twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    శంకర పరిస్థితి "గోవిందా" నే (శంకర రివ్యూ రేటింగ్ )

    |

    Rating:
    2.0/5
    తాతినేని సత్య ప్రకాష్ దర్శకత్వం లో విడుదలైన శంకరలో హీరో నారా రోహిత్ తన టాలెంట్ నిరూపించుకున్నాడు. రోహిత్, రెజినా కెసెండ్రా జంటగా నటించిన ఈ మూవీ 2011 లో వచ్చిన తమిళ సూపర్ హిట్ మూవీ మౌనగురు కు రీ- మేక్ శంకర' యూనివర్శల్‌ చిత్రం. తప్పకుండా ప్రేక్షకులకు నచ్చుతుంది. ఇటీవలే అదే కాన్సెప్ట్‌తో బాలీవుడ్‌లో 'అకీరా' కూడా వచ్చింది. అయితే తెలుగులో ఈ సినిమా కాస్త ఆలస్యమైంది. తమిళంలో ఈ సినిమా 2011లో విడుదలైంది. బాలీవుడ్‌లో ఇటీవలే విడుదల చేశారు. అందరికీ కనెక్ట్‌ అయ్యే కాన్సెప్ట్‌ కాబట్టి మూడు భాషల్లో వచ్చింది. తమిళ, హిందీల్లో మంచిటాక్ నే తెచ్చుకున్న ఈ సినిమా తెలుగులో ఎలాంటి టాక్ సొంతం చేసుకుందీ..., నారా రోహిత్ కి ఈ సినిమా ఎంతవరకూ ప్లస్ అవుతుందీ అనేది చూస్తే...

    కథలోకి వెళితే.. సమాజానికి తగినట్లు తనను మలచుకోలేక ఇబ్బంది పడే కాలేజీ స్టూడెంట్‌గా నారా రోహిత్ నటించాడు. తన కోపాన్ని అణుచుకోలేక చాలా సందర్భాల్లో చిక్కులు కొనితెచ్చుకతుంటాడు. అతని ప్రవర్తన అతని తల్లికి గానీ సోదరునికి గానీ నచ్చదు. కొన్ని పరిస్థితుల్లో తన సిటీ నుంచి బయటపడతాడు రోహిత్. బెంగుళూరు నుంచి హైదరాబాద్ వస్తున్న కొందరు పోలీసులు ఓ యాక్సిడెంటును చూస్తారు. ఆ ప్రమాదంలో గాయపడిన బెంగుళూరు వ్యాపారి కొడుకును దగ్గరలోని ఆసుపత్రికి తీసుకువెళ్తుండగా వారికి పెద్ద మొత్తంలో సొమ్ము కనిపిస్తుంది. వాళ్ళు ఆ వ్యాపారి కొడుకును చంపేసి ఆ డబ్బుతో ఉడాయిస్తారు. అయితే అనుకోకుండా రోహిత్ ఈ కేసులో చిక్కుకుంటాడు. ఈ కేసు నుంచి బయటపడి తనను నిర్దోషిగా ఎలా నిరూపించుకుంటాడనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. నారా రోహిత్ నిర్దోషిత్వాన్ని నిరూపించుకునేందుకు రెజీనా ఎలా సహాయపడుతుంది. అసలు వీరిద్దరి మధ్యా ప్రేమ కథ ఎలా సాగిందీ అన్న ప్రశ్నలకి సమాధానం కావాలంటే సినిమా చూడాల్సిందే...

    Nara Rohith's Shankara Movie Review Rating

    ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణ నారా రోహిత్ మాత్రమే. మొదటినుంచీ రోహిత్ ఎంచుకునే సబ్జెక్ట్లన్నీ కనీస సామాజిక కోనం నుంచే ఉంటాయి. తాను తనకోసమే కాక పూర్థిస్థాయి నటుడిగా కనిపించటానికే ప్రయత్నించే తత్వం వల్ల రోహిత్ మొత్తం సినిమాని తన భుజాలపై మోసే ప్రయత్నమే చేసాడు. కానీ మౌన గురు స్థాయిని అందుకోవటం లో మాత్రం దర్శకుడు విఫలమయ్యాడనే చెప్పాలి. ఒరిజినల్ లో ఉన్న ఎమోషన్ ని సరిగ్గా క్యారీ చేయలేకపోయాడు. ఇక రెజీనా క్యారెక్టర్ సంగతికి వస్తే హీరోయింగా ఆమెకి కొంతలో కొంత గుర్తింపు ఉన్నా ఎందుకనో ఆ స్కోప్ ని ఉపయోగించుకోలేకపోయింది.రాజీవ్ కనకాల లాంటి మంచి ఆర్టిస్ట్ని కూడా సరిగా వాడుకోలేకపోయారు

    ఆవేశపరుడైన ఓ సాధారణ యువకుడు వ్యవస్థ మీద తిరగబడటం.. ఆ క్రమంలో అనేక ఇబ్బందులు ఎదుర్కోవడం.. చివరికి తన కష్టాలన్నింటినీ అధిగమించి తనను ఇబ్బంది పెట్టిన వాళ్లపై ప్రతీకారం తీర్చుకోవడం నేపథ్యంలో కథ సాగుతుంది. నిజానికి ఒక సంచలనం గా మారాల్సిన కథ యావరేజ్ గా మాత్రమే నిలబడే సినిమాగా "శంకర" తయారయ్యింది. కేవలం నారా రోహిత్ యాక్తింగ్ మాత్రమే చూడాలంటే కథ ఎంత గొప్పదైనా సరైన పద్దతిలో నడవక పోతే ఆ సినిమా పరిస్థితేమిటో శంకరని చూస్తే చెప్పొచ్చు.

    ఇక ప్రధానం గా చెప్పుకోవాల్సిన పాటల సంగతికి వస్తే సినిమాలో అనవసరం అనే విధంగా ఉన్న పాటలు ప్రేక్షకునికి తీవ్ర నిరాశని కలిగిస్తాయి. సాయి కార్థీక్ ఇచ్చిన మ్యూజిక్ ఏమాత్రం ఆకట్టుకోలేదు అన్ని పాటలూ పరమ బోరింగ్ అనిపిస్తాయి అయితే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం కొన్ని సీన్లలో అద్బుతం అనేలా ఉంది. దానికి కెమెరా వర్క్ కూడా తోడై మరీకిందకి వెళ్ళిపోవాల్సిన సినిమాని నిలబెట్టాయి. ఇక మిగతా నటీనటులూ, టెక్నీషియన్ల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది..

    స‌త్య ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమా రెండేళ్ల క్రితం ఎప్పుడో పూర్త‌య్యింది. ఈలోగా నారా రోహిత్ న‌టించిన నాలుగైదు సినిమాలు మొద‌లై.. విడుద‌లై వెళ్లిపోయాయి. వాటి గురించి ప్రేక్ష‌కులూ మ‌ర్చిపోయారు. అయితే శంక‌ర మాత్రం రాలేదు. మ‌ధ్య‌లో చాలాసార్లు విడుద‌ల తేదీ ప్ర‌క‌టించారు.. కానీ వెంట‌నే వాయిదా వేశారు. ఇలా క‌నీసం అర‌డ‌జ‌నుసార్లు జ‌రిగి ఉంటుంది. దాంతో శంక‌ర సినిమాని జ‌నంతో పాటు నారా రోహిత్ కూడా మ‌ర్చిపోయాడు. మొత్తానికి అన్నీ దాటుకొని థియేటర్లోకి వచ్చేసరికే అటు మౌన గురూ, ఇటు బాలీవుడ్ లో వచ్చిన అఖిరాలని కూడా చూసేసిన సగం మంది ప్రేక్షకులు సత్య అనే దర్శకున్ని మురుగ దాస్ తో పోల్చి చూసుకున్నప్పుడు ఇక ఏం జరుగుతుందో చెప్పక్కర్లేదు కదా... అయితే కొంతలో కొంత కనీసం నారా రోహిత్ పెర్ఫార్మెన్స్ శంకరని లాక్కొచ్చే వకాశాలూ లేకపోలేదు...
    ఒక్క మాటలో చెప్పాలంటే "గోవిందా అని పెట్టి ఉంటే బాగా సూటయ్యుండేదేమో"

    English summary
    Nara Rohit played as a angry young man in the film who can't tolerate injustice in society in Sankara released to day is better than a Disaster Movie Review Rating
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X