Narudi Brathuku Natana Review: నరుడి బ్రతుకు నటన మూవీ రివ్యూ అండ్ రేటింగ్

Rating: 2.75/5

మూవీ: నరుడి బ్రతుకు నటన
నటీనటులు: శివ కుమార్ రామచంద్రవరపు, నితిన్ ప్రసన్న, శృతి జయన్, ఐశ్వర్య
అనిల్ కుమార్, వివా రాఘవ్, దయానంద్ రెడ్డి తదితరులు.
రచయిత, ఎడిటర్, దర్శకుడు: రిషికేశ్వర్ యోగి
నిర్మాతలు: టీజీ విశ్వ ప్రసాద్, సుకుమార్ బోరెడ్డి, డాక్టర్ సింధు రెడ్డి
సహ నిర్మాత: వివేక్ కూచిభొట్ల
ప్రాజెక్ట్ హెడ్: సుధీర్ కుమార్
సినిమాటోగ్రాఫర్: ఫహద్ అబ్దుల్ మజీద్
మ్యూజిక్ డైరెక్టర్: NYX లోపెజ్
బ్యానర్: పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, సీ ఫర్ ఆపిల్ ప్రొడక్షన్స్‌, ఎస్ స్వ్కేర్ సినిమాస్
రిలీజ్ డేట్: 2024-10-25

సత్య (శివకుమార్ రామచంద్రవరపు) నటుడిగా రాణించాలని ఆడిషన్స్‌ వెళ్లి విఫలమవుతుంటాడు. తన కొడుకుకు యాక్టర్ అవ్వడానికి టాలెంట్ లేదని గ్రహించిన తండ్రి (దయానంద్ రెడ్డి) స్నేహితుడు (వైవా రాఘవ) వేరే ఉద్యోగం చూసుకోమని సలహా ఇస్తారు. అలాంటి పరిస్థితుల్లో సత్య ఎవరికి చెప్పకుండా కేరళకు వెళ్లిపోతాడు. అక్కడ కొన్ని సమస్యల్లో ఇరుకొన్న సత్యకు D సల్మాన్ (నితిన్ ప్రసన్న) పరిచయం అవుతాడు.

Narudi Brathuku Natana  Movie Review in Telugu

నటుడిగా సత్య రాణించలేకపోవడానికి కారణం ఏమిటి? కేరళకు సత్య ఎందుకు వెళ్లాడు? కేరళలో సత్యకు ఎదురైన సమస్యలు ఏమిటి? ఎలాంటి పరిస్థితుల్లో సత్యకు డీ సల్మాన్ పరిచయమయ్యాడు? సల్మాన్ పరిచయంతో సత్యలో ఎలాంటి మార్పు వచ్చింది? కేరళలో సత్యను హీరో అని ఎందుకు పిలిచారు? సత్య, డీ సల్మాన్ జర్నీ ఎలా కొనసాగింది? ఆత్మ బంధువుగా మారిన సల్మాన్‌ను సత్య ఎందుకు వదిలిపోయాడు? చివరకు సత్య నటుడు అయ్యాడా? అనే ప్రశ్నలకు సమాధానమే నరుడి బతుకు నటన సినిమా కథ.

దర్శకుడు రిషికేశ్వర్ రెడ్డి రాసుకొన్న కథను సింగిల్ లైన్‌గా చూస్తే చాలా ఎమోషనల్‌గా అనిపిస్తుంది. కథను సన్నివేశాలుగా విస్తరించడంలో కూడా తన మార్కు చూపించుకొన్నాడు. కానీ స్క్రీన్ ప్లే, కొన్ని సన్నివేశాల విషయంలో తడబాటుకు గురయ్యాడనిపిస్తుంది. ఫస్టాఫ్‌లో ఓ చిన్న అమ్మాయి సీన్, ప్రెగ్నెంట్ ఉమెన్ సన్నివేశాలు భావోద్వేగానికి గురి చేస్తాయి.

ఇక సెకండాఫ్‌లో ఫన్‌తోపాటు ఎమోషనల్ సీన్లను జోడించిన కథను నడిపించిన విధానం హైలెట్‌గా చెప్పకోవచ్చు. సల్మాన్ లవర్ పెళ్లి, మందుపార్టీ, వేశ్య ఇంటికి వెళ్లిన క్రమంలో సన్నివేశాలు నవ్వించడమే కాకుండా ఈలలు, చప్పట్లు కొట్టిస్తాయి. చివరగా ఎలాంటి హంగామా, కమర్షియల్‌ హంగులకు వెళ్లకుండా నిజాయితీగా ఎమోషనల్ టచ్‌తో సినిమాను ముగించడం ఫీల్ గుడ్ అనిపిస్తుంది. ఇందులో స్క్రిప్టు పరంగా కొన్ని లోపాలు ఉన్నాయి. కానీ ఇలాంటి మూవీలో వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదనిపిస్తుంది.

ఇప్పటి వరకు విలన్ టచ్ ఉన్న పాత్రలతో మెప్పించిన శివకుమార్ రామచంద్రవరపు తనకు లభించిన సత్య పాత్రను పూర్తిగా సద్వినియోగం చేసుకోవడమే కాకుండా ఆ కార్యక్టర్‌లో లీనమై నటించి మెప్పించాడనే చెప్పాలి. ఇక డీ సల్మాన్ పాత్రలో మరోసారి నితిన్ ప్రసన్న వినోదంతోపాటు భావోద్వేగాన్ని పండించాడు. సినిమాకు బ్యాక్ బోన్ మాదిరిగా నిలిచారు. శృతి జయన్ కూడా ప్రేక్షకులకు ఎమోషన్స్‌ గురి చేసే కార్యెక్టర్‌కు పూర్తిగా న్యాయం చేసింది. దయానంద్ రెడ్డి, వైవా రాఘవ తదితరులు తమ పాత్రల పరిధి మేరకు మెప్పించారు.

సాంకేతిక నిపుణుల విభాగాల విషయానికి వస్తే.. దర్శకుడు రిషికేశ్వర్ యోగి రచయితగా, ఎడిటర్‌గా ఫుల్ మార్కులు కొట్టేశాడు. ఫాహద్ అబ్దుల్ మజీద్ కేరళ అందాలను అద్బుతంగా కెమెరాలో బంధించారు. సినిమాలోని ప్రతీ సన్నివేశాన్ని మంచి పెయింటింగ్‌లా పచ్చదనంతో నింపేశాడనే చెప్పాలి. లోపెజ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాలోని చాలా సన్నివేశాలకు సహజత్వాన్ని తెచ్చిపెట్టింది.
పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, సీ ఫర్ ఆపిల్ ప్రొడక్షన్స్‌, ఎస్ స్వ్కేర్ సినిమాస్ బ్యానర్స్ అనుసరించిన నిర్మాణ విలువలు రిచ్‌గానే కాకుండా బేషుగ్గా ఉన్నాయి, ఈ సినిమా కోసం కథ, నటీనటుల ఎంపిక చూస్తే సుకుమార్ బోరెడ్డి, డాక్టర్ సింధు రెడ్డి అభిరుచి ఏమిటో తెలియజెప్పేలా ఉంటుంది.

నటీనటుల ఫెర్ఫార్మెన్స్, సాంకేతిక నిపుణుల టాలెంట్‌తోపాటు లవ్, ఎమోషన్స్, సామాజిక అంశాల నేపథ్యంగా క్లీన్ కామెడీ, నిజాయితీతో కూడిన స్టోరి టెల్లింగ్‌తో రూపొందిన చిత్రం నరుడి బతుకు నటన. ఫస్టాఫ్‌లో కొన్ని ఎమోషన్స్, సెకండాఫ్‌లో ఫన్ ఈ సినిమాకు పూర్తిగా ప్లస్ పాయింట్. కాకపోతే కొంత భాగంగా కథ స్లోగా సాగడం మైనస్‌గా అనిపిస్తుంది. కొన్ని సన్నివేశాలు, కథపై మరింత జాగ్రత్త పడి ఉంటే డెఫినెట్‌గా మంచి రూటెడ్ సినిమా అయి ఉండేదనిపిస్తుంది. ఎలాంటి అంచనాలు లేకుండా వెళితే మంచి ఫీల్‌ను అందించే చిత్రం నరుడి బ్రతుకు నటన. క్లీన్, ఫ్యామిలీ, ఎమోషనల్ కంటెంట్‌తో ట్రావెల్ మూవీని ఇష్టపడే వారికి తప్పకుండా నచ్చుతుంది. ఈ వారం థియేటర్‌లో సినిమా చూడాలనుకొనే వారికి ఈ మూవీ మంచి ఆప్షన్. డోంట్ మిస్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X