Narivetta First Review: నరివెట్టా మలయాళ మూవీ ఫస్ట్ రివ్యూ.. టొవినో థామస్ మూవీ ఎలా ఉందంటే?

వరుస విజయాలు, విభిన్నమైన పాత్రలతో మలయాళ స్టార్ హీరో టొవినో థామస్ నటించిన తాజా చిత్రం నరివెట్టా. పొలిటికల్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాకు అనురాజ్ మనోహర్ దర్శకత్వం వహించారు. ఇండియన్ సినిమా కంపెనీ బ్యానర్‌పై టిప్పుషాన్, శియాస్ హసన్ నిర్మాతలుగా ఈ సినిమాను రూపొందించారు. మే 23వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్న ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ రివ్యూ వివరాల్లోకి వెళితే..

పోలీస్, పొలిటికల్ బ్యాక్ డ్రాప్‌తో వస్తున్న ఈ చిత్రంలో టొవినో థామస్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నారు. ఈ సినిమాలో సూరజ్ మెంజరామూడు, చెరన్, ఆర్య సలీమ్, గాయత్రి, రీని ఉదయకుమార్, ప్రియంవద కృష్ణన్ తదితరులు నటించారు. ఈ సినిమాకు జేక్స్ బిజోయ్ సంగీతం అందించారు. విజయ్ సినిమాటోగ్రాఫర్‌గా, షామీర్ మహ్మద్ ఎడిటర్‌గా బాధ్యతలు వహించారు.

Narivetta Censor Review

ఈ సినిమా కథ విషయానికి వస్తే.. మారుమూల ప్రాంతంలో రాజకీయ నేతల భూ కబ్జాలపై కొత్తగా డ్యూటీలో జాయిన్ అయిన నిజాయితీగా పనిచేసే జూనియర్ పోలీస్ ఆఫీసర్ కథ. పూర్తి యాక్షన్, ఎమోషన్స్ మేళవించి ఈ సినిమా సాగుతుందనే విషయంపై మలయాళ సినిమా పరిశ్రమలో చర్చ జరుగుతున్నది. పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా టొవినో థామస్ డిఫరెంట్‌గా గెటప్‌లోనే కాకుండా పెర్ఫార్మెన్స్‌తో కూడా ఆకట్టుకొంటాడనే విషయం సినిమాపై అంచనాలు పెంచేలా చేసింది.

తమిళ నటుడు చరణ్ నరివెట్టా సినిమా ద్వారా మలయాళ రంగంలోకి తొలిసారి ప్రవేశిస్తున్నాడు. అమాయకులైన గ్రామస్థులకు, కుటిల బుద్ది ఉన్న రాజకీయ నేతలకు మధ్య జరిగే సంఘర్షణలో యువ పోలీస్ ఆఫీసర్ అసాంఘీక శక్తులకు అడ్డుగా నిలిచే కథ పవర్‌ఫుల్‌గా ఉండటం, అలాగే మావోయిస్లుల నిరసనలు, ఇతర విప్లవకారుల ఆందోళనలు గురించిన అంశాలు టీజర్, ట్రైలర్ ద్వారా ప్రేక్షకుల దృష్టిని ఆకట్టుకొన్నాయి.

Take a Poll

ఇలాంటి విలక్షణమైన కథ, కథనాలతోపాటు పక్కా రూరల్ నేటివిటితో వస్తున్న ఈ సినిమాను ఇటీవల సెన్సార్ బోర్డు ఆఫ్ ఫిలిం సర్టిఫికెట్ వీక్షించారు. ఇంటెన్స్ పొలిటికల్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రంపై వారు సంతృప్తిని వ్యక్తం చేశారు. అలాగే ఈ సినిమాలోని సన్నివేశాలను చిత్రీకరించిన విధానం మూవీకి హైలెట్‌గా ఉన్నాయి అని వారు చెప్పారని చిత్ర యూనిట్ వెల్లడించింది.

హై యాక్షన్, ఎమోషన్స్‌తో రూపొందిన సినిమాపై తీవ్రమైన అభ్యంతరాలు వెల్లడించలేదు. నటీనటుల పెర్ఫార్మెన్స్, సాంకేతిక నిపుణుల పనితీరుపై ప్రశంసలు గుప్పించారు. టెక్నికల్ బ్రిల్లియెన్స్, కథలోని భావోద్వేగాలను సన్నివేశాలుగా మలిచిన తీరు బాగున్నాయని చెప్పినట్టు తెలిసింది. ఈ సినిమాకు ఓవరాల్‌గా యూ/ఏ సర్టిఫికెట్‌ను జారీ చేయడం గమనార్హం. ఈ సినిమా మే 23వ తేదీన గ్రాండ్ రిలీజ్ అవుతున్నది. ఈ సినిమా గురించిన అప్ డేట్స్ గురించి ఫిల్మీబీట్‌ను ఫాలో అవ్వండి.

More from Filmibeat

Read more about: tovino thomas cheran Narivetta
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X