Narivetta OTT Review: నరివెట్టా మూవీ ఓటీటీ రివ్యూ అండ్ రేటింగ్

Rating:
3.0/5

నటీనటులు: టొవినో థామస్, సూరజ్ వెంజరామూడు, చెరన్, ఆర్య సలీమ్, ప్రియంవద కృష్ణన్ తదతరులు
దర్శకత్వం: అనురాజ్ మనోహర్
కథ: అబిన్ జోసెఫ్
నిర్మాతలు: టిప్పుషాన్, శియాస్ హాసన్
మ్యూజిక్: జేక్స్ బిజోయ్
సినిమాటోగ్రాఫర్: విజయ్
ఎడిటర్: షామీర్ మహ్మద్
బ్యానర్: ఇండియన్ సినిమా కంపెనీ
థియేట్రికల్ రిలీజ్: 2025-05-23
ఓటీటీ రిలీజ్: సోని లివ్
ఓటీటీ రిలీజ్ డేట్: 2025-07-11-07

గ్రామీణ ప్రాంత యువకుడైన వర్గీస్ పీటర్ (టొవినో థామస్) గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించాలని పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతుంటాడు. అలాగే చిన్ననాటి స్నేహితురాలు నాన్సీ (ప్రియంవద కృష్ణన్)తో ప్రేమలో ఉంటాడు. అయితే ఏ కారణంగా పెళ్లికి ప్రియంవద తండ్రి నిరాకరిస్తాడు. ఆ క్రమంలో పోలీస్ ఉద్యోగం వస్తుంది. తనకు ఇష్టం లేకపోయినా తల్లిదండ్రుల బలవంతంతో వాయ్‌నాడ్ ప్రాంతంలో పోలీస్ కానిస్టేబుల్‌గా చేరుతాడు. అయితే అప్పటికే ప్రభుత్వానికి వ్యతిరేకంగా గిరిజనులు భూపోరాటం చేస్తుంటారు. వారి పోరాటాన్ని ఉక్కుపాదంతో అణిచి వేసేందుకు పోలీస్ ఉన్నతాధికారి ఆదేశాలు ఇస్తాడు.

ఏ కారణంగా వర్గీస్‌తో పెళ్లికి ప్రియంవద తండ్రి నిరాకరిస్తాడు? పోలీస్ ఉద్యోగం ఇష్టం లేదని చెబుతున్నా.. ఆ జాబ్‌లో చేరాలని వర్గీస్‌ను తల్లిదండ్రులు బలవంతం చేస్తారు? పోలీస్ ఉద్యోగంలో చేరిన తర్వాత బషీర్‌ (సూరజ్ వెంజరామూడు)తో ఎలాంటి అనుబంధం ఏర్పడింది. పోలీస్ ఉన్నతాధికారుల దౌర్జన్యాన్ని బషీర్, వర్గీస్ వ్యతిరేకించారు. గిరిజన ఆందోళనకారులపై ఎటాక్ చేయాలని ఆఫీసర్ ఇచ్చిన ఆదేశాలను బషీర్, వర్గీస్ ఎందుకు ఉల్లంఘించారు? పోలీస్ ఉన్నతాధికారులు వర్గీస్‌ను ఎలా టార్గెట్ చేశారు? పోలీసుల అరాచకాలకు, దౌర్జన్యానికి వ్యతిరేకంగా పోరాటం చేసి.. గిరిజనులకు ఎలాంటి న్యాయాన్ని అందించాడు? అనే ప్రశ్నలకు సమాధానమే నరివెట్టా సినిమా కథ.

Narivetta Malayalam Movie Review

పోలీసులు సాగిస్తున్న వేటలో వర్గీస్ పట్టుబడటం లాంటి అంశంతో కథ ఆసక్తిని రేపుతుంది. కథలో ఏం జరిగి ఉంటుందనే క్యూరియాసిటీని ఆరంభంలో క్రియేట్ చేయడంలో దర్శకుడు అనురాజ్ తన ప్రతిభను చాటుకొన్నారు. ట్విస్టులు, టర్నులతో కూడిన స్క్రీన్ ప్లేతో స్టోరి చెప్పిన విధానం బాగుంది. ఫస్టాఫ్ కొంత రొటీన్‌గా సాగడం ఈ సినిమా కథలో లోపంగా కనిపిస్తుంది. కానీ సెకండాఫ్‌లో ఎత్తుకొన్న పాయింట్, అలాగే అమాయకులైన గిరిజనులపై పోలీసులు కిరాతకంగా వ్యవహరించిన సన్నివేశాలు చాలా ఎమోషన్‌ను క్రియేట్ చేస్తాయి. కథను ఆదరాబాదరాగా ముగించిన విధానం కొంత నిరాశకు గురి చేస్తుంది. కాకపోతే భావోద్వేగమైన క్లైమాక్స్ అందర్నీ కట్టిపడేస్తుంది.

Narivetta Malayalam Movie Review

ఇటీవల కాలంలో మలయాళ ప్రేక్షకులను కాకుండా తెలుగు ప్రేక్షకులను మంచి కంటెంట్ ఉన్న సినిమాలతో ఆకట్టుకొంటున్న హీరో టొవినో థామస్. పెర్ఫార్మర్‌గా, యాక్షన్ హీరోగా రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ.. దక్షిణాది ప్రేక్షకులకు చేరవయ్యాడు. అలాంటి టాలెంటెడ్ హీరో టొవినో సమాజం పట్ల అవగాహన ఉన్న కామన్ మ్యాన్ పోలీస్ అయితే ఎలా ఉంటారు అనే పాయింట్‌కు తగినట్టుగా తన పాత్రలో ఒదిగిపోయాడు. సెకండాఫ్‌లో వచ్చే సన్నివేశాల్లో వర్గీస్ పాత్రలో జీవించాడు. తన వరకు ఈ సినిమాను పూర్తిగా నిలబెట్టిన యాక్టర్‌గా ఆయన ఫుల్ మార్కులు కొట్టేశాడు. ఇక బషీర్‌గా సూరజ్ మంచి పాత్రలో నటించాడు. డీఐజీగా చెరన్ కుటిలమైన పోలీస్ అధికారి పాత్రలో జీవించాడు. ప్రియంవదకు చాలా చిన్న పాత్రే.. అయినా తన వరకు గుర్తుండిపోయేలా నటించారు.

టెక్నికల్ విషయాలకు వస్తే.. ఈసినిమాకు విజయ్ అందించిన సినిమాటోగ్రఫి, జేక్స్ బిజోయ్ సంగీతం ప్లస్ పాయింట్స్. పలు సన్నివేశాలను హృదయాలకు హత్తుకొనేలా విజయ్ చిత్రీకరిస్తే.. వాటికి తన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్‌తో జీవం పోశాడని చెప్పొచ్చు. యాక్షన్ సీన్లు చాలా బాగా చిత్రీకరించారు. అలాగే ప్రొడక్షన్ వాల్యూస్, కంటెంట్ బెటర్‌గా ఉంది. ఎడిటింగ్, ఇతర విభాగాల పనితీరు బాగుంది.

Narivetta Malayalam Movie Review

గ్రామీణ, గిరిజన నేపథ్యంగా సాగే పోలీస్ బ్యాక్ డ్రాప్ కథ. మావోల పోరాటం, గిరిజన ఉద్యమాలతో సామాజిక సమస్యను ఎలిగెత్తి చూపే ప్రయత్నంగా ఈ సినిమా కథను రూపొందించారు. కథను పూర్తిగా చెప్పడంలో దర్శకుడికి కొంత గ్రిప్ మిస్ అయింది. దాంతో రొటీన్‌గా సాగే యాక్షన్ సినిమాగా మాత్రమే అనిపిస్తుంది. ఇంకాస్త కంటెంట్, సీన్లపై దృష్టి పెట్టి ఉంటే.. బెటర్ రిజల్డ్ ఉండేది. రూరల్ బ్యాక్ డ్రాప్‌తో రివేంజ్ డ్రామాను చూసి ఇష్టపడే వారికి ఈ సినిమా నచ్చుతుంది. సోని లివ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. తగినంత సమయాన్ని కేటాయించి.. పూర్తిగా సినిమాను ఒకే దఫా చేసేయండి.. మంచి అనుభూతి అందిస్తుంది.

More from Filmibeat

Read more about: Narivetta ott tovino thomas
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X