Nari Nari Naduma Murari First Review: నారి నారి నడుమ మురారీ ఫస్ట్ రివ్యూ
యువ హీరో, హీరోయిన్లు శర్వానంద్, సంయుక్త మీనన్, సాక్షి వైద్య నటించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ నారి నారి నడుమ మురారి. ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ ఏకే ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నిర్మాతలు అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర నిర్మించారు. ఈ సినిమాకు యువ దర్శకుడు రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో సత్య, వీకే నరేష్, సుదర్శన్, సంపత్ రాజ్, శ్రీకాంత్ అయ్యంగార్, సునీల్, వెన్నెల కిషోర్, గెటప్ శ్రీను తదితరులు నటించారు.
హాస్య ప్రధానంగా రూపొందిన ఈ సినిమాకు భాను భోగవరపు కథను అందించగా, నందు సావిరిగన డైలాగ్స్ రాశారు. జీ శేఖర, యువరాజ్ సినిమాటోగ్రఫిని, విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ అందించారు. సంక్రాంతి కానుకగా ఈ సినిమా జవవరి 14వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్నది. ఈ సినిమా సెన్సార్ ఫార్మాలిటీస్, రన్‌టైమ్ గురించిన వివరాల్లోకి వెళితే..

శర్వానంద్ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌తో మరోసారి సంక్రాంతి బరిలో దూకాడు. ఇద్దరు హీరోయిన్లతో రొమాంటిక్ లవ్ స్టోరీతో తన అదృష్టాన్ని పరీక్షించుకొనేందుకు రెడీ అయ్యారు. ఈ క్రమంలో ఇటీవల ఈ మూవీ సెన్సార్ ఫార్మాలిటీస్ ముగించుకొన్నది. ఈ సినిమాలోని కొన్ని అడల్ట్ ఫ్లేవర్ ఉన్న డైలాగ్స్, సన్నివేశాలపై సెన్సార్ నుంచి స్వల్ప అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. సెన్సార్ ప్రతినిధులు, అధికారుల సూచనలు, సలహాలను పాటించి వారిని కన్విన్స్ చేసే విధంగా మార్పులు చేశారు. దాంతో ఈ సినిమా సెన్సార్ ఎలాంటి వివాదాలు లేకుండా ముగిసింది అని చిత్ర యూనిట్ సభ్యులు తెలిపారు.
ఇద్దరు భామల మధ్య నలిగిపోయే యువకుడి పాత్రలో శర్వానంద్ నటించిన ఈ సినిమాకు సెన్సార్ అధికారులు క్లీన్ సర్టిఫికెట్ జారీ చేశారు. ఈ సినిమాకు యూఏ (UA13+) సర్టిఫికెట్ ఇచ్చారు. ఈ సర్టిఫికెట్ ప్రకారం 13 ఏళ్లకు పైబడిన ప్రతీ ఒక్కరు ఎలాంటి అభ్యంతరాలు లేకుండా చూడొచ్చు. 13 ఏళ్లకు దిగువన ఉన్న వారు తల్లిదండ్రుల పర్యవేక్షణలో చూడాల్సి ఉంటుంది అని సెన్సార్ జారీ చేసిన నిబంధనల్లో పేర్కొన్నారు.
ఇక సినిమా కథను మరీ సాగదీయకుండా లెంగ్త్ విషయంలో చిత్ర యూనిట్ సరైన జాగ్రత్తలు తీసుకొన్నట్టు స్పష్టమైంది. ఈ సినిమా నిడివి 2 గంటల 25 నిమిషాలకు అంటే 145 నిమిషాల రన్‌టైమ్‌కు పరిమితం చేశారు. దాంతో ఈ సినిమా క్రీస్పీగా, ల్యాగ్ లేకుండా ఉండే అవకాశం ఉందనే అభిప్రాయం కలుగుతున్నది.
ఈ సినిమాలో సత్య, వెన్నెల కిషోర్ కామెడీ ట్రాక్స్ బాగున్నాయి. అలాగే ఎమోషనల్ కంటెంట్ కూడా ఆడియెన్స్‌ను మెప్పిస్తుంది అనే విషయాలు సెన్సార్ రివ్యూ తర్వాత టాక్ పాజిటివ్‌గా మారింది. అంతేకాకుండా ఇటీవల రిలీజైన ట్రైలర్ కూడా మరింత పాజిటివిటీని జోడించింది. అయితే భారీ సినిమాల మధ్య ఈ చిత్రం ఏ మేరకు ప్రేక్షకులను మెప్పించి హిట్ టాక్‌ను సొంతం చేసుకొంటుంది అనే సందేహం అందరిలోను ఉంది. ఈ సినిమా గురించిన ఎక్స్‌క్లూజివ్ స్టోరీలు, రివ్యూ కోసం ఫిల్మీబీట్‌ను ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications











