నీమ-నాతె - యావరేజ్

చిత్రం: నీ మనసు నాకు తెలుసు
నటీనటులు: తరుణ్, త్రిషా, శ్రియా, సునీల్,
రీమాసేన్, తనికెళ్ళ భరణి తదితరులు..
సంగీతం: ఎ.ఆర్.రెహమాన్
నిర్మాత: ఎ.ఎం.రత్నం
స్క్రీన్ ప్లే దర్శకత్వం: జ్యోతికృష్ణ
ప్రముఖ నిర్మాత ఎ.ఎం.రత్నం కుమారుడు జ్యోతికృష్ణ తొలిసారి దర్శకత్వం వహించిన 'నీ మనసు నాకు తెలుసు' చిత్రంలో ఎ.ఆర్.రెహమన్ పాటలు, యూత్ చిత్రాల్లో ఉండే సరదా కామెడీ ఈ సినిమాలో నచ్చే అంశాలు. ఈ సినిమా ద్వారా హీరోయిన్ గా పరిచయమైన త్రిషా మరో ప్లస్ పాయింట్. వీటితోటే సినిమా నడిపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు. హాలీవుడ్ చిత్రం 'సెరిండిపిటీ' చిత్రాన్ని కాస్తా మార్చి తీసిన ఈ చిత్రం ఏ రకంగా చూసినా యావరేజ్.
తరుణ్, త్రిషాలు ఓ రైలు ప్రయాణంలో తారసపడుతారు. తొలిచూపులోనే ప్రేమలో పడుతారు. కానీ ఒకరి గురించి ఒకరికి ఏ విషయాలు తెలియవు. హైదరబాద్ స్టేషన్ లో విడిపోయే ముందు వారి చదువు గురించి చెప్పుకోవడం మినహా మరేమీ చెప్పుకోకుండానే విడిపోతారు. ఆ తర్వాత తరుణ్ తన కాలేజీలో తన బృందం (సునీల్, శివారెడ్డి, బబ్లు)తో గడుపుతూనే..ఆ అమ్మాయి కోసం అన్వేషిస్తుంటాడు. మరోవైపు, ఆ అమ్మాయి కూడా సిటీ అంతా రోజూ తరుణ్ గురించే వెతుకుతుంటుంది. వీరిద్దరి ఇళ్ళు పక్కపక్కనే.
తరుణ్ కుటుంబానికి త్రిషా సాయం చేస్తుంటుంది. కానీ తరుణ్ కు ఎప్పుడూ తారసపడదు. తరుణ్ అమెరికాలో జాబ్ వచ్చినా వెళ్ళకుండా ఎవరో ముక్కుమొహం తెలియని అమ్మాయి కోసం ప్రయత్నిస్తున్నాడని వాళ్ళ అమ్మకు తెలుస్తుంది. ఆమె తిట్టడంతో..అమ్మ కోసం అమెరికా వెళ్ళేందుకు సిద్దమవుతాడు. త్రిషా కూడా తల్లితండ్రుల కోరిక మేరకు వేరే అబ్బాయితో పెళ్ళికి అంగీకరిస్తుంది. తరుణ్ అమెరికా వెళుతాడు. త్రిషా పెళ్ళి చేసుకునేందుకు ముంబై వెళుతుంది. చివర్లో వీరు ఇద్దరూ ఎలా కలుస్తారనేది క్లైమాక్స్.
డెస్టినీ. రాసిపెట్టి ఉంటే ఎలాగైనా ఒకటవుతారనే సూత్రం మీద 'సెరిండిపిటీ' అనే హాలీవుడ్ చిత్రం రూపొందింది. ఇదే పాయింట్ తో రసూల్ 'ఒకరికి ఒకరు' తీశాడు. తమిళంలో ఇటీవల దర్శకుడు శరణ్ (జెమిని ఫేం) మాధవన్ తో 'జేజే' తీశాడు. ఇప్పుడు జ్యోతికృష్ణ ఈ చిత్రం రూపొందించాడు.
పాయింట్ మంచిదే కానీ, సెకాండాఫ్ లో సినిమాను మరీ సాగదీశాడు. తరుణ్, త్రిషాలిద్దరూ బాగా చేశారు. త్రిషా హోవ్లీు అందం కుర్రకారును ఆకట్టుకుంటుంది. రెహమాన్ సంగీతం సినిమాకు ప్రాణం. ఫోటోగ్రఫీ ఫర్వాలేదు. ఇప్పుడు ప్రపంచ సినిమా అంతా క్రేజ్ గా మారిని స్ల్పిట్ స్క్రీన్ ఎడిటింగ్ పద్దతిని ఇందులో రెండు సార్లు వాడడం బాగుంది.


Click it and Unblock the Notifications











