twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నాటకం తెలుగు సినిమా రివ్యూ అండ్ రేటింగ్

    |

    Recommended Video

    Natakam Movie Review నాటకం సినిమా రివ్యూ

    Rating:
    2.0/5
    Star Cast: ఆశీష్ గాంధీ, ఆశీమా నర్వాల్, తోటపల్లి మధు
    Director: కల్యాణ్ జీ గోగన

    టాలీవుడ్‌లో అర్జున్ రెడ్డి, RX 100 సినిమాల సక్సెస్‌తో రొమాంటిక్ ప్రేమకథా చిత్రాల, సస్పెన్స్ థ్రిల్లర్ల, చిన్న సినిమాల జోరు పెరిగింది. కథ, కథనాలు బాగున్న చిత్రాలకు ప్రేక్షకుల ఆదరణ పెరుగుతున్న సమయంలో దర్శకుడు కల్యాణ్ జీ గోగన విభిన్నమైన ప్రమోషన్‌తో ముందుకొచ్చిన చిత్రం నాటకం. ఆశీష్ గాంధీ, ఆశీమా నర్వాల్ హీరో, హీరోయిన్లుగా నటించారు. సినిమా టీజర్, ట్రైలర్లు, స్టిల్స్ హాట్ హాట్‌గా ఉండటంతో మరో RX 100 అంటూ ప్రచారం మొదలైంది. ఇలాంటి పరిస్థితుల మధ్య విడుదలైన నాటకం చిత్రం చిత్ర యూనిట్‌కు ఎలాంటి ఫలితాన్ని అందించనుందో అనే విషయాన్ని తెలుసుకోవాలంటే కథ, కథనాలను సమీక్షించాల్సిందే.

    నాటకం స్టోరి

    నాటకం స్టోరి

    చింతలపూడి అనే గ్రామంలో బాల కోటేశ్వరరావు అలియాస్ కోటి తప్ప తాగుతూ అల్లరి చిల్లరిగా తిరుగుతుంటాడు. అదే గ్రామంలో డిగ్రీ చదువుకునే పార్వతిని తొలిచూపులోనే ప్రేమలో పెడుతాడు. కోటేశ్వరరావు అంటే పార్వతికి ఇష్టం కావడంతో వారిద్దరూ శృంగారం మునిగి తేలుతుంటారు. అదే సమయంలోనే ఆ ఊరిపై దాడి చేయడానికి దండుపాళ్యం లాంటి దొంగల ముఠా సిద్ధమవుతుంది. ఈ క్రమంలో పార్వతి గురించి భయంకరమైన నిజం తెలుస్తుంది.

    నాటకం ట్విస్టులు

    నాటకం ట్విస్టులు

    పీకల్లోతూ వ్యామోహంలో మునిగిన కోటికి పార్వతి గురించి తెలిసిన నిజం ఏమిటి? పార్వతి ఫ్లాష్ బ్యాక్ తెలుసుకొన్న కోటి ఎలా రియాక్ట్ అయ్యాడు? చింతలపూడిపై దాడి చేయడానికి వచ్చిన దొంగల ముఠాను ఎలా ఎదుర్కొన్నాడు. పార్వతి దూరమైన కోటి మిగితా జీవితం ఎలా ఉండబోయిందనే ప్రశ్నలకు తెర మీద సమాధానమే నాటకం సినిమా కథ.

    ఫస్టాఫ్ ఎనాలిసిస్

    ఫస్టాఫ్ ఎనాలిసిస్

    బాల కోటేశ్వరరావు క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ మెంట్‌తో కథ ప్రారంభమవుతుంది. తండ్రి కొడుకుల మధ్య తాగుడు వ్యవహారం శృతి మించుతుందనే క్రమంలో పార్వతిని కథలోకి లాగి మితి మీరిన శృంగారానికి తెర లేస్తుంది. తల్లి లేని కోటికి తండ్రి రెండో సెటప్‌ను ఆసక్తికరమైన పాయింట్‌ కథలోకి రావడంతో తల్లి, చెల్లి లాంటి క్యారెక్టర్లు బోనస్‌గా కనిపిస్తాయి. గ్రామంలో పాము కాటుకు గురైన మహిళ ఎపిసోడ్ కొంత ఆసక్తికరంగా ఉంటుంది.అలా సాగిపోతున్న కథలో మధ్య, మధ్యలో దొంగల ముఠాకు సంబంధించిన కేసు దర్యాప్తు కథలో దూరుతూ ఉంటుంది. చింతలపూడిలోకి దొంగల ముఠా ప్రవేశించడంతో తొలిభాగం ముగుస్తుంది.

    సెకండాఫ్ ఎనాలిసిస్

    సెకండాఫ్ ఎనాలిసిస్

    ఇక రెండో భాగంలో పార్వతి, కోటి మధ్య ప్రేమ కలహాలు, పాటలతో రొటీన్‌గా సాగుతుంది. పార్వతి, కోటి పెళ్లి చేసుకొన్న తర్వాత ఓ భయంకరమైన వాస్తవం బయటపడుతుంది. దాంతో కథ కొత్త మలుపు తిరుగుతుంది. పార్వతి సహాయంతో చివరకు దొంగల ముఠా భరతం ఎలా పట్టాడనే కథకు ముగింపుగా మారుతుంది. ఇక చివర్లో కోర్టు సీన్ పెట్టి సినిమాను మరింత సాగదీయడం ప్రేక్షకుల సహనానికి పరీక్షగా మారుంది.

     దర్శకుడు కల్యాణ్ జీ గురించి

    దర్శకుడు కల్యాణ్ జీ గురించి

    దర్శకుడు కల్యాణ్ జీ గోగన ఎంచుకొన్న పాయింట్లు బాగానే ఉన్నాయి. RX 100, ఖాకి సినిమా ప్రభావం భారీగానే కనిపిస్తుంది. ఆ రెండు చిత్రాలను కలిపి సస్సెన్స్ థ్రిల్లర్‌ను రూపొందించడంలో సరైన పంథాను అనుసరించలేదనిపిస్తుంది. రొటీన్‌గా సీన్లను పేర్చుకొంటూ వెళ్లిపోయాడే తప్ప.. ఓ భిన్నమైన సినిమాను తెరకెక్కించే ప్రయత్నం జరుగలేదు. కథ, కథనాలపై దర్శకుడు పట్టు లేదని పలు సన్నివేశాల్లో కనిపిస్తుంది. బలమైన సన్నివేశాలు, నాసిరకమైన నటీనటులతో ఓ రుచికరమైన వంటకం అందించడంలో తడబాటు కనిపిస్తుంది.

    ఆశీష్ గాంధీ ఫెర్ఫార్మెన్స్

    ఆశీష్ గాంధీ ఫెర్ఫార్మెన్స్

    ఇప్పటి వరకు చిన్న చితక వేషాలు వేసిన ఆశీష్ గాంధీ హీరో పాత్రతో ముందుకొచ్చాడు. ఆయన రోల్ గురించి చెప్పాల్సి వస్తే నటన పరంగా ఆకట్టుకొన్నాడు. డ్యాన్సులు, ఫైట్లు చక్కగా చేసి హీరో మెటీరియల్ చూపించాడు. కీలకమైన సన్నివేశాల్లో బాగా నటించాడు. కథలో లోపాల వల్ల సరైన సక్సెస్ కోసం మరి కొన్నాళ్లు వేచి చూడాల్సి ఉంటుందేమో.

    ఆశీమా నర్వాల్ బోల్డ్‌గా

    ఆశీమా నర్వాల్ బోల్డ్‌గా

    ఇక ఆశీమా నర్వాల్ బోల్డ్‌గా నటించింది. రొమాంటిక్ సన్నివేశాల్లో ఆకట్టుకొన్నది. పార్వతి పాత్రకు సంబంధించిన ఫ్లాష్ బ్యాక్ మరింత ఇంటెన్సెటీ ఉంటే క్యారెక్టర్‌పై మరింత సానుభూతి పెరిగేది. కేవలం శృంగారం సీన్లు ఎలివేట్ చేయడంపై దృష్టి పెట్టడం ద్వారా కథలో ఫీల్ మిస్సయింది. పార్వతి క్యారెక్టర్‌ను సరిగా డిజైన్ చేసి ఉంటే ఆర్ఎక్స్ 100 చిత్రంలో హీరోయిన్‌కు వచ్చిన రెస్పాన్స్ తప్పకుండా వచ్చి ఉండేది.

    మిగితా క్యారెక్టర్లలో

    మిగితా క్యారెక్టర్లలో

    హీరో తండ్రిగా తోటపల్లి మధు నటించాడు. తన పాత్ర పరిధి మేరకు ఒకే అనిపించారు. మిగితా పాత్రల్లో పెద్దగా తెలిసిన వారు, గుర్తు పట్టే వారెవరూ లేరు. ఆయ పాత్రల మేరకు వారు బాగానే నటించారు.

    సినిమాటోగ్రఫీ

    సినిమాటోగ్రఫీ

    నాటకం సినిమాకు గరుడ అంజి సినిమాటోగ్రఫిని అందించారు. రొమాంటిక్ సీన్లను చక్కగా తెరకెక్కించాడు. గ్రామంలోని వాతావరణాన్ని సాధ్యమైనంత మేరకు ఒరిజినల్‌గా చూపించే ప్రయత్నం చేశారు. యాక్షన్ సీన్లు ఆకట్టుకొనేలా ఉన్నాయి.. మణికాంత్ ఎడిటింగ్ బాగుంది.

    నిర్మాణ విలువలు

    నిర్మాణ విలువలు

    రిజ్వాన్ ఎంటర్‌టైన్ బ్యానర్‌పై రూపొందిన ఈ చిత్రాన్ని శ్రీసాయిదీప్ చాట్లా, రాధిక శ్రీనివాస్, ప్రవీణ్ గాంధీ, ఉమా కూచిపూడి రూపొందించారు. టెక్నికల్‌గా మంచి విలువలను పాటించారు. కథ, కథనాలపై మరింత దృష్టి సారించాల్సి ఉంది. నటీనటులు ఎంపిక ప్రధాన లోపంగా కొట్టొచ్చినట్టు కనిపించింది.

    ఫైనల్‌గా

    ఫైనల్‌గా

    అర్జున్ రెడ్డి, RX 100 చిత్రాల ప్రభావంతో నాటకం మరో రొమాంటిక్, సస్సెన్స్, థ్రిల్లర్ చిత్రంగా రూపొందింది. కథ, కథనాలు, బలమైన సన్నివేశాలు రాసుకోవడంలో వైఫల్యం కనిపిస్తుంది. బీ, సీ సెంటర్ల ప్రేక్షకులకు నచ్చే అంశాలు బాగానే ఉన్నాయి. ప్రమోషన్ పరంగా దిగువ సెంటర్ల ప్రేక్షకులకు సినిమాను చేర్చగలిగితే కలెక్షన్లు రాబట్టే అవకాశం లేకపోలేదు.

    బలం, బలహీనతలు

    బలం, బలహీనతలు

    ప్లస్ పాయింట్స్
    హీరో, హీరోయిన్ల ఫెర్ఫార్మెన్స్
    సినిమాటోగ్రఫీ
    ప్రొడక్షన్ వ్యాల్యూస్

    మైనస్ పాయింట్
    కథ, కథనాలు
    కథలో అనేక ట్విస్టులు, సాగదీత

    నటీనటులు: ఆశీష్ గాంధీ, ఆశీమా నర్వాల్

    నటీనటులు: ఆశీష్ గాంధీ, ఆశీమా నర్వాల్

    దర్శకత్వం: కల్యాణ్ జీ గోగన
    నిర్మాతలు: శ్రీసాయిదీప్ చాట్లా, రాధిక శ్రీనివాస్, ప్రవీణ్ గాంధీ, ఉమా కూచిపూడి
    సంగీతం: సాయి కార్తీక్,
    సినిమాటోగ్రఫి: గరుడ వేగ అంజి
    ఎడిటర్: మణికాంత్
    బ్యానర్: రిజ్వాన్ ఎంటర్‌టైన్‌మెంట్

    English summary
    Natakam is a romantic action entertainer movie directed by Kalyanji Gogana and jointly produced by Sri Sai deep Chatla, Radhika Srinivas, Praveen Gandhi and Uma Kuchipudi while Sai Kartheek scored music for this movie. Ashish Gandhi and Ashima Narwal are played the main lead roles in this movie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X