Narivetta Twitter Review: నరివెట్టా మలయాళం మూవీ ట్విట్టర్ రివ్యూ

మలయాళ స్టార్ హీరో టొవినో థామస్ నటించిన తాజా చిత్రం నరివెట్టా. పొలిటికల్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాకు అనురాజ్ మనోహర్ దర్శకత్వం వహించారు. ఇండియన్ సినిమా కంపెనీ బ్యానర్‌పై టిప్పుషాన్, శియాస్ హసన్ నిర్మాతలుగా ఈ సినిమాను రూపొందించారు.

పోలీస్, పొలిటికల్ బ్యాక్ డ్రాప్‌తో వస్తున్న ఈ చిత్రంలో టొవినో థామస్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నారు. ఈ సినిమాలో సూరజ్ మెంజరామూడు, చెరన్, ఆర్య సలీమ్, గాయత్రి, రీని ఉదయకుమార్, ప్రియంవద కృష్ణన్ తదితరులు నటించారు. ఈ సినిమాకు జేక్స్ బిజోయ్ సంగీతం అందించారు. విజయ్ సినిమాటోగ్రాఫర్‌గా, షామీర్ మహ్మద్ ఎడిటర్‌గా బాధ్యతలు వహించారు. మే 23వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ రిలీజ్ అయింది. ఈ సినిమా గురించిన నెటిజన్లు వెల్లడించిన రివ్యూలు, అభిప్రాయాల వివరాల్లోకి వెళితే..

Narivetta Twitter Review

కేరళలోని ముతుంగా ప్రాంతంలో 2003 సంవత్సరంలో జరిగిన సంఘటనల ఆధారంగా రూపొందిన నరివెట్టా మంచి అటెంప్ట్. పొలిటికల్ పవర్, వాటిని ఎదురించే శక్తి, అలాగే గ్రామాల్లో రాజకీయాలును ఎదురించే పోలీస్ కానిస్టేబుల్ పాత్రలో టొవినో థామస్ అద్బుతంగా నటించాడు. ఈ సినిమాలో నటించిన సూరజ్, చరణ్, ఆర్య సలీం గ్రేట్ జాబ్ చేశారని చెప్పాలి. చాలా సన్నివేశాలను జేక్స్ బిజోయ్ తన మ్యూజిక్‌తో హైలెట్ చేశాడు అని ఓ నెటిజన్ సుదీర్గమైన రివ్యూను అందించాడు.

నరివెట్టా చిత్రం ఓ మాస్టర్ పీస్. అనురాజ్ మనోహర్ అద్బుతంగా రూపొందించగా అంతే అద్బుతంగా టొవినో థామస్ నటించాడు. ఇంటెన్స్ డ్రమటిక్ థ్రిల్లర్. ఆడియెన్స్ సీట్లుకు అత్తుకుపోయి చూసేలా సినిమాను తెరకెక్కించారు. జేక్స్ బిజోయ్ మ్యూజిక్ ఓ ఫైర్. టొవినో థామస్ నుంచి మరో సూపర్ హిట్ వచ్చింది అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.

నరివెట్టా రా అండ్ సాలిడ్. అనేక రకాల ఎమోషన్స్‌తో పొలిటికల్ థ్రిల్లర్‌గా రూపొందించారు.వాస్తవ సంఘటనల ఆధారంగా తీయడం వల్ల ప్రతీ ఒక్కరికి కనెక్ట్ అవుతారు. టెక్నికల్ టీమ్‌ను ప్రత్యేకంగా అభినందించాలి. ఎమోషనల్ సన్నివేశాలు ప్రేక్షకులను భావోద్వేగానికి గురి చేస్తాయి. ఎడిటింగ్, మ్యూజిక్, సినిమాటోగ్రఫి అదిరిపోయింది అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.

అణగారిన ప్రజల ఆగ్రహం, నిరసనలకు ప్రతీరూపంగా రూపొందించిన ఇంటెన్స్ మూవీ నరివెట్టా. ఫస్టాఫ్ రైటింగ్ సూపర్బ్. సెకండాఫ్‌ను అంతకంటే గొప్పగా తెరకెక్కించారు. టొవినో థామస్, సూరజ్ బ్రిల్లియెంట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు.చరణ్‌ను ఎంపిక చేయడం పొరపాటు జరిగిందనే ఫీలింగ్ కలుగుతుంది. టెక్నికల్‌గా గొప్పగా ఉంది. గ్రామస్థుల నిరసన సన్నివేశాలు బాగా తీశారు. సాంగ్స్ బాగున్నాయి. అందరికీ నచ్చుతుందని అనుకోను. కానీ తప్పకుండా చూడాల్సిన సినిమా ఇది అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.

నరివెట్టాను రూపొందించిన టీమ్‌ను తప్పకుండా అప్రిషియేట్ చేయాలి. వారు నిరాశ పరచకుండా గొప్ప సినిమాను అందించారు. ఫస్టాఫ్ స్లో నరేషన్‌తో సాగుతుంది. కానీ బ్యాడ్ మూవీ కాదు. సెకండాఫ్ సూపర్బ్‌గా ఉంటుంది. థ్రిల్లింగ్, ఎమోషనల్ మూమెంట్స్ బాగున్నాయి. టొవినో థామస్ మరో బంపర్ హిట్ సొంతం చేసుకొన్నాడు. సినిమాలో ఇన్వెస్టిగేషన్ పార్ట్ హైలెట్. మస్ట్ వాచ్ థ్రిల్లర్ అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.

హృదయానికి మెల్లగా హత్తుకొనే విధంగా, సామాజికంగా, ఎమోషనల్‌గా, పొలిటికల్‌గా షార్ప్‌గా ఉండే సినిమా నరివెట్టా. టొవిన్ థామస్ యాక్టింగ్ బాగుంది. క్లైమాక్స్ సన్నవేశాలు సూపర్బ్. సినిమాలో నటీనటులు, సాంకేతిక నిపుణులు అద్బుతంగా పెర్ఫార్మ్ చేశారు. ఈ సినిమా చూసినంత సేపు గొప్ప అనుభూతి కలుగుతుంది. అనురాజ్ మనోహర్ తీసిన విధానం అద్బుతంగా ఉంది అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.

నరివెట్టా హై యాక్టేన్ యాక్షన్ డ్రామా. ఎమోషన్స్, థ్రిల్లింగ్ మూమెంట్స్ కలిగిన చిత్రం. టొవినో థామస్ తన కెరీర్ బెస్ట్ ఫెర్ఫార్మెన్స్ ఇచ్చారు. స్క్రీన్ ప్లే బ్రిల్లియెంట్‌గా ఉంది. జేక్స్ బిజోయ్ మ్యూజిక్ చాలా బాగుంది. ఆయన తన మ్యూజిక్‌తో చాలా క్యారెక్టర్లను ఎలివేట్ చేశాడు. నరివెట్టా మాలీవుడ్‌ విదుతలై సినిమా అని ఓ నెటిజన్ తన రివ్యూను ఇచ్చాడు.

More from Filmibeat

Read more about: Narivetta mollywood tovino thomas
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X