నవ్యత లేని నవవసంతం-సినిమా సమీక్ష

By Super Admin

నటీనటులు-తరుణ్, రోహిత్,ఆకాశ్,సునీల్, ప్రియమణి, అంకిత, కోటా శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి, జీవా, ఆహుతి ప్రసాద్, బాబు మోహన్, మల్లికార్జునరావు,బ్రహ్మానందం, ఎవిఎస్, ఎల్.బి.శ్రీరాం, దేవిశ్రీ, తెలంగాణా శకుంతల, సుధా, సనా తదితరులు.
మాటలు-రాజేంద్ర ప్రసాద్
సాహిత్యం-చంద్రబోస్, ఈఎస్ మూర్తి, అనంత శ్రీరామ్
సంగీతం-ఎస్.ఎ.రాజ్ కుమార్
కెమరా-సర్వేష్ మురారి
ఎడిటింగ్-నందమూరి హరి
సమర్పణ-ఆర్.బి.చౌదరి
నిర్మాతలు-ఎన్.వి.ప్రసాద్, పరాస్ జైన్
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం-షాజహాన్
పతాకం-మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్
విడుదల-నవంబర్09,2007

సూపర్ గుడ్ ఫిల్మ్స్ తమిళంలో తరుణ్ హీరోగా రూపొందించిన సినిమా పున్నగాయి దేసమ్. ఈ సినిమా తెలుగు నేటివిటీకి కూడా చాలా దగ్గరగా ఉంది. అందుకే అదే బ్యానర్ నవవసంతం పేరుతో ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేశారు. అయితే సినిమాలో కొత్తదనమేమి లేదు. చాలా సినిమా కథల సమ్మేళనంగా ఉంది. వెంకటేష్-సౌందర్య నటించిన రాజా సినిమాను పోలి ఉంది. అందుకే ఎన్నో ఆశలతో రీ ఎంట్రీ చేసిన తరుణ్ కు ఇది నిరాశ పరిచే చిత్రంగా చెప్పవచ్చు.

కథ విషయానికి వస్తే గణేష్(తరుణ్)తన మరదలు అమ్ము అలియాస్ అంజలి (ప్రియమణి)ని ప్రేమిస్తాడు. ఆమె తన మేనమామ కూతురే. తన తల్లి చనిపోవడంతో తన మామ దగ్గరకు వస్తాడు గణేష్. అయితే గణేష్ బీదవాడు కావడంతో ఆదరించడు. గణేష్ అనుకోకుండా తన మిత్రులు ప్రసాద్(ఆకాశ్), రాజా(రోహిత్), విజయ్(సునీల్)లను కలుసుకుంటాడు. వారుండే రూమ్ లో గణేష్ కూడా చేరతాడు. ఇందులే కలెక్టర్ కావాలని ప్రసాద్, గాయకుడు కావాలని రాజా, మిమిక్రీ ఆర్టిస్ట్ కావాలని విజయ్ ప్రయత్నాలు చేస్తుంటారు.అయితే తమ ఆసలను నెరవేర్చుకోవడానికి వారి వద్ద డబ్బు ఉండదు. వారి ప్రయత్నాలు సఫలీకృతం కావడానికి తన తల్లి అమ్ముకిమ్మని ఇచ్చిన బంగారు గొలుసును గణేష్ తన స్నేహితులకు ఇస్తాడు. తను మాత్రం చిన్న హోటల్ పెట్టుకుని వ్యాపారం మొదలెడతాడు. ఇది కూడా తన స్నేహితులకు సాయం చేసే ఉద్ధేశంతోనే మొదలెడతాడు. ఇదిలా ఉంటే ఒక మిలియనీర్ కూతురు ప్రియ (అంకిత) ప్రసాద్ ప్రేమలో పడుతుంది. అయితే ప్రేమ తన గోల్ కు అడ్డుకావచ్చనే ఉద్దేశంతో ప్రియను పట్టించుకోడు. అయితే గణేష్ ఒప్పించడంతో ప్రసాద్, ప్రియ ప్రేమను అంగీకరిస్తాడు. ఇదే సమయంలో అంజలి, గణేష్ కు తన హృదయాన్ని సమర్పించుకుంటుంది...ఇలా సాగుతుంది సినిమా.

లవర్ బాయ్ ఇమేజ్ ఉన్న తరుణ్ సింపథిటిక్ పాత్రలో నటించాడు ఈ సినిమాలో. దీనిని అంత ఈజీగా చేయలేకపోయాడు. ప్రియమణి, తరుణ్ ల కాంబినేషన్ బాగున్నా అంకిత పాత్ర చిన్నదైపోయింది. అయినా కీలకమైనదే. ఈ సినిమాకు కథే పెద్ద మైనస్ పాయింట్. సూపర్ గుడ్ ఫిల్మ్స్ పతాకంపై అన్నీ ఇలాంటి సినిమాలే వస్తున్నాయి. రాజ్ కుమార్ సంగీతం ఆకట్టుకోలేదు. సురేష్ కెమరా పనితనం పరవాలేదనిపించింది. ఈ సినిమా ద్వారా తెలుగులో ఎంటరైన తమిళ దర్శకుడు షాజహాన్ ఈజీగానే చేశాడు. అయితే హైటెక్ యుగంలో ఓల్డ్ కథను ఎంచుకోవడమే ఆయన చేసిన తప్పు. ఇలాంటి సినిమాలు చూసే ఓపిక నేటి జనాలకు లేదని చెప్పవచ్చు. ఒక్కమాటలో చెప్పాలంటే టైమ్ పాస్ చిత్రం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X