Home
-జలపతి గూడెల్లి
చిత్రం: వెంకీ
నటీనటులు:రవితేజ, స్నేహ, అషుతోష్ రాణా, చిత్రంశ్రీను, బ్మ్రనందం, ధర్మవరపుసుబ్రమణ్యం, తదితరులు
సంగీతం: దేవీశ్రీప్రసాద్
నిర్మాత: అట్లూరి పూర్ణచంద్రరావు
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:శ్రీను వైట్ల
చిన్నలైన్‌తో ఆద్యంతం ఆసక్తికరంగాచెప్పిన చిత్రం ఇది. పూర్తి స్థాయిలోఎంటర్‌టైనర్ అని చెప్పవచ్చు. కథలోనిపాయింట్ కన్నా దాన్ని చివరివరకుఇంట్రెస్ట్‌ను సస్టేన్ చేయడంలోదర్శకుడు శ్రీను వైట్ల బాగా సక్సెస్‌అయ్యాడు. స్క్రీన్ ప్లేలో పట్టు, రవితేజఎంటర్‌టెయినింగ్ నటనే ఈ సినిమాకుప్రధాన ఆకర్షణ. పాటలు బాగుంటే ఈసినిమా ఇంకా బాగుండేది.
వెంకీ(రవితేజ) అతని మిత్రబృందం విశాఖలోబలాదురుగా తిరుగుతుంటారు. ఉద్యోగంలేక అప్పోసప్పో చేసి బతికే ఈ కుర్రాళ్ళకిఅనుకోకుండా ఎస్పై ఉద్యోగాలు లభిస్తాయి.హైదరాబాద్‌లోని పోలీసు శిక్షణాకేంద్రానికిబయలుదేరుతారు. వెంకీకి జాతకాలపిచ్చి. జ్యోతిష్యచౌదరి (మల్లికార్జునరావు)చెప్పే జ్యోతిష్యం అంటే గురి. తనకుత్వరలోనే ఓ అందాల సుందరి పరిచయంఅవుతుందని, ఆమెనే పెళ్ళిచేసుకుంటావనిఆ జ్యోతిష్కుడు చెప్పడంతో రైళ్ళో ఆ సుందరికోసం చూస్తాడు. తర్వాతి స్టేషన్‌లోశ్రావణి (స్నేహ) ఎక్కుతుంది. ఆవిడే తనకాబోయే భార్య అని రవితేజ ఊహించేకొని ..ఆవిడని పడేసేందుకు నానా తిప్పలుపడుతుంటాడు. ఇదంతా ఓ ఇరవై నిమిషాలపాటు రైళ్ళోనే సరదాగా సాగుతుంటుంది.చివర్లో ఆమెకు ప్రపోజ్ చేస్తాడు.
స్నేహ,ఆమె తండ్రి, ఆమె రవితేజనుతిట్టి..కొడుతారు. దాంతో రవితేజ మీఇద్దర్నీ నరికేస్తానని ఆవేశంగాచెప్పి..పడుకుంటాడు. మర్నాడుహైదరాబాద్‌కు ట్రెయిన్‌చేరుకోగానే స్నేహ తండ్రి, మరోన్రయాణీకురాలి గొంతు కోసి చంపేసిఉంటుంది. రవితేజ, వారి బృందమే ఈ పని చేసిఉంటుందని అందరూ భావిస్తారు. దీంతోరవితేజ, వారి స్నేహితులు..అక్కడ్నుంచిపారిపోయి..పోలీసు అకాడెమీలో చేరుతారు.అకాడెమీలో చేరాకా, వారికి అసలు వారిని ఎవరుచంపారో తెలుస్తుంది. ఇక స్నేహకు ఆవిషయం తెలియచేసి, ఆమెనురక్షించడంతో పాటు, వారిపై నిందనుతొలగించుకోవడం సెకాంఢాఫ్.
చాలాసింపుల్ కథను ఇంట్రెస్టింగ్‌గాచెప్పారు. దర్శకుడు శ్రీను వైట్లవినోదాత్మక ప్రథమార్థం అంతావినోదాత్మకంగా చెప్పే పద్దతిని బాగాఅలవర్చుకున్నట్లు కన్పిస్తోంది. ఈ సినిమాలో అదిబాగా వర్కవుట్ అయింది. రవితేజ,బ్మ్రనందంల మధ్య సీన్లు బాగాపండాయి. రవితేజ నటన బాగుంది ఈసినిమాలో. విలన్ పాత్రలో అషుతోష్ రాణాబాగా రాణించాడు. ఆ పాత్రకు బాగాసూటయ్యాడు. అయితే, సబ్‌జుడీస్‌లో ఉన్ననకీలీ స్టాంప్ కుంభకోణం వంటికేసు మీద (అంటే కోర్ట్‌లో ఉన్న కేసు)అప్పుడే కథ తయారు చేసుకొని అందులోఫలానావారు దోషులు అని చెప్పడంబాధ్యతారాహిత్యమే అని చెప్పాలి. స్నేహ డీసెంట్‌గా చేసింది.దేవీశ్రీప్రసాద్ స్వరపర్చిన రెండు పాటలుబాగున్నా, పెద్ద హిట్ పాటలు కావు.సంగీతం బాగుంటే ఇంకా సినిమాబాగుండేది. చూడదగ్గ చిత్రం.
| Rating: | Bad | Average | Good | Excellent | Extraordinary |
Recent Reviews
- జై


Click it and Unblock the Notifications











