twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చూస్తే చచ్చినట్లేరా!

    By Staff
    |

    Navvuthu Batakalira
    -జలపతి గూడెల్లి
    చిత్రం: నవ్వుతూ బతకాలిరా!
    నటీనటులు: చక్రవర్తి, మాళవిక, ఆశాషైనీ, ఉమ
    సంగీతం: దేవీశ్రీప్రసాద్‌
    నిర్మాత: శ్రీమతి జి.అరుణకుమారి
    దర్శకత్వం: కోడిరామకృష్ణ

    ఎంతపెద్ద పేరు వచ్చినా, ఎన్ని చిత్రాల అనుభవమున్న కోడిరామకృష్ణ ఇంకా కొత్త డైరక్టరే అనడానికి నవ్వుతూ బతకాలిరా చిత్రం సాక్ష్యం. లోకల్‌ స్పీల్‌ బర్గ్‌ అని పేరు సంపాదించుకున్న దర్శకుడు ఇప్పుడిప్పుడే ఓనమాలు నేర్చుకుంటున్నవాడిలా తీయగలడం గొప్పే కదా! కథలోనూ, కథనంలోనూ, దేంట్లోనూ కొత్తదనం లేని ఈ సినిమా ప్రేక్షకులకు నరకం. ఎవరికీ అర్థం కానీ కామెడీ, సినిమా ఉద్దేశం ఎమిటో తెలియని 'ఉత్త'మోత్తమ చిత్రం ఇది. రెండున్నరగంటల పాటు ప్రేక్షకులను హింసించి నవ్వుతూ బతకాలిరా అనడం దారుణం. దేవీశ్రీప్రసాద్‌ అందించిన సంగీతం మినహా ఈ సినిమా పరమవేస్ట్‌. పాటలు కూడా వినడానికి మాత్రమే బాగున్నాయి. చూడడానికి కాదు.

    చక్రవర్తి అనాథ. గిరిబాబు నడిపే బస్సుల దగ్గర క్లీనర్‌ గా పనిచేస్తాడు. ఇతను పిలుపు విని ప్రజలు తరించిపోయి అందరూ గిరిబాబు బస్సులు ఎక్కుతుంటారు. ఇంట్లో ఒకడిగా ఉంటాడు. క్లీనర్‌ కమ్‌ పనిమనిషి కమ్‌ అమాయక చక్రవర్తిని పల్లీలు అమ్ముకునే దీప్తి ప్రేమిస్తుంది. కానీ చక్రవర్తి ప్రేమించడు. గిరిబాబు కూతురు మాళవిక మెడికో. చక్రవర్తి అమాయకత్వం, పాటలు పాడే గొంతు చూసి ప్రేమిస్తుంది. కొన్నాళ్ళకు మనవాడు కూడా (సారీ చక్రవర్తి మనసు మాత్రమే) ప్రేమిస్తాడు. ఈ లోపు మాళవికకు చక్రవర్తి గురించి మరో స్టోరీ తెలుస్తుంది. అదేమిటంటే....ఒకరాత్రి లేట్‌ గా బస్‌ కోసం వచ్చిన ఉమకు పోలీస్‌ స్టేషన్‌ లో షెల్టర్‌ ఇప్పిస్తాడు.'ఆలస్యం అయినందున రేపొద్దున్న తీసుకువెళుతాను. ఈ రాత్రికి ఈ పోలీస్‌ స్టేషన్‌ లో రెస్ట్‌ తీసుకో' అని చెప్పి వెళుతాడు.

    కానీ ఆ రాత్రి తాగి వచ్చిన ఎస్‌.ఐ ఆమెను రేప్‌ చేస్తాడు. ఇది విని ఆమె అన్నయ్య చనిపోతాడు. దాంతో ఉమ పిచ్చిదవుతుంది. ఉమకు ఓ విధవ అక్క ఆశాషైనీ. వీరిద్దరిని పోషించే బాధ్యత చక్రవర్తే తీసుకుంటాడు. ఈ స్టోరీ తెలిసిన తర్వాత మాళవిక పెళ్ళిచేసుకోవాలనుకుంటుంది. గిరిబాబు కూడా ఒప్పుకుంటాడు. ఈ లోపు మరో అవాంతరం వస్తుంది. చనిపోయే ముందు గిరిబాబు మామ ఓ ప్రామిస్‌ తీసుకుంటాడు. మాళవికను తన కొడుక్కిచ్చి పెళ్ళిచేయాలని కోరుతాడు. దాంతో చక్రవర్తి 'త్యాగ'రాజు గా మారి తను చెడ్డవాడిగా మాళవిక ముందు బిల్డప్‌ ఇస్తాడు. మాళవిక త్యాగరాజును ద్వేషించుకొని మేనమామను పెళ్ళి చేసుకునేందుకు సిద్ధపడుతుంది. చివరికి ఏమవుతుంది అంటే మీకు ఓపిక ఉంటే క్లైమాక్స్‌ వెండితెరపై చూడండి.

    చక్రవర్తి సహా ఇందులో ఎవరి నటన గురించి చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఎందుకంటే నటించే అవకాశం లేని పాత్రలు అవి. ఓవర్‌ ఆల్‌ గా తలనొప్పి తెచ్చే సినిమా.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X