తలనొప్పినే...('ఒక్కడినే' రివ్యూ)

By Srikanya

Rating:
1.5/5
వరస హత్యలు, పగ, ఫైట్స్, మాస్ సాంగ్స్ ఉంటేనే కమర్షియల్ చిత్రం అన్న భావన... బాణం చిత్రంతో పరిచయమైన నారా రోహిత్ కి కూడా కలిగినట్లుంది. అందుకే నేను మాత్రం తక్కువా అనుకుంటూ ఒక్కడినే అంటూ దూకేసాడు. అయితే ఎంచుకున్న కథ ..అతనొక్కడే నాటిదని, అలాంటిదే అని గుర్తించలేకపోయాడు. సర్లే ఏ హీరోకి అయినా కమర్షియల్ బ్రేక్ అవసరమే కదా అనుకుని సరిపుచ్చుకుని చూద్దామనుకుంటే విపరీతమైన స్లో నేరేషన్ తాబేలు నడక నడుస్తూ విసిగిస్తుంది. జెనిలియాతో కథ చిత్రం చేసిన దర్శకుడు ఈ చిత్రంలో కమర్షియల్ ఎలిమెంట్స్ ని ఎంచుకోవటం వరకూ ప్రయత్నం చేయగలిగాడు కానీ పండించలేకపోయాడు.

విదేశాల్లో చదువుకుంటున్న శైలజ(నిత్యామీనన్) హ్యాలిడేస్ కు ఇంటికి వైజాగ్ వస్తుంది. అక్కడ ఆమెకు ఐఎఫ్ ఎస్ ట్రైనింగ్ లో ఉన్న సూర్యం(నారా రోహిత్)పరిచయమవుతాడు. వీరి పరిచయం ప్రేమగా మారి వివాహం చేసుకుందామనుకునే దాకా వస్తుంది. ఈ లోగా ఆమెకు సూర్యం గురించి ఓ నిజం తెలుస్తుంది. మరో ప్రక్క ఆమె ఎదురుగా కొన్ని హత్యలు జరుగుతాయి. ఇంతకీ ఆ హత్యలకూ సూర్యంకు సంభంధం ఉందా...కావాలనే సూర్యం ఆమె జీవితంలో ప్రవేశించాడా..ఇంతకూ సూర్యం ఎవరు...అతని టార్గెట్ ఏమిటి అన్న విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

కథలో కొత్తదనం లేకుండా తెలుగులో వచ్చే చాలా చిత్రాలు స్క్రీన్ ప్లే తో గట్టెక్కే ప్రయత్నం చేస్తూంటాయి. అయితే ఆ రకంగానూ ఒక్కడినే అలరించలేకపోయింది. ఎంటర్టైన్మెంట్ మిస్ కావటం...స్లో నేరేషన్ ఈ చిత్రం చూసే ప్రేక్షకుడికి శాపాల్లా తగిలాయి. నారా రోహిత్ ..ఫైట్స్ బాగా చేసినా డాన్స్ లలో ఈజ్ చూపలేకపోయాడు. ఇప్పుడున్న యువ హీరోలతో పోటీ పడాలంటే డాన్స్ లు, బాడీ లాంగ్వేజ్ విషయంలో చాలా కృషి చేయాలి. ముఖ్యంగా కమర్షియల్ సినిమాలకు ఈ రెండూ చాలా అవసరం. ఇక హీరోయిన్ గా నిత్యా మీనన్ ఎప్పటిలాగే తన నవ్వుతో మ్యాజిక్ చేసి తన సీన్స్ ని లాక్కెళ్లిపోయింది.

తలనొప్పినే...('ఒక్కడినే' రివ్యూ)

కథన పరంగా మరింత ఫాస్ట్ నేరేషన్ తో దర్శకుడు వెళ్లగలిగితే ఈ కథ తో ఒడ్డెక్కేవాడు. యూత్ ని ఫ్యామిలీ ఆడియన్స్ ని ఒకేసారి మెప్పించాలనే తనపతో ఏ వర్గానికీ న్యాయం చేయలేకోపోయాడు.

తలనొప్పినే...('ఒక్కడినే' రివ్యూ)

నారా రోహిత్ తన ఫెరఫార్మెన్స్ తో చాలా సీన్స్ పండించాడు. సోలో,బాణం చిత్రాలతో పోలిస్తే ఇందులో మెరుగైన నారా రోహిత్ నటన కనిపిస్తుంది. ముఖ్యంగా సెంటిమెంట్ సీన్స్ లతో అతని మెచ్యూరిటీ కనిపించింది.

తలనొప్పినే...('ఒక్కడినే' రివ్యూ)

అలా మొదలైందితో తన కెరీర్ ని తెలుగులో మొదలెట్టిన నిత్యా మీనన్ తన పాత్రకు న్యాయం చేసింది. డాన్స్ లు కూడా బాగా చేసి మెప్పించింది.

తలనొప్పినే...('ఒక్కడినే' రివ్యూ)

సాయికుమార్, కోట శ్రీనివాసరావు, నాగబాబు, చంద్రమోహన్, ఎమ్ ఎస్ నారాయణ వంటి సీనియర్ ఆర్టిస్టులు సినిమాకు కలిసివచ్చారు. అలీ,బ్రహ్మానందం సీన్స్ అనుకున్నంతగా పండలేదు. శ్రీనివాస రెడ్డి కూడా కామెడీ విఫలమయ్యాడనిపిస్తుంది.

తలనొప్పినే...('ఒక్కడినే' రివ్యూ)

సింగర్ నుంచి మ్యూజిక్ డైరక్టర్ గా ఎదిగిన కార్తీక్ పాటలు బాగున్నాయి. ట్రెండీ మెలోడియస్ ట్రాక్ లు ఇచ్చాడు. 'డోలా డోలా ...,' 'హోలా హోలో ...' మరియు'సీతా కోక నచ్చావే ...' వంటివి చూడ్డానికన్నా వినటానికి బాగున్నాయి.

తలనొప్పినే...('ఒక్కడినే' రివ్యూ)

ఆండ్రూ బాబు కెమెరా వర్క్ సినిమా హైలెట్స్ లో ఒకటి. చింతపల్లి రమణ డైలాగులు ఓకే. నాగేంద్ర ఆర్ట్ వర్క్ కూడా సినిమాకు ప్లస్ అయ్యింది. మార్తాండ్ కె వెంకటేష్ ..ఎడిటింగ్ మరింత షార్ప్ చేసి సినిమాని స్పీడ్ చెయ్యాల్సింది.

తలనొప్పినే...('ఒక్కడినే' రివ్యూ)

ప్రేమ,పగ,కుటుంబం అనే ఎలిమెంట్స్ ని సరిగా బ్యాలెన్స్ చేయగలిగితే మంచి కమర్షియల్ హిట్ అయ్యేది.

తలనొప్పినే...('ఒక్కడినే' రివ్యూ)

బ్యానర్: గులాబీ మూవీస్‌
జెనప్: యాక్షన్ - రొమాన్స్
నటీనటులు: నారా రోహిత్‌ , నిత్యామీనన్‌, నాగబాబు, చంద్రమోహన్‌, సాయికుమార్‌, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, యం.యస్‌.నారాయణ, బెనర్జీ, జీవి, ఆలీ, శ్రీనివాసరెడ్డి, సత్యకృష్ణ, సుధ, ఢిల్లీ రాజేశ్వరి తదితరులు.
మాటలు: చింతపల్లి రమణ,
సంగీతం: కార్తీక్‌,
ఛాయాగ్రహణం: ఆండ్రుబాబు,
కళ: నాగేంద్ర,
ఎడిటింగ్‌: మార్తాండ్‌ కె.వెంకటేష్‌,
కో-డైరెక్టర్‌: కళ్యాణ్‌,
ప్రొడక్షన్‌: తాండవకృష్ణ
నిర్మాత: సి.వి.రెడ్డి,
కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: శ్రీనివాస్‌ రాగ.
విడుదల తేదీ: పిబ్రవరి 14, 2012
సెన్సార్ రేటింగ్ : U/A
డ్యూరేషన్ : 02:30 గంటలు.

ఏదైమైనా ప్రేమకుల రోజున విడుదలైన ఈ చిత్రం సిని ప్రేమికులను కూడా అలరించటం కష్టమే. ఈ సినిమాకు ఒక్కరే వెళ్లకుండా మరొకరిని తోడు తీసుకు వెళ్ళటం బెస్ట్..ఎందుకంటే బోర్ కొట్టినప్పుడల్లా కబుర్లు చెప్పుకోవటానికి ప్రక్కన మనిషి ఉంటారు. మనం కబుర్లు చెప్పుకుంటున్నా ఎవరూ డిస్ట్రబ్ కారు..ఎందుకంటే అప్పటికే చాలా మంది అదే పనిలో ఉంటారు కాబట్టి...

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X