Narayana & Co Review కామెడీ, సస్పెన్స్ డ్రామా.. నారాయణ అండ్ కో సినిమా ఎలా ఉందంటే?

Rating:
2.5/5

నటీనటులు: సుధాకర్‌ కోమాకుల, ఆర్తిపొడి, దేవీ ప్రసాద్‌, ఆమని, పూజ కిరణ్‌, సప్తగిరి, తోటపల్లి మధు తదితరులు
స్క్రీన్ ప్లే, దర్శకత్వం: చిన్నా పాపిశెట్టి
నిర్మాత: పాపిశెట్టి బ్రదర్స్‌, సుధాకర్‌ కోమాకుల
కథ: రవి గోలి
డైలాగ్స్: రాజీవ్ కోసనం
బ్యాక్ గ్రౌండ్ స్కోర్: కమ్రాన్
ఎడిటర్: సృజన అడుసుమిల్లి
సంగీతం: సురేశ్‌ బొబ్బిలి, డాక్టర్‌ జోస్యభట్ల, నాగవంశీ, జోశ్యభట్ల శర్మ
సినిమాటోగ్రఫి: రాహుల్ శ్రీవాస్తవ్
రిలీజ్ డేట్: 2023-06-30

బ్యాంక్ క్యాషియర్‌గా పనిచేసే నారాయణ (దేవీ ప్రసాద్), తన భార్య జానకి (ఆమని), కొడుకులు ఆనంద్ (సుధాకర్ కోమాకుల), సుభాష్ (జై కృష్ణ)తో కలిసి మధ్య తరగతి జీవితాన్ని లాక్కొస్తుంటారు. ఆనంద్, సుభాష్ చెడు అలవాట్ల కారణంగా ఆర్థికంగా ఇబ్బందిలో పడుతారు. అప్పులు ఊబిలో కూరుకుపోయిన ఈ కుటుంబం 60 లక్షలు చెల్లించాల్సి వచ్చి.. పోలీస్‌ ఉద్యోగం చేయబోయి రౌడీగా మారిన సూర్యభాయ్‌తో కోటి రూపాయల డీల్ కుదుర్చుకొంటారు. సూర్యభాయ్‌తో అగ్రిమెంట్ తర్వాత ముంబై నుంచి ఓ పిల్లి బొమ్మను తీసుకు రావడానికి నారాయణ కుటుంబం ప్లాన్ చేస్తుంది.

Narayana & Co Telugu movie Review and Rating

ఆనంద్ ఎలాంటి చెడు అలవాట్లతో అప్పుల బారిన పడ్డాడు? ప్రేయసి కోసం సుభాష్ 10 లక్షల రూపాయలు చెల్లించాల్సిన అవసరం ఏమొచ్చింది. క్యాషియర్‌గా పనిచేసే నారాయణ ఉద్యోగాన్ని ఎలా పోగొట్టుకొన్నాడు. ఆనంద్ మరదలు నారాయణ కుటుంబంతో ఎందుకు కలిసింది? ముంబై నుంచి పిల్లి బొమ్మను తెచ్చి కోటి రూపాయలు సంపాదించారా? కోటి రూపాయలతో అప్పుల తీర్చుకొన్నారా? పిల్లి బొమ్మలో ఏమున్నది? పిల్లి బొమ్మ ఎలాంటి కష్టాలను తెచ్చిపెట్టింది అనే ప్రశ్నలకు సమాధానమే నారాయణ అండ్ కో సినిమా కథ.

కామెడీ, సస్పెన్స్ అంశాలతో దర్శకుడు చిన్నా పాపిశెట్టి రాసుకొన్న పాయింట్ బాగుంది. కానీ కథగా మలిచే విషయంలో కాస్త తడబాటు కనిపిస్తుంది. ఫస్టాఫ్‌ను బాగా డీల్ చేసి ఉంటే.. మంచి కామెడీ ఎంటర్‌టైనర్ అయి ఉండేదనిపిస్తుంది. అయితే సెకండాఫ్‌ను పిల్లి బొమ్మ డ్రామాతో డీల్ చేసిన విధానం బాగుంది. క్లైమాక్స్‌ను త్వరగా ముగించి ఉంటే ఫీల్‌గుడ్‌గా ఉండేదనిపిస్తుంది.

Narayana & Co Telugu movie Review and Rating

నటీనటుల ఫెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. నారాయణ అనే పాత్ర చుట్టూ అల్లుకొన్న పాత్రలు కావడంతో దేవీ ప్రసాద్ పాత్ర ప్రధానంగా కనిపిస్తుంది. దేవీ ప్రసాద్‌ ఫుల్ లెంగ్త్ పాత్రతో ఆకట్టుకొన్నారు. ఆనంద్‌గా సుధాకర్ కోమాకుల ఫెర్ఫార్మెన్స్. బాడీ లాంగ్వేజ్ బాగుంది. ఆయన చూపించిన ఎనర్జీ, డ్యాన్సులు ఆకట్టుకొన్నాయనే చెప్పాలి. సుధాకర్ కోమాకుల ఈ సినిమాను తన యాక్టింగ్‌తో నిలబెట్టాడనే చెప్సాలి. నారాయణ అండ్ కో సినిమాలో సుభాష్‌గా నటించిన జై కృష్ణ మంచి కామెడీ టైమింగ్‌ను చూపించాడు. ఆమని, తోటపల్లి మధు, సప్తగిరి, అలి రెజా తమ పాత్రలకు న్యాయం చేశారు.

Narayana & Co Telugu movie Review and Rating

సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే.. మ్యూజిక్ ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్. ఫస్టాఫ్‌లో రెండు పాటలు బాగున్నాయి. పూర్ణాచారి, కాసర్ల శ్యామ్ అందించిన పాటలు బాగున్నాయి. సెకండాఫ్‌లో రాజుల వేషాలతో వేసిన పాట బాగుంది. ఈ పాటకు సినిమాటోగ్రాఫర్ రాహుల్ శ్రీవాస్తవ వాడుకొన్న లైటింగ్ బాగుంది. ఈ సినిమాలోని సన్నివేశాల కోసం రాహుల్ శ్రీవాస్తవ ఉపయోగించిన కలర్ ప్యాటర్న్ సినిమాను రిచ్‌గా మార్చింది. ఫస్టాఫ్‌లో దాదాపు 10 నిమిషాలు, సెకండాఫ్‌ క్లైమాక్స్‌లో కొంత కత్తిరించాల్సిన అవసరం ఉంది.

నారాయణ అండ్ కో సినిమా ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగున్నాయి. పాపిశెట్టి బ్రదర్స్‌, సుధాకర్‌ కోమాకుల అనుసరించిన నిర్మాణ విలువలు సినిమాను రిచ్‌గా మార్చాయి. కామెడీ సినిమాలను ఆదరించే వారికి ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X