Nari Nari Naduma Murari Twitter Review: నారీ నారీ నడుమ మురారి మూవీ ట్విట్టర్ రివ్యూ

రామ్ అబ్బరాజు దర్శకత్వంలో శర్వానంద్, సంయుక్త మీనన్, సాక్షి వైద్య నటించిన చిత్రం నారీ నారీ నడుమ మురారి. ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ ఏకే ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై అనిల్ సుంకర, రామబ్రహ్మం సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రంలో సత్య, వీకే నరేష్, సుదర్శన్, సంపత్ రాజ్, శ్రీకాంత్ అయ్యంగార్, సునీల్, వెన్నెల కిషోర్, గెటప్ శ్రీను తదితరులు నటించారు. ఈ సినిమాకు భాను భోగవరపు స్టోరీని అందించగా.. నందు సావిరిగన సంభాషణలు రాశారు. జీ శేఖర, యువరాజ్ సినిమాటోగ్రఫిని, విశాల్ చంద్రశేఖర్ సంగీత దర్శకత్వం వహించారు.

సంక్రాంతి కానుకగా జనవరి 14న సాయంత్రం 5.49 గంటలకు నారీ నారీ నడుమ మురారి మూవీ వరల్డ్ వైడ‌గా ప్రేక్షకుల ముందుకురానుంది. ప్రమోషనల్ కంటెంట్ మూవీపై భారీ క్రేజ్ పెంచింది. ఈ క్రమంలో ప్రారంభమైన అడ్వాన్స్ బుకింగ్‌కు భారీ స్పందన లభిస్తున్నది. ఈ నేపథ్యంలో నారీ నారీ నడుమ మురారి గురించి నెటిజన్లు, క్రిటిక్స్ వెల్లడించిన వివరాల్లోకి వెళితే..

Nari Nari Naduma Murari Twitter Review in Telugu  Is Sharwanand s Movie hits the bulls eye

శర్వానంద్ సంక్రాంతికి మరో ఎంటర్‌టైన్‌మెంట్ ఫీస్ట్ ఇచ్చాడు. సత్య కామెడీ బాగా నవ్వించింది. ఇది నెక్ట్స్ లెవల్ ఫన్. క్లైమాక్స్ ఎమోషనల్‌గా కనెక్ట్ అయి డెప్త్‌‌ అనిపించింది. పండక్కి పర్‌ఫెక్ట్‌గా బిగ్‌ స్క్రీన్ మీద చూడదగ్గ చిత్రం. దీనికి నా రేటింగ్ 3.75/5 అని ఓ నెటిజన్ రివ్యూ ఇచ్చాడు.

మూవీ స్టార్ట్ అవ్వడం సూపర్ ఫన్ ట్రాక్‌తో స్టార్ట్ అవుతుంది. సత్య కామెడీ కేక ఉంటాది. ఫస్టాఫ్ సూపర్ ఫన్, ఎమోషనల్. సెకండాఫ్ కూడా ఫన్ అదురుద్ది. శ్రీవిష్ణు కామియో సూపర్. నారీ నారీ నడుమ మురారితో శర్వానంద్ బ్లాక్‌బస్టర్ కొట్టేశాడు అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.

ఇప్పుడే నారీ నారీ నడుమ మురారి సినిమాను చూశా. మూవీ బిగినింగ్ నుంచి ఎండ్ కార్డ్ వరకు ఆసాంతం నవ్వుతూనే ఉన్నా. సత్య, నరేష్ కామెడీ సీన్స్ బాగా వర్కవుట్ అయ్యాయి. మ్యారేజ్ ట్రాక్ ఫన్‌గా ఉంది. మీ కుటుంబాలతో వెళ్లి ఈ సినిమాను చూసి ఎంజాయ్ చేయమని స్ట్రాంగ్‌గా రికమెండ్ చేస్తానని ఓ అభిమాని రివ్యూ ఇచ్చాడు.

ఫస్టాఫ్ చాలా బాగుంది. సత్య ఎంట్రీ, శర్వానంద్, నరేష్ గారి ఎపిసోడ్స్ సూపర్. సెకండాఫ్ అయితే చెబుతున్నా మామూలుగా నవ్వుకోరు. క్లైమాక్స్ కొంచెం డిఫరెంట్‌గా తీశాడు. పర్ఫెక్ట్ సంక్రాంతి మూవీ అని ఓ నెటిజన్ పోస్ట్ పెట్టాడు.

ఫస్టాఫ్ సర్‌ప్రైజింగ్‌గా, ఎంగేజింగ్‌గా ఉంది. హ్యూమర్, కంటెంట్ బాగా వర్క్ అయ్యింది. రచయితలు రామ్, భాను, నందులు పంచ్ డైలాగ్స్‌తో ఎంటర్‌టైన్ చేశారు. సెకండాఫ్ కూడా సేమ్ వైబ్ ఉంటే సంక్రాంతి రేస్‌లో స్ట్రాంగ్ కంటెండర్ అని ఓ యూజర్ రివ్యూ ఇచ్చాడు.

ఫస్టాఫ్ చాలా బాగుంది. నెల్లూరు సుదర్శన్, శర్వానంద్, సునీల్, నరేష్‌ల కాంబో డబుల్ క్లిక్ అయ్యింది. మ్యారేజ్ రిజిస్ట్రార్ సీన్స్, ఇంటర్వెల్ ట్విస్ట్ సూపర్ అని ఓ నెటిజన్ కామెంట్ పెట్టాడు.

ఫస్టాఫ్ ఎంటర్‌టైనింగ్‌గా ఉంది. శర్వానంద్, ఇతర నటీనటుల పర్ఫార్మెన్స్ బాగుంది. కామెడీ బాగా వర్కవుట్ అయ్యింది. స్క్రీన్ ప్లే, సంగీతం, బీజీఎం అదిరిపోయాయి. కొన్ని కామెడీ సీన్స్ అయితే చాలా బాగున్నాయని ఓ యూజర్ రివ్యూ ఇచ్చాడు.

ప్రేక్షకులకు సర్‌ప్రైజ్.. చక్కని హాస్యం, సాలీడ్ కంటెంట్‌తో ఈ సినిమా నిండిపోయింది. రచయితలు రామ్, భాను, నందుల నాన్‌స్టాప్ పంచ్ డైలాగులు, సరదా సంభాషణలు బాగున్నాయి. సెకండాఫ్ ఇదే ఊపును కొనసాగిస్తే దీనికి బలమైన సామర్ధ్యం ఉంటుంది అని ఓ నెటిజన్ పోస్ట్ చేశాడు.

నారీ నారీ నడుమ మురారి ఫస్టాఫ్ మంచి స్టోరీ లైన్‌తో సందర్భోచితమైన హాస్యంతో ఆకట్టుకుంది. చాలా వరకు హాస్యం బాగా పండింది. నరేష్ తన అద్భుతమైన నటనతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. కొన్ని సంభాషణలు, సన్నివేశాలు విభిన్నంగా, కొత్తగా అనిపిస్తాయి. ఇవి చక్కటి వినోదాన్ని పండేలా చేశాయి. సెకండాఫ్ కోసం వెయిట్ చేస్తున్నానని ఓ యూజర్ ట్వీట్ చేశాడు.

ఆల్రెడీ థియేటర్‌లో 1 గంట అయ్యింది. సినిమా చాలా బాగుంది. రేపటి నుంచి ఫ్యామిలీస్‌తో జోరు మామూలుగా ఉండదు అనిపిస్తుంది అని ఓ నెటిజన్ పోస్ట్ పెట్టాడు.

శర్వానంద్‌కి 9 ఇయర్స్ నుండి మంచి హిట్ లేదు. నారీ నారీ నడుమ మురారి పెద్ద హిట్ అవ్వాలి. పెద్ద హిట్ అందుకోవడానికి ఆయన అర్హుడు అని ఓ యూజర్ కామెంట్ పెట్టాడు.

మళ్లీ శతమానం భవతి లాంటి మంచి హిట్ వచ్చేలా ఉందిగా శర్వానంద్ అన్నా. ట్రైలర్ కూడా బాగుంది. ఫ్యామిలీ మొత్తం పండగకి కలిసి హ్యాపీగా చూసేయొచ్చు అని ఓ అభిమాని పోస్ట్ పెట్టాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X