twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Narappa మూవీ రివ్యూ: వెంకటేష్ ఫెర్ఫార్మెన్స్ ఎలా ఉందంటే!

    |

    Rating:
    2.5/5
    Star Cast: వెంకటేష్, ప్రియమణి, కార్తీక్ రత్నం, రావు రమేష్, రాజీవ్ కనకాల, నరేన్
    Director: శ్రీకాంత్ అడ్డాల

    కోవిడ్19 కారణంగా థియేటర్లు మూత పడటంతో దేశవ్యాప్తంగా సినిమాల రిలీజ్ నిలిచిపోయాయి. థియేటర్లలో మూవీ రిలీజ్‌కు సానుకూల పరిస్థితుల లేకపోవడంతో నిర్మాతలకు ఓటీటీలే శరణ్యమయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో విడుదలైన చిత్రం నారప్ప. తమిళంలో భారీ హిట్‌ను, అలాగే ప్రేక్షకులను తన నటనతో ఆకట్టుకొన్న ధనుష్ నటించిన అసురన్‌ చిత్రం నారప్పగా అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే అసురన్ భారీ అంచనాలను సెట్ చేసినందున ఆ ఎక్స్‌పెక్టేషన్స్‌ను నారప్ప అందుకొన్నాడా? అనే విషయాన్ని ఓసారి పరిశీలిద్దాం....

    నారప్ప కథ

    నారప్ప కథ

    అనంతరపురం జిల్లాలోని మారుమూల గ్రామంలోని భూస్వామి పండుస్వామి (నరేన్)కు నారప్ప కుటుంబానికి భూ తగదా చోటుచేసుకొంటుంది. ఆ తగాదాలో భాగంగా నారప్ప పెద్ద కుమారుడు మునికణ్ణని పండుస్వామి మనుషులు హత్య చేస్తారు. తన అన్న హత్యకు ప్రతీకారంగా పండుస్వామిని సిన్నప్ప హత్య చేస్తాడు. దాంతో తన చిన్న కుమారుడి ప్రాణాలను దక్కించుకోవడానికి నారప్ప కుటుంబం గ్రామాన్ని వదలి వెళ్తుంది.

    కథలోని ట్విస్టులు

    కథలోని ట్విస్టులు

    భూస్వామి, నారప్ప కుటంబాల మధ్య గొడవలకు అసలు కారణం ఏమిటి? భూస్వామి ఆగడాలను పెదవి పంటి కింద నొక్కి పెట్టి ఎందుకు సహనాన్ని నారప్ప ప్రదర్శించాడు. తన చిన్న కుమారుడి ప్రాణాలను దక్కించుకోవడానికి నారప్ప ఏం చేశాడు? చివరకు పండుస్వామి కుటుంబానికి, నారప్ప కుటుంబానికి మధ్య ఏం జరిగింది అనే ప్రశ్నలకు సమాధానమే నారప్ప సినిమా కథ.

    కథ, కథనాలు ఎలా ఉన్నాయంటే

    కథ, కథనాలు ఎలా ఉన్నాయంటే

    అసురన్ కథ బలమైనది కాబట్టి దానిని ఆత్మను గానీ, కథలోని పాత్రలను ఏ మాత్రం మార్చకుండా ఎమోషన్స్ పండించేందుకు దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల ప్రయత్నించాడు. కానీ ఒరిజినల్‌ కథలోని ఎమోషన్స్‌ను నిలబెట్టడంలో విఫలమయ్యారనే చెప్పాలి. ఎందుకుంటే పెర్ఫార్మెన్స్‌ పరంగా ధనుష్ ఓ మైలురాయిని సెట్ చేశాడు. వెంకటేష్ తన పాత్రకు, సినిమాకు న్యాయం చేయాలని ప్రయత్నించినప్పటికీ.. ఏదో అసంతృప్తి వెంటాడుతూనే ఉంటుంది. కాకపోతే నారప్పగా వెంకటేష్ తన పాత్రలో ఒదిగిపోయాడు. ఇప్పటి వరకు వెంకటేష్ ఒక ఎత్తైతే.. నారప్పగా విక్టరీ మరో ఎత్తు అని చెప్పవచ్చు. అన్ని రకాలుగా ఎలాంటి రిస్క్ తీసుకొకుండా కథను నడిపించే ప్రయత్నం చేశారని చెప్పవచ్చు.

    సెకండాఫ్‌లో ఫ్లాష్ బ్యాక్

    సెకండాఫ్‌లో ఫ్లాష్ బ్యాక్

    కాకపోతే సెకండాఫ్‌ ఫ్లాష్‌ బ్యాక్‌లో వెంకీ ప్రభావం చూపలేకపోయారని చెప్పవచ్చు. సెకండాఫ్‌లో ఉండే తన పాత జీవితం సినిమా మొత్తానికి ప్రాణం. ఆ పార్ట్‌ను ఎఫెక్టివ్‌గా చూపలేకపోయారనేది స్పష్టంగా కొట్టిచ్చినట్టు కనిపిస్తుంది. యువ నారప్పగా వెంకటేష్ మెప్పించలేకపోయాడనే చెప్పాలి. ఓవరాల్‌గా అసలు కథ, కథనాలు, కథలో ఆత్మను నిలబెట్టే ప్రయత్నం అభినందనీయంగా పేర్కొన్నాలి. వెంట్రీ మారన్ అనుసరించిన పంథాను శ్రీకాంత్ అడ్డాల ఫాలో అయిపోవడమే తప్ప కొత్తగా ఆయన అంటెంప్ట్ చేయలేనదని కనిపిస్తుంది. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌ చాలా వీక్‌గా ఉంటుంది. శ్రీకాంత్ అడ్డాల పరిస్థితి ముందుకెళ్తే గొయ్యి.. వెనుకకు వెళ్తే నుయ్యి అనే విధంగా మారింది. సొంత క్రియేటివిటిని యూజ్ చేసుకోవడానికి అవకాశమే చిక్కలేదని చెప్పవచ్చు.

    వెంకటేష్ ఫెర్ఫార్మెన్స్

    వెంకటేష్ ఫెర్ఫార్మెన్స్


    ఇక వెంకటేష్ నారప్పగా తన పాత్రలో జీవించేందుకు ప్రయత్నం చేశాడు. ధనుష్‌ ఫెర్ఫార్మెన్స్‌ను పక్కన పెడితే వ్యక్తిగతం ఆయన 100 శాతం న్యాయం చేశాడు. కీలక సన్నివేశాల్లో తన మార్కు నటనను ప్రదర్శించాడు. కుమారుడు చనిపోయిన సీన్లలో, గ్రామ ప్రజల కాళ్లు మొక్కే సన్నివేశాల్లో, అలాగే క్లైమాక్స్‌లోని కోర్టు సీన్లలో వెంకీ అద్బుతంగా కనిపించాడు.

    ప్రియమణి, ఇతర పాత్రల్లో

    ప్రియమణి, ఇతర పాత్రల్లో

    ఇక ప్రియమణి కూడా పక్కా గ్రామీణ మహిళగా తన పాత్రలో ఒదిగిపోయారు. కొన్ని సన్నివేశాల్లో ఫీల్‌గుడ్ ఎమోషన్స్‌తో ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేశారు. పౌరుషంతో కూడిన పాత్రలో హావభావాలను మంచిగా ప్రదర్శించారు. సెకండాఫ్‌లో అమ్ము అభిరామి ఒకే అనిపించారు. రాజీవ్ కనకాల, నరేన్, కార్తీక్ రత్నం, నాజర్, రావు రమేష్ తమ పాత్రల పరిధి మేరకు ఓకే అనిపించారు.

    టెక్నికల్ విభాగాల పనితీరు..

    టెక్నికల్ విభాగాల పనితీరు..

    ఇక టెక్నికల్ విభాగాల పరితీరు విషయానికి వస్తే.. సినిమాటోగ్రఫి నారప్ప సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా మారాయి. పల్లెటూరు, కొండలు, గుట్టలు, పంటపొలాలను తెరపైన
    సహజంగా ఉండేలా చర్యలు తీసుకొన్నారు. మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. పాటలు అంతగా ఆకట్టుకోలేకపోయాయి. మార్తాండ్ కే వెంకటేష్ ఎడిటింగ్ బాగుంది. సురేష్ ప్రొడక్షన్స్ వీ క్రియేషన్స్ నిర్మాణ విలువలు వారి స్థాయికి తగినట్టు ఉన్నాయి.

    ఫైనల్‌గా ఎలా ఉందంటే.

    ఫైనల్‌గా ఎలా ఉందంటే.

    నారప్ప సినిమాను అసురన్‌తో పోల్చి చూస్తే నటీనటుల ఫెర్ఫార్మెన్స్‌ విషయంలో ఆమడ దూరంలో ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ నారప్పను పోలికలు లేకుండా చూస్తే.. తెలుగు ప్రేక్షకులను మెప్పించే రీతిలో ఉందని చెప్పవచ్చు. వెంకటేష్, ప్రియమణి, కార్తీక్ రత్నం, ఇతర నటీనటులు తమ పరిధిని మించి నటించారు. నారప్ప చిత్రం రిస్క్ లేకుండా చేసిన ప్రయత్నం అని చెప్పవచ్చు. మొదటిసారి చూసిన ప్రేక్షకులకు మాత్రం థ్రిల్ అవ్వడానికి కొన్ని అంశాలు ఉన్నాయి.

    నటీనటులు, సాంకేతిక నిపుణులు

    నటీనటులు, సాంకేతిక నిపుణులు

    నటీనటులు: వెంకటేష్, ప్రియమణి, కార్తీక్ రత్నం, రావు రమేష్, రాజీవ్ కనకాల, నరేన్ తదితరులు
    దర్శకత్వం: శ్రీకాంత్ అడ్డాల
    కథ, స్క్రీన్ ప్లే: వెంట్రీ మారన్
    నిర్మాతలు: కలైపులి ఎస్ థాను, డీ సురేష్ బాబు
    సినిమాటోగ్రఫి: శ్యామ్ కే నాయుడు
    మ్యూజిక్: మణిశర్మ
    ఎడిటింగ్: మార్తాండ్ కే వెంకటేష్
    ఓటీటీ రిలీజ్: అమెజాన్ ప్రైమ్ వీడియో
    ఓటీటీ రిలీజ్: 2021-07-20
    బ్యానర్స్: సురేశ్ ప్రోడక్షన్స్, వీ క్రియేషన్స్

    English summary
    Narappa movie review and rating: Victory Venkatesh Latest movie is Narappa. This movie is releasing on July 20 in Amazon Prime Video.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X