For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

    రోటీన్‌ చిత్రం

    By Staff
    |

    eeku Nenu Naku Nuvvu
    -జలపతి గూడెల్లి
    చిత్రం: నీకు నేను..నాకు నువ్వు
    నటీనటులు: ఉదయ్‌ కిరణ్‌, శ్రియా, కృష్ణంరాజు, సుమన్‌
    సంగీతం: ఆర్పీ పట్నాయక్‌
    నిర్మాత: డి.సురేష్‌ బాబు
    స్క్రీన్‌ ప్లే, దర్శకత్వం: రాజశేఖర్‌

    గత ఏడాది యంగ్‌ హీరో తరుణ్‌ తో మంచి వినోదాత్మక ప్రేమకథ రూపొందించిన నిర్మాత డి.సురేష్‌ బాబు ఈ సారి మరో యంగ్‌ హీరోతో ఇలాంటి రోటీన్‌ చిత్రం తీయడానికి ఎందుకు సాహసించారో అర్థం కాదు. సినిమాలో అణుమాత్రం కొత్తదనం లేదు. ఉదయ్‌ కిరణ్‌ కు ఏమాత్రం సూట్‌ కానీ, ఏడుపుగొట్టు చిత్రం. యువతరం హీరోతో ఇలాంటి చిత్రం తీయాలనుకోవడం తప్పుడు ఆలోచనే అని చెప్పాలి. కొత్త దర్శకుడు రాజశేఖర్‌ ఎక్కడా తన 'ప్రతిభ'ను చాటుకోలేదు. కాసేపు సెంటిమెంట్‌, ఆ తర్వాత ఎవరికీ అర్థంకానీ జోక్‌ లు. కభీ కుషీ. కభీ ఘమ్‌ అన్నమాట. ఉదయ్‌ కిరణ్‌, శ్రేయల మధ్య ప్రేమ ఏ మాత్రం పండలేదు. కృష్ణంరాజు, సుమన్‌ లు ఉత్సవ విగ్రహాలే తప్ప వారి పాత్రలు పెద్దగా ఆకట్టుకోవు. ఈ సినిమా గురించి పెద్దగా రాసేదేమీ లేదు.

    కృష్ణంరాజు పెద్ద పారిశ్రామికవేత్త. ఒక్కగానొక్క కూతురు పెళ్ళిపీటల మీద నుంచి పారిపోయి తండ్రి దగ్గర పనిచేసే గుమాస్తా సుమన్‌ ను పెళ్ళిచేసుకుంటుంది. కూతురు చేసిన అవమానం భరించని కృష్ణంరాజు అనాథ (ఉదయ్‌ కిరణ్‌)ను దత్తత తీసుకుంటాడు. ఉదయ్‌ తండ్రి ఆశలకు తగ్గట్లే పెరుగుతాడు. కానీ అనుకోకుండా శ్రియను ప్రేమిస్తాడు. శ్రియా సుమన్‌ కూతురే. ఆమె తల్లి చనిపోవడంతో వీరు లండన్‌ నుంచి హైదరాబాద్‌ వస్తారు. ఇక శ్రియా, ఉదయ్‌ కిరణ్‌ లు రెండు కుటుంబాలను ఏకం చేసేందుకు ప్రయత్నించడమే ...మిగతా కథ.

    ప్రతి సన్నివేశాన్ని మనం ఊహించొచ్చు ఈ చిత్రంలో. ఆర్పీ పట్నాయక్‌ సంగీతం మోస్తారుగా ఉంది. సాంకేతిక నిపుణుల ప్రతిభ పెద్దగా లేని చిత్రం ఇది. సెకాండాఫ్‌ లో ఉన్న సెంటిమెంట్‌, ఏడుపు సీన్లు మహిళలకు నచ్చే అవకాశం ఉంది. వారిని దృష్టిలో పెట్టుకొనే తీశారేమో!

     

    తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more