Nee Dhaarey Nee Katha Review నీదారే నీ కథ మూవీ రివ్యూ

Rating:
2.5/5

నటీనటులు: సీనియర్ యాక్టర్ సురేష్, ప్రియతమ్ మంతిని, విజయ విక్రాంత్, అనంత పద్మశాల, అంజన బాలాజీ, వేద్ తదితరులు
దర్శకుడు: వంశీ జొన్నలగడ్డ
నిర్మాతలు: వంశీ జొన్నలగడ్డ, తేజేష్ వీర, శైలజ జొన్నలగడ్డ
బ్యానర్: జేవీ క్రియేషన్స్
రచయిత: మురళి కాంత్, వంశీ జొన్నలగడ్డ
మ్యూజిక్: ఆల్బర్ట్టో గురియోలి
కాస్ట్యూమ్ డిజైనర్: హర్షిత తోట
ఎడిటర్: విపిన్ సామ్యూల్
రిలీజ్ డేట్: 2024-06-14

అర్జున్ (ప్రియతమ్ మంతిని)కి మ్యూజిక్ అంటే ప్రాణం. తన స్నేహితులు విజయ్, రాహుల్‌తో కలిసి మ్యూజిక్ ఆర్కెస్ట్రాను రన్ చేస్తుంటాడు. అయితే తన తోటి వేరే రంగాలను ఎంచుకొని లక్షలు సంపాదిస్తుండటంతో ఫ్యామిలీలో కొందరు అర్జున్ నిర్ణయాన్ని తప్పుపడుతారు. కానీ అర్జున్ తాను నమ్ముకొన్న మ్యూజిక్‌తోనే ప్రయాణం సాగిస్తుంటాడు. ఓ టాప్ మ్యూజిక్ పోటీలో పాల్గొనాల్సి ఉండగా స్నేహితులు హ్యాండ్ ఇస్తారు. అలాగే పోటీలో ప్రదర్శన ఇవ్వడానికి కొన్ని క్షణాల ముందు తండ్రి మరణించాడనే వార్త తెలుస్తుంది.

Nee Dhaarey Nee Katha Movie Review

అయితే అర్జున్ తన ముందు నిలిచిన సవాళ్లను ఎలా ఎదురించాడు? మ్యూజిక్ ఫీల్డ్‌ను ఎంచుకోవడంపై ఫ్యామిలీ మెంబర్స్ కించపరిస్తే అర్జున్ ఎలా రియాక్ట్ అయ్యాడు. అర్జున్‌కు తండ్రి సహకారం ఎలా ఉండేది? తన ప్రొఫెషన్‌కు జీవన్మరణ సమస్యగా మారిన సమయంలో తండ్రి మరణించడంతో అర్జున్ పరిస్థితి ఏ విధంగా మారింది? చివరకు తాను అనుకొన్న లక్ష్యాన్ని ఆయన చేరుకొన్నాడా? మరణానికి ముందు తండ్రి తన డైరీలో రాసుకొన్న స్టెట్‌మెంట్ అర్జున్ జీవితానికి ఎలాంటి దారి చూపిందనే ప్రశ్నలకు సమాధానమే నీదారే నీ కథ.

టైటిల్‌కు తగినట్టు ఈ సినిమాలో కమర్షియల్ వాల్యూస్ తక్కువ.. భావుకత ఎక్కువ. దర్శకుడు వంశీ కూడా తాను నమ్ముకొన్న కథనే నిజాయితీగా తెరకెక్కించారనే విషయం సినిమా ప్రారంభంలోనే తెలిసి పోతుంది. లాభ, నష్టాలను బేరీజు వేసుకొకుండా తమకు నచ్చిన కథను ప్రేక్షకులకు చూపించాలనే తపన దర్శక, నిర్మాతలు వంశీ జొన్నలగడ్డ, తేజేష్ వీర, శైలజ జొన్నలగడ్డ కనిపిస్తుంది. కథలో తండ్రి కొడుకుల మధ్య ఎమోషన్స్ ఉన్నాయి. కానీ కథనంలో వేగం లేకపోవడం కొంత ఓపికగా చూడాల్సిన పరిస్థితి ఉంటుంది.

అర్జున్‌గా ప్రియతమ్ తన పాత్రను అర్ధం చేసుకొని నటించారని చెప్పడం కంటే.. బిహేవ్ చేశారనే ఫీలింగ్ కలుగుతుంది. ప్రతీ పాత్రను చాలా సహజ సిద్దంగా పోషించారు. వెగటు కామెడీ లేకుండా చాలా ఆరోగ్యకరమైన వినోదంతో కథను ముందుకు తీసుకెళ్లారు. అయితే ప్రస్తుతం జనరేషన్‌ అభిరుచికి తగినట్టుగా కథ, కథనాలపై కసరత్తు చేసి ఉంటే.. ఇంకా బెటర్ అవుట్ పుట్ వచ్చి ఉండేదనిపిస్తుంది. ఫీల్ గుడ్ సినిమాకు కావాల్సిన సాంకేతిక హంగులను ప్రతీ ఒక్కరు సమకూర్చారు. మ్యూజిక్ బ్యాక్ డ్రాప్‌తో వచ్చే సినిమాలను ఇష్టపడే వారికి నచ్చే అవకాశం ఉంది. కంటెంట్ ఉన్న చిన్న సినిమాలు ఆదరించే వారు అంచనాలు పెట్టుకోకుండా ఈ సినిమాను ఓ సారి ట్రై చేయవచ్చు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X