Narakasura Review హిజ్రాల బ్యాక్‌డ్రాప్‌తో యాక్షన్ థ్రిల్లర్.. నరకాసుర మూవీ ఎలా ఉందంటే?

Rating: 2.75/5

నటీనటులు: రక్షిత్ అట్లూరి, అపర్ణ జనార్ధన్, సంకీర్తన విపిన్, శత్రు, నాజర్, చరణ్ రాజ్, శ్రీమాన్ తేజ్ చరణ్ రాజ్, ఫిష్ వెంకట్, మస్త్ అలీ, లక్ష్మణ్ తదితరులు
రచన, దర్శకత్వం: సెబాస్టియన్ నోవా అకోస్టా
నిర్మాతలు: డాక్టర్ అజ్జా శ్రీనివాస్, కురుమూరు రఘు
సినిమాటోగ్రఫి: నాని చమిడిశెట్టి
ఎడిటింగ్: నవాఫల్ రాజా
బ్యానర్: సుముఖ క్రియేషన్స్
రిలీజ్ డేట్: 2023-11-03

తమిళనాడు, ఆంధ్రా సరిహద్దులోని కేరళకు చెందిన కాఫీ ఎస్టేట్‌లో లారీ డ్రైడర్ శివ (రక్షిత్ అట్లూరి). ఆ ప్రాంతాన్ని ప్రభావితం చేసే పొలిటికల్ లీడర్ నాగమ నాయుడు (చరణ్ రాజ్) అంటే శివకు చెప్పలేనంత ఇష్టం. ఇక తన మనసు దోచుకొన్న మీనాక్షి (అపర్ణ జనార్ధన్)‌ను ప్రేమిస్తుంటాడు. అయితే తాను ప్రేమిస్తున్న మీనాక్షిపై నాగమనాయుడు కుమారుడు ఆది నాయుడు (తేజ చరణ్ రాజ్) మనసు పారేసుకొంటాడు. ఆ క్రమంలో శివ కనిపించకుండా పోతాడు. శివ అదృశ్యం కావడంతో ఇన్స్‌పెక్టర్ (శ్రీమాన్) అతడి అనుచరుల ( ఫిష్ వెంకట్, సలీం ఫేకు మస్త్ ఆలీ)తో కలిసి వెతుకుతుంటాడు.

శివ జీవితంలోకి హిజ్రాలు ఎలా వచ్చారు? శివకు ఎలాంటి సహకారం హిజ్రాల నుంచి లభించింది? శివ అదృశ్యం కావడానికి కారణం ఏమిటి? శివ కనిపించకుండా పోవడంతో నాగమనాయుడు ఎలాంటి ఆవేదనకు లోనయ్యాడు? శివ ప్రేయసి మీనాక్షితో ఆది నాయుడు ఎలా బిహేవ్ చేశాడు? ఆది నాయుడుతో హిజ్రాల పోరాటం ఎలా సాగింది? ఎవరిని వధించడానికి శివ నరకాసురుడిగా మారారు? శివ, మీనాక్షీ ప్రేమ కథకు ఎలాంటి ముగింపు లభించింది అనే ప్రశ్నలకు సమాధానమే నరకాసుర సినిమా కథ.

 Narakasura Review and Rating: Rakshit Atluri performance take next level

తన ప్రాణం కన్న మిన్నగా ప్రేమించే నాయకుడి కుటుంబంతోనే అన్యాయానికి గురైతే.. ఆ యువకుడు చేసే తిరుగుబాటు ఎలా ఉంటుందనే సింగిల్ పాయింట్‌తో దర్శకుడు సెబాస్టియన్ రాసుకొన్న కథ బాగుంది. కథను బలమైన పాత్రలతో చెప్పే ప్రయత్నం బాగుంది. కానీ స్క్రీన్ ప్లే విషయంలో జాగ్రత్త పడి ఉంటే.. నరకాసుర సినిమా మరింత బెటర్ రివేంజ్ డ్రామా అయి ఉండేది. ఈ కథ కోసం రాజీలేకుండా ఎంపిక చేసుకొన్న లోకేషన్లు ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్. యాక్షన్ ఎపిసోడ్స్ మరింత ఆకట్టుకొన్నాయి. లవ్, యాక్షన్, హ్యుమర్, ఎమోషన్స్‌తో సెబాస్టియన్ తొలి చిత్ర దర్శకుడిగా చేసిన ప్రయత్నాన్ని అభినందించాల్సిందే.

 Narakasura Review and Rating: Rakshit Atluri performance take next level

ఫస్టాఫ్‌లో క్యారెక్లర్ల ఎస్టాబ్లిష్‌మెంట్ కోసం కొంత సమయాన్ని ఎక్కువగానే తీసుకొన్నప్పటికీ.. ఇంటర్వెల్‌ ట్విస్టుతో కథను వేగవంతం చేశాడు. ప్రీ క్లైమాక్స్ నుంచి చివరి సీన్ వరకు కంటెంట్ డిజైన్ బాగుంది. గంగా హరతి లాంటి సీన్ క్లైమాక్స్‌కు మరింత బలాన్ని తెచ్చింది. కథ, కథనాలపై మరింత వర్క్ చేసి ఉంటే.. డెఫినెట్‌గా మంచి యాక్షన్ థ్రిల్లర్ అవడానికి అవకాశం ఉండేదనిపిస్తుంది.

నటీనటుల ఫెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. పలాస తర్వాత అలాంటి ఇంటెన్స్ క్యారెక్టర్‌లో రక్షిత్ అట్లూరి కనిపించాడు. శివ పాత్రకు పూర్తిగా న్యాయం చేశాడని చెప్పవచ్చు. లుక్, బాడీ లాంగ్వేజ్, రోల్ పరంగా యాటిట్యూడ్ అన్ని ఫర్‌ఫెక్ట్‌గా కుదిరాయి. చాలా రోజు తర్వాత చరణ్ రాజ్, శత్రు డిఫరెంట్ రోల్‌లో కనిపించారు. నాజర్, శ్రీమాన్, ఫిష్ వెంకట్, సలీం ఫేకూ తమ పాత్ర పరిధి మేరకు రాణించారు. హీరోయిన్లు అపర్ణ జనార్ధన్, సంకీర్తన విపిన్ అందంతోపాటు అభినయంతో ఆకట్టుకొన్నారు.

 Narakasura Review and Rating: Rakshit Atluri performance take next level

సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే.. నాని చమిడిశెట్టి అందించిన సినిమాటోగ్రఫి బాగుంది. ఒరిస్సా, మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లోని అడవుల్లో చేసి యాక్షన్ సన్నివేశాలను అద్బుతంగా తెరకెక్కించారు. ఇక ఈ సినిమాకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరో అదనపు ఆకర్షణగా మారింది. నవాఫుల్ రాజా అందించిన సంగీతం సినిమాకు బలంగా మారింది. వంశీ కృష్ణ ఎడిటింగ్, ఆర్ట్ విభాగాల పనితీరు బాగుంది. డాక్టర్ అజ్జా శ్రీనివాస్, కురుమురు రఘు అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. క్వాలిటీ ప్రొడక్షన్ వ్యాల్యూస్‌తో సినిమా రిచ్‌గా కనిపించింది.

ఢిఫరెంట్ కంటెంట్, కాన్సెప్ట్‌తో యాక్షన్, లవ్, ఎమోషన్స్ అలాంటి అంశాలతో రూపొందించిన చిత్రం నరకాసుర. తొలి చిత్ర దర్శకుడిగా సెబాస్టియన్ అనేక ప్రతికూలతను ఎదురించి సినిమాను ఫీల్‌గుడ్‌గా మలచడంలో సఫలమయ్యారు. రక్షిత్ అట్లూరి ఫెర్ఫార్మెన్స్ సినిమాను మరో మెట్టు ఎక్కించే ప్రయత్నం చేశాడు. ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్‌తో రూరల్, నేటివిటీ సినిమాలను ఆదరించే వారికి నరకాసుర నచ్చుతుంది. కొత్త, పాత నటుల కలయికలో చేసిన ప్రయత్నం బాగుంది. అంచనాలు లేకుండా వెళితే కొత్త అనుభూతిని పొందే అంశాలు ఉన్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X