twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నయనతార.. ‘అంజలి సిబిఐ’ రివ్యూ, రేటింగ్

    |

    Rating:
    2.5/5
    Star Cast: న‌య‌న‌తార‌, అథ‌ర్వ, రాశీఖ‌న్నా, అనురాగ్ క‌శ్య‌ప్, విజయ్ సేతుపతి
    Director: ఆర్ అజ‌య్ జ్ఞాన‌ముత్తు

    సౌత్ లేడీ సూప‌ర్ స్టార్‌ నయనతార నటించిన సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ 'ఇమైక్క నోడిగ‌ల్' తమిళంలో మంచి విజయం అందుకుంది. తాజాగా ఈ చిత్రాన్ని తెలుగులో 'అంజలి సిబిఐ' పేరుతో విడుదల చేశారు. ఆర్ అజ‌య్ జ్ఞాన‌ముత్తు దర్శకత్వం వహించిన ఈ మూవీలో న‌య‌న‌తార సిబిఐ ఆఫీస‌ర్ పాత్రలో నటించగా అథ‌ర్వ‌, రాశీఖ‌న్నా కీల‌క పాత్ర‌లు పోషించారు. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనురాగ్ క‌శ్య‌ప్ ప్ర‌తినాయకుడిగా నటించడంతో ఈ చిత్రంపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఈ క్రైమ్ థ్రిల్లర్ తెలుగు ప్రేక్షకులను ఏమేరకు ఆకట్టుకుందో చూద్దాం.

    కథ

    కథ

    అంజలి(నయనతార) డేరింగ్ & సిన్సియర్ సిబిఐ ఆఫీసర్. డ్యూటీలో చేరిన కొత్తలోనే రుద్ర అనే సీరియల్ కిల్లర్‌ను మట్టుపెట్టి వార్తల్లోకెక్కుతుంది. తన పనితీరుతో తక్కువ సమయంలోనే ప్రమోషన్స్ కొట్టేసి పైస్థాయికి వెళుతుంది. అయితే కొన్నేళ్లు గడిచిన తర్వాత రుద్ర పేరుతో మళ్లీ అదే తరహాలో కిడ్నాప్, హత్యలు చోటు చేసుకుంటాయి. రుద్ర పోలీసులకు, మీడియాకు సమాచారం ఇచ్చి మరీ హత్యలు చేస్తుంటాడు. దీంతో అంజలి పని తీరుపై అనుమానాలు మొదలవుతాయి. రుద్ర పేరుతో ఈ హత్యలు చేస్తన్న మార్టిన్(అనురాగ్ కశ్యప్) సీబీఐ డిపార్టుమెంటును ఓ ఆట ఆడుకుంటాడు. ఇంతకీ రుద్ర ఎవరు? రుద్ర పేరుతో మార్టిన్ ఈ హత్యలు ఎందుకు చేస్తున్నాడు? ఇంతకీ రుద్ర అనే వ్యక్తి ఉన్నాడా? అధర్వ-రాశీ ఖన్నాకు ఈ కథతో సంబంధం ఏమిటి? అనేది తెరపై చూడాల్సిందే.

    ఎవరి పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది?

    ఎవరి పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది?

    సీబీఐ ఆఫీసర్ అంజలి పాత్రలో నయనతార పెర్ఫార్మెన్ప్ ఫర్వాలేదు. ఆమె పాత్ర ఇంకా పవర్‌ఫుల్‌గా డిజైన్ చేసి ఉంటే బావుండేది. ప్రతినాయకుడి పాత్రలో అనురాగ్ కశ్యప్ జస్ట్ యావరేజ్. తమిళనటుడు అధర్వ తన పాత్రకు న్యాయం చేశాడు. రాశి ఖన్నా కొన్ని లవ్ సీన్లకే పరిమితం అయింది. నటించడానికి స్కోప్ లేకున్నా ఉన్నంతలో తన నటనతో మెప్పించింది.

    టెక్నికల్ అంశాలు

    టెక్నికల్ అంశాలు

    ఆర్.డి.రాజశేఖర్ సినిమాటోగ్రఫీ బావుంది. హిప్ హాప్ తమిళ అందించి సంగీతం ఓకే. బ్యాంగ్రౌండ్ స్కోర్ కొన్ని చోట్లు బావుంది. భువన్ శ్రీనివాసన్ ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త శ్రద్దపెడితే బావుండేది. ముఖ్యంగా ఫస్టాఫ్‌లో షార్ప్ ఎడిటింగ్ చేయాల్సింది.

    స్క్రీన్ ప్లే ఎలా ఉంది?

    స్క్రీన్ ప్లే ఎలా ఉంది?

    సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ కాన్పెప్టులు ఎంచుకున్నపుడు స్క్రీన్ ప్లే పర్ఫెక్టుగా ఉండాలి. అప్పుడే చూస్తున్న ప్రేక్షకుడికి ఆసక్తి పెరుగుతుంది. ఈ విషయంలో దర్శకుడు ఆర్ అజ‌య్ జ్ఞాన‌ముత్తు మంచి ప్రతిభ కనబరిచాడని చెప్పొచ్చు. ఫస్టాఫ్ కాస్త సాగదీసినట్లు అనిపించినా... సెకండాఫ్ మాత్రం ఊహించని ట్విస్టులతో థ్రిల్ చేశాడు.

    దర్శకుడి పని తీరు

    దర్శకుడి పని తీరు

    దర్శకుడు ఆర్ అజ‌య్ జ్ఞాన‌ముత్తు డైరెక్షన్ పరంగా ఓకే. స్క్రీప్లే పరంగా అతడు రాసుకున్న స్క్రిప్టు బావుంది కానీ... నయనతార, అనురాగ్ కశ్యప్ పాత్రలను ఇంకా పవర్‌ఫుల్‌గా డిజైన్ చేసి ఉంటే సినిమా ఓ రేంజిలో ఉండేది. ప్రేక్షకుడిని చివరి వరకు సీట్లో కూర్చోబెట్టడంలో కొంతవరకు సక్సెస్ అయ్యాడు.

    ఫస్టాఫ్ ఎలా ఉంది?

    ఫస్టాఫ్ ఎలా ఉంది?

    సినిమా ఫస్టాఫ్ సీరియల్ హత్యలు. పోలీసులను, సీబీఐని ముప్పతిప్పలు పెడితూ విలన్ తన నేరాలు కొనసాగించే సన్నివేశాలు, అధర్వ-రాశి ఖన్నా మధ్య సాగే లవ్ సీన్లతో తో రెగ్యులర్ క్రైమ్ మూవీ చూసినట్లు ఉంటుంది. ఇంటర్వెల్ తర్వాతే అసలు కథ స్టార్ట్ అవుతుంది.

    సెకండాఫ్

    సెకండాఫ్

    సెకండాఫ్ మొత్తం ట్విస్టులు, ఊహించని మలుపులతో ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తిస్తూ సాగుతుంది. ఓ పాయింటులో నయనతారే ఈ హత్యలన్నీ చేస్తుందా? అనే సందేహం కూడా ప్రేక్షకులను ఉత్కంఠకు గురి చేస్తోంది. నయనతార-విజయ్ సేతుపతిపై వచ్చే ఫ్లాష్ బ్యాక్ స్టోరీ మెప్పిస్తుంది.

    ప్లస్ పాయింట్స్

    ప్లస్ పాయింట్స్

    • సెకండాఫ్‌‌లో వచ్చే సన్నివేశాలు
    • ఇంటర్వెల్ తర్వాత స్క్రీన్ ప్లే
    • నయనతార పెర్ఫార్మెన్స్
    • మైనస్ పాయింట్స్

      • ఫస్టాఫ్‌లో వచ్చే సన్నివేశాలు
      • పాత్రల డిజైనింగ్ బలంగా లేక పోవడం
      • కొన్ని లాజిక్ లేని సన్నివేశాలు
      • విశ్లేషణ

        విశ్లేషణ

        సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్స్ అంటే సినిమా ఓపెనింగ్ సీన్ నుంచే ఆసక్తికరంగా మొదలు పెట్టాలి. అయితే ఇంటర్వెల్ వరకు సినిమా కాస్త బోర్ అనిపిస్తుంది. క్రైమ్ సీన్లను కూడా ఆసక్తికరంగా చూపడంలో విఫలం అయ్యారు. కొన్ని సీన్లకు సరైన కంక్లూజన్ ఇవ్వక పోవడంతో ప్రేక్షకుల్లో అనుమానాలు అలాగే మిగిలిపోయాయి. సెకండాఫ్ నుంచి సినిమా ఆసక్తికర సీన్లతో కథను ముందుకు నడిపించినప్పటికీ క్లైమాక్స్ అందరూ ఊహించే విధంగా డిజైన్ చేయడంతో థ్రిల్ మిస్సయిన ఫీలింగ్ కలుగుతుంది.

        చివరగా...

        చివరగా...

        క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడే వారికి, అది కూడా ఇంటర్వెల్ వరకు కాస్త బోర్ అనిపించినా ఓపికగా కూర్చోగలిగితే ‘అంజలి సిబిఐ' యావరేజ్ సినిమా చూసిన ఫీలింగ్ కలిగిస్తుంది.

        న‌టీన‌టులు:

        న‌టీన‌టులు:

        న‌య‌న‌తార‌, అథ‌ర్వ, రాశీఖ‌న్నా, అనురాగ్ క‌శ్య‌ప్, ర‌మేష్ తిల‌క్, దేవన్ త‌దిత‌రులు..

        సాంకేతిక విభాగం:
        క‌థ‌, స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌కుడు: ఆర్ అజ‌య్ జ్ఞాన‌ముత్తు
        నిర్మాత‌లు: Ch రాంబాబు, ఆచంట గోపీనాథ్
        బ్యాన‌ర్: విశ్వ‌శాంతి క్రియేష‌న్స్
        సంగీతం: హిప్ హాప్ త‌మిళ‌న్
        సినిమాటోగ్ర‌ఫీ: ఆర్ డి రాజ‌శేఖ‌ర్
        ఎడిట‌ర్: భువ‌న్ శ్రీ‌నివాస‌న్
        విడుదల తేదీ: ఫిబ్రవరి 22

    English summary
    Nayanthara’s Anjali CBI movie review and Rating. Nayanthara’s blockbuster film ‘Imaikkaa Nodigal’ is getting dubbed in Telugu and is titled ‘Anjali CBI.’ This is a crime thriller directed by R Ajay Gnanamuthu and Nayanthara is playing the title role, as a CBI officer. The film also stars Atharvaa and Raashi Khanna in the lead roles while Bollywood director Anurag Kashyap played the antagonist role. Actor Vijay Sethupathi did a guest role of Vikramaditya, Anjali’s husband.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X