God Movie Review సైకో కిల్లింగ్ బ్యాక్ డ్రాప్‌తో.. నయనతార, జయం రవి మెప్పించారా? గాడ్ సమీక్ష

Rating:
2.5/5

నటీనటులు: జయం రవి, నయనతార, వినోద్ కిషన్, రాహుల్ బోస్, నరైన్, ఆశీష్ విద్యార్థి తదితరులు
రచన, దర్శకత్వం: ఐ అహ్మద్
నిర్మాత: జెరీష్ రాజా
సినిమాటోగ్రఫి: హరి కే వేదాంతం
ఎడిటింగ్: జేవీ మణికంద బాలాజీ
మ్యూజిక్: యువన్ శంకర్ రాజా
బ్యానర్: ప్యాషన్ స్టూడియోస్
రిలీజ్ డేట్: 2023-10-13

విశాఖపట్నంలో ఏసీపీగా పనిచేసే అర్జున్ ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్. విధి నిర్వహణలో నిక్కచ్చిగా ఉండే అర్జున్‌కు ప్రియా (నయనతార) గర్ల్‌ఫ్రెండ్. తన ప్రియురాలు పెళ్లి చేసుకొందామని బలవంతం చేసినా అర్జున్ తనకు వివాహం చేసుకొనే ఉద్దేశం లేదని రిజెక్ట్ చేస్తుంటాడు. ఈ క్రమంలో నగరంలో వరుస హత్యలకు పాల్పడుతూ స్మైలీ సీరియల్ కిల్లర్ బ్రహ్మ (రాహుల్ బోస్) ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ.. పోలీసులకు సవాల్‌గా మారుతాడు. సైకో కిల్లర్ బ్రహ్మను పట్టుకొనేందుకు పోలీస్ ఆఫీసర్ అర్జున్ రంగంలోకి దిగుతాడు.

Nayanataras God Review and Rating: Jayam Ravi killing performance

ప్రియను పెళ్లి చేసుకోవడానికి అర్జున్ ఎందుకు నిరాకరించాడు? అర్జున్ తీరుపై ప్రియా ఎలా స్పందించింది? అమ్మాయిలను అత్యంత పాశవికంగా బ్రహ్మ ఎందుకు చంపుతున్నాడు? బ్రహ్మ సైకో కిల్లర్‌గా మారడానికి కారణం ఏమిటి? పోలీసులకు మరో సైకో కిల్లర్ బాబు (వినోద్ కిషన్) ఎలా సవాల్ విసిరాడు? బ్రహ్మ, బాబు వరుస హత్యలను ఆపడానికి అర్జున్ చేపట్టిన ఆపరేషన్ ఎలా సాగింది? చివరకు ప్రియను అర్జున్ పెళ్లి చేసుకొన్నాడా? అనే ప్రశ్నలకు సమాధానం గాడ్ (God Review) మూవీ సినిమా కథ.

అత్యంత కిరాతకంగా, పాశవికంగా హత్యలు చేస్తున్న బ్రహ్మ అరాచకాలతో సినిమా ఎమోషనల్‌గా మొదలవుతుంది. అర్జున్ ఎంట్రీతో మూవీ యాక్షన్ మోడ్‌లోకి వెళ్లడంతో సినిమాపై క్యూరియాసిటీ పెరుగుతుంది. ప్రియతో రొమాంటిక్ సీన్లు సీరియస్ మోడ్ నుంచి ఎంటర్‌టైన్‌మెంట్ మోడ్‌లోకి వెళ్లినట్టే కనిపిస్తుంది. అయితే సీరియల్ కిల్లింగ్ వ్యవహారం మితిమీరినట్టు కనిపిస్తుంది. బ్రహ్మ, బాబు ఎందుకు చంపుతున్నారనే విషయంపై క్లారిటీ కనిపించదు. ఎంతసేపు హత్యలు, జుగప్సకరమైన సన్నివేశాలు కథ నుంచి డిస్‌కనెక్ట్ చేసేలా చేస్తాయి. సీరియల్ కిల్లింగ్ అనే సింగిల్ పాయింట్‌తో సాగదీసినట్టు అనిపిస్తుంది.

Nayanataras God Review and Rating: Jayam Ravi killing performance

ఇక గాడ్ (God) నటీనటుల పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. అర్జున్ ఏసీపీగా, ఎన్‌కౌంటర్ స్పెషలిస్టుగా తన పాత్రలో పవర్‌ఫుల్‌గా కనిపించాడు. కొన్ని సన్నివేశాల్లో ఎమోషనల్ ఫెర్ఫార్మెన్స్ ఆకట్టుకొనేలా ఉంది. ఇక నయనతార ఈ సినిమాలో రోల్ కేవలం గెస్ట్ అప్పీయరెన్స్ మాదిరిగానే ఉంది. సినిమా ఆరంభంలో కొద్దిసేపు, క్లైమాక్స్‌లో కొద్ది నిమిషాలకే నయనతార పరిమితమైంది. పాత్ర నిడివి తక్కువగా ఉండటంతో ఫెర్ఫార్మెన్స్ స్కోప్ లేకపోయింది. బ్రహ్మగా రాహుల్ బోస్ ప్రేక్షకుడిని భయపెట్టే విధంగా నటించాడు. సెకండాఫ్‌లో వినోద్ కిషన్ ఫెర్ఫార్మెన్స్ బాగుంది. మిగితా నటీనటులు వారి తమ పాత్రల పరిధి మేరకు నటించారు.

గాడ్ (God) మూవీ సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. మ్యూజిక్, సినిమాటోగ్రఫి బలంగా కనిపిస్తాయి. యువన్ శంకర్ రాజా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అద్బుతంగా ఉంటుంది. పలు సన్నివేశాలను యువన్ శంకర్ రాజా ఎలివేట్ చేసిన విధానం బాగుంది. నైట్ ఎఫెక్ట్ సీన్లను హరి కే వేదాంతం చిత్రీకరించిన తీరు బాగుంది. జెరీష్ రాజా అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.

Nayanataras God Review and Rating: Jayam Ravi killing performance

మర్డర్ మిస్టరీ, సైకో కిల్లర్ కాన్సెప్ట్, యాక్షన్ తదితర అంశాలతో సాగే యాక్షన్ థ్రిలర్ గాడ్. తమిళంలో రూపొందిన ఇరైవన్ సినిమాకు ఇది డబ్బింగ్ చిత్రంగా తెలుగులో రిలీజైంది. జయం రవి, రాహుల్ బోస్, వినోద్ కిషన్ ఫెర్ఫార్మెన్స్ మెప్పిస్తాయి. మితి మీరిన హింస, సీన్లలో రక్తపాతం ఇబ్బందికరంగా ఉంటాయి. మర్డర్ మిస్టరీ, సైకో కిల్లింగ్ బ్యాక్ డ్రాప్‌తో వచ్చే సినిమాలను ఇష్టపడే వారికి గాడ్ సినిమా నచ్చుతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X