మరింత దృష్టిపెడితే బాగుండేది. ఎమోషనల్ సీన్లను బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఎలివేట్ చేయలేకపోయింది.

     నిర్మాణ విలువల

    నిర్మాణ విలువల

    సుధీర్ బాబు ప్రొడక్షన్ విషయానికి వస్తే.. ఈ బ్యానర్‌లో తొలి సినిమా అయినప్పటికీ.. మంచి అనుభవం ఉన్న నిర్మాతగా సినిమాను రూపొందించాడు. పాత్రల ఎంపిక విషయంలో మరికొంత దృష్టి పెట్టాల్సింది. సాంకేతిక నిపుణుల ఎంపిక బాగుంది. ప్రతీ ఫ్రేమ్ తెరపైన చాలా రిచ్‌గా కనిపిస్తుంది.

    ఫైనల్‌గా

    ఫైనల్‌గా

    ప్రేమ, పెళ్లి కంటే కెరీర్‌నే ఎక్కువగా ప్రేమించి యువకుడి కథే నన్నుదోచుకుందువటే చిత్రం. కథలో ఎమోషన్ తగ్గి, సినిమా కథ నెమ్మదిగా సాగడం ఈ చిత్రానికి మైనస్ పాయింట్. పలు బాధ్యతల మధ్య నలిగే యువకుడి భావోద్వేగాల ఆధారంగా చిత్రం రూపొందింది. మల్టీప్లెక్స్ ఆడియెన్స్ మినహాయిస్తే, బీ, సీ సెంటర్ల ప్రేక్షకుల ఆదరణ బట్టే ఈ సినిమా విజయం ఆధారపడి ఉంటుంది.

    ప్లస్ పాయింట్స్

    ప్లస్ పాయింట్స్

    బలం, బలహీనతలు
    సుధీర్ బాబు, నభా నటేష్ యాక్టింగ్
    క్లైమాక్స్
    సినిమాటోగ్రఫి

    మైనస్ పాయింట్స్
    స్లో నేరేషన్
    భావోద్వేగత లోపించడం

    తెర వెనుక, తెర ముందు

    తెర వెనుక, తెర ముందు

    నటీనటులు: సుధీర్‌బాబు, నభా నటేష్, నాజర్, తులసి, పృథ్వీరాజ్, నల్ల వేణు
    దర్శకత్వం: ఆర్ఎస్ నాయుడు
    నిర్మాత: సుధీర్‌బాబు
    సినిమాటోగ్రఫి: సురేష్ రగుతు
    ఎడిటింగ్: చోటా కే ప్రసాద్
    మ్యూజిక్: అంజనీష్ లోక్‌నాథ్
    బ్యానర్: సుధీర్ బాబు ప్రొడక్షన్స్
    రిలీజ్ డేట్: 2018-09-21

    English summary
    Nannu Dochukunduvate revolves around a software company who strictly does his duties, and is a happy go lucky employee. Sudheer Babu Posani, Nabha Natesh lead pairs in this movie. This movie made under sudheer Babu productions. This movie released on September 21st. In this occassion, Telugu Filmibeat brings exclusive review.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X