For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఫస్టాఫ్ 'జ్యో'...సెకండాఫ్ 'జో..జో' (అవసరాల‘జ్యో అచ్యుతానంద’రివ్యూ)

By Srikanya
|

Rating:
3.0/5

'ఊహలు గుస గుసలాడే' అంటూ సరికొత్త రొమాంటిక్ కామెడీకు శ్రీకారం చుట్టిన అవసరాల ఊహలు ఓ వర్గానికి పిచ్చ పిచ్చగా నచ్చేసాయి. దాంతో ఆయన మళ్లీ ఇంకో సినిమాతో మన ముందుకువస్తున్నాడనగానే ఆ వర్గంలో ఆసక్తి మొదలైంది. ఊర మాస్ సినిమాలు ఎలాగో..ఇది ఊర క్లాస్ సినిమా అనాలేమో అన్నంత బాగా తీసాడు. తొలి సినిమాకు స్క్రిప్టుకు మంచి మార్కులు వేయించుకున్న అవసరాల ఈ సినిమాతో మరో మెట్టు ఎక్కి దర్శకుడుగానూ దుమ్మురేపాడనే చెప్పాలి.

కథ విషయానికి వస్తే...అచ్యుత్ (నారా రోహిత్), ఆనంద్ (నాగ శౌర్య) బ్రదర్శ్. మిడిల్ క్లాస్ ఆనందాలతో సరదాగా,సరదాగా గడిపేస్తున్న వారి జీవితంలోకి (వారి ఇంటి మేడపైకి) జ్యోత్స్న (రెజీనా) అనే అమ్మాయి అద్దెకు దిగుతుంది. వీళ్లిద్దరూ అమాంతం ఆమెతో ప్రేమలో పడిపోతారు. ఆమెను దక్కించుకోవటానికి పోటీ పడతారు. అయితే జ్యోత్స మాత్రం తాను ఆల్రెడీ ఇంకొకరితో ప్రేమలో ఉన్నానని వీళ్లద్దిరిని రిజెక్టు చేసి వెళ్లిపోతుంది.

తర్వాత కొంతకాలానికి అన్నదమ్ముల మధ్య దూరం పెరుగుతుంది. 'అంతేకాదు పెళ్లిళ్లు అవుతాయి. ఆ సమయంలో వీరి జీవితాల్లోకి జ్యోత్స్న మళ్ళీ వస్తుంది. వీళ్లిద్దరికీ 'ఐ లవ్‌ యూ' చెప్తుంది. తాను ప్రేమించినవాడిని కాదని.. అప్పటికే పెళ్లి చేసుకొన్న అచ్యుత్‌.. ఆనంద్‌లకి జ్యో 'ఐ లవ్‌ యూ' చెప్పడానికి వెనక కారణమేంటి?అక్కడనుంచి వీరిద్దరి కథ ఏయే మలుపులు తిరిగిందీ? అసలేం జరిగింది, ఎవరికి జ్యోత్స దక్కింది అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

స్లైడ్ షోలో సినిమా హైలెట్స్, మైనస్ లు చదవండి

రచయిత సినిమా ఇది

రచయిత సినిమా ఇది

ఈ సినిమా ఖచ్చితంగా అవసరాలలో ఉన్న పూర్తి స్దాయి రైటర్ ని మేల్కొపిందనే చెప్పాలి. ఎందుకంటే చాలా సన్నివేశాలు చాలా చక్కగా రాసుకుని తెరకెక్కించాడు. కథగా చాలా చిన్న లైన్ ని తనదైన రైటింగ్ స్క్రిల్ తో సినిమా కు సరపడ కథగా మార్చి తెరకెక్కించాడు. ముఖ్యంగా సన్నివేశాలకు తగిన డైలాగులు సినిమాకు బాగా ప్లస్ అయ్యాయి.

నవ్విస్తూనే చివరి వరకూ...

నవ్విస్తూనే చివరి వరకూ...

సినిమాని తొలి నుంచి చివరి వరకూ ఫన్ చేస్తూ నడిపేసాడు. అయితే ఫన్ జరుగుతున్న సమయంలో కూడా తర్వాత ఏం జరుగుతుందనే ఆసక్తిని నిలపెట్టగలగిగాడు. అంతేకాని మైండ్ లెస్ కామెడీ చేయలేదు. లైట్ హార్టెడ్ గా సీన్స్ ని పేర్చుకుంటూ నడిపించేసాడు. అయితే అదే సినిమాకి కొంత మైనస్ గా కూడా అనిపిస్తుంది. ఎక్కడా కథ బలంగా కనిపించక సీరియస్ నెస్ రాలేదు.

కథనంపై పట్టుతో...

కథనంపై పట్టుతో...

సినిమాలో అవసరాల చేసిన స్కీన్ ప్లే మ్యాజిక్ మనలని కట్టిపారేస్తుంది. ముఖ్యంగా కీ రోల్ ..జ్యో కథని హీరోలైన అన్నదమ్ములిద్దరూ వాళ్ల భార్యల ముందు ఎవరికి తోచినట్టుగా వాళ్లు చెబుతారు. ఆ తర్వాత ఇద్దరూ కలిసినప్పుడు అదే కథ మరో కోణంలో తెరపై కనిపిస్తుంది. ఆ లెక్కన ఒకే సన్నివేశాన్ని తెరపై మూడుసార్లు చూడాల్సొస్తుంది. కానీ మనకు ఎక్కడా బోర్ కొట్టనివ్వడు.

హైలెట్ ఇదే...

హైలెట్ ఇదే...

సినిమాలో బెస్ట్ విషయం ఏమిటి అంటే...అవసరాల శ్రీనివాస్ ఈ కథని తెరకెక్కించిన విధానం. చాలా నాచురల్ గా డైలాగులు, సీన్స్ కూర్చుకుని, అంతే సహజత్వం ఉట్టిపడేలా తెరకెక్కించాడు. ఫస్టాఫ్ మొత్తం వన్ లైనర్స్ తో అదరకొట్టాడు. నారా రోహిత్, నాగశౌర్యల మధ్య రిలేషన్ తో వచ్చే సీన్స్ చాలా కన్వీసింగ్ గా, నాచురల్ గా అనిపించాయి.

పాటలు ఎలా ఉన్నాయి

పాటలు ఎలా ఉన్నాయి

సినిమాలో మరో హైలెట్ పాటలు అని చెప్పాలి. సినిమా ధీమ్ కు తగినట్లు చక్కగా కుదిరాయి. దర్శకుడు అభిరుచికి తగినట్లు గా ఎంతో చక్కగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ని సైతం సమకూర్చాడు. అయితే అన్ని పాటలు క్లాస్ గా ఉన్నాయి. మాస్ గా ఉంటాయని ఇలాంటి సినిమాలో ఎక్సపెక్ట్ చేయటం కూడా తప్పే.

సెకండాఫ్ లోనే గండం

సెకండాఫ్ లోనే గండం

ఈ సినిమా ఫస్టాఫ్ ఎంత చక్కగా వెళ్ళిపోయిందో, సెకండాఫ్ సగం నుంచి అంత ఇబ్బంది పెట్టడం మొదలెట్టింది. స్లో పేస్ లో నడిచే సీన్స్ సహనానికి పరీక్ష పెడతాయి. సెకండాఫ్ సగానికి వచ్చేసరికి బోర్ కూడా కొట్టిస్తాయి. కొన్ని సీన్స్ అయితే దారుణంగా డ్రాగ్ చేసి లాక్కుంటూ పోయారు. అయితే క్లైమాక్స్ కు వచ్చేసరికి సర్దుకున్నారు.డైలాగులతో నిలబెట్టే ప్రయత్నం చేసాడు.

ఎవరికి వారే ఇరగదీసారు

ఎవరికి వారే ఇరగదీసారు

హీరోలు ఇద్దరూ చాలా ఇంప్రసివ్ గా చేసారు. ముఖ్యంగా నారా రోహిత్ బరువు 11 కేజీలు తగ్గాను అన్నాడు అదేమీ తెరపై కనిపించలేదు. అది ప్రక్కన పెడితే.. కానీ రోహిత్...ఎమోషన్ ఎపిసోడ్స్ లో చాలా ఎక్సలెంట్ గా చేసాడు. శౌర్య కు అన్నగా మంచి ఫెరఫార్మెన్స్ ఇచ్చాడు. నాగశౌర్య కూడా ఎక్కడా వంక పెట్టలేని విధంగా చేసాడు. రెజీనా అయితే సింపుల్ గా స్టన్నింగ్ చేసేసింది. ఆమె అవుట్ స్టాండింగ్ ఫెరఫార్మెన్స్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించుకోవాలి.

టెక్నికల్ గా ...

టెక్నికల్ గా ...

దిలీప్‌ కెమెరా పనితనం బాగుంది. ఈ బడ్జెట్ లో అంత చక్కటి వర్క్ ,కలర్ ఫుల్ గా అందించి సినిమాను నిలబెట్టే ఫిల్లర్స్ లో ఒకడయ్యాడు. ఎడిటింగ్ కూడా క్రిస్ప్ గా ఉంది కానీ, స్లో అయిన చోట ఇంకొంచెం జాగ్రత్తలు తీసుకుంటే బాగుండేది. ప్రొడక్షన్ వ్యాల్యూస్ కూడా బాగున్నాయి. నిర్మాతల అభిరుచిని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే. దర్శకుడు అభిరుచికి తగ్గట్లు ఖర్చు పెట్టుకుంటూ వెళ్లాడు. మధ్యతరగతి ఇంటి నేపథ్యాన్ని అందంగా, రియలిస్టిక్‌గా చూపించడంలో సినిమాటోగ్రాఫర్, ఆర్ట్ డైరెక్టర్ ప్రతిభను గమనించొచ్చు. కిరణ్ గంటి ఎడిటింగ్ చాలా బాగుంది.

రెజీనా పాత్రలు మరింత డెప్త్

రెజీనా పాత్రలు మరింత డెప్త్

సినిమాకు ప్రాణంగా నిలిచే రెజీనా పాత్రకు మరింత డెప్త్ అవసరం అనిపిస్తుంది. ముఖ్యంగా సెకండాఫ్ లో ఆమె వచ్చిన తర్వాత మరింత క్లారిటీ ఉండి ఉంటే బాగుండేదని మనకు అనిపిస్తుంది. రెజీన్ రివేంజ్ డ్రామా, ఒక ఎంగేజ్‍మెంట్ ఒప్పుకొని, మళ్ళీ చెడగొడ్డడం లాంటివి కథ పరంగా కూడా అనవసరమైనవనే అనిపించటం ఖాయం.

ఎవరెవరు...

ఎవరెవరు...

సంస్థ: వారాహి చలన చిత్ర

నటీనటులు : నారా రోహిత్, నాగ శౌర్య, రెజీనా, పావని గంగిరెడ్డి, సీత, రాజేశ్వరి, హేమంత్, చైతన్య కృష్ణ, తనికెళ్ల భరణి,నాని (గెస్ట్ రోల్ లో) తదితరులు

సంగీతం : శ్రీ కళ్యాణ్ రమణ

సినిమాటోగ్రఫీ: వెంకట్ సి. దిలీప్

ఎడిటింగ్: కిరణ్ గంటి

కథ,స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం : అవసరాల శ్రీనివాస్

నిర్మాత: రజనీ కొర్రపాటి

సమర్పణ: సాయి కొర్రపాటి

విడుదల తేదీ : సెప్టెంబర్ 9, 2016

ఫైనల్ గా ఈ సినిమా దర్శక,నిర్మాతలు క్లాస్ ప్రేక్షకులనే అంటే మల్టిప్లెక్స్ లనే టార్గెట్ చేసినట్లున్నారు. వారిని రీచ్ అయ్యే సత్తా ఈ సినిమాలో ఉంది. ఓవర్ సీస్ ఆడియన్స్ కు కూడా బాగా నచ్చే అవకాసం ఉన్న ఈ సినిమా మాస్ ప్రేక్షకుడు మనస్సుకు కాస్త దూరమే.

English summary
Jyo Achyutananda..One of the cleanest and fun movies in recent times.This movie appeal to class audience. It is a Joy ride to take with.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more