twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నీ స్నేహం..చక్కటి సినిమా

    By Staff
    |

    Nee Sneham
    -జలపతి
    చిత్రం: నీ స్నేహం
    నటీనటులు: ఉదయ్‌ కిరణ్‌, జతిన్‌, ఆర్తి అగర్వాల్‌,
    గిరిబాబు, పరుచూరి వెంకటేశ్వరరావు...
    సంగీతం: ఆర్పీ పట్నాయక్‌
    స్క్రీన్‌ ప్లే, నిర్మాత: ఎం.ఎస్‌.రాజు
    దర్శకత్వం: పరుచూరి మురళి

    ఉదయ్‌ కిరణ్‌ తో నిర్మాత ఎం.ఎస్‌.రాజు నిర్మించిన గత చిత్రం మనసంతా నువ్వే మాదిరిగానే నీ స్నేహం చక్కటి ప్రేమకథ. ఈ ముక్కోణపు ప్రేమకథలోని అనేక భాగాలు ఇదివరకు మనం చాలా సార్లు చూసే ఉంటాం. కానీ స్క్రీన్‌ ప్లేలో ఉన్న పట్టు వల్ల ఈ సినిమాలో కొత్తదనం కన్పిస్తుంది. ఈ చిత్రానికి స్క్రీన్‌ ప్లే సమకూర్చిన ఎం.ఎస్‌.రాజు, సీనియర్‌ మోస్ట్‌ సినిమాటోగ్రాఫర్‌ ఎస్‌.గోపాల్‌ రెడ్డి కెమెరా పనితనం నీ స్నేహం చిత్రాన్నా ఆకట్టుకునేలా చేస్తాయి.

    సినిమా తొలి అరగంటలోనే కథ ఏమిటో తెలిసిపోతుంది. అయినప్పటికీ, ఉదయ్‌ కిరణ్‌ ఆర్తిని పొందేందుకు చేసే ప్రయత్నం ఏదీ విసుగు అనిపించదు. కథనం ఈ సినిమాకు అతిపెద్ద ప్లస్‌ పాయింట్‌. అగస్త్యన్‌, విక్రమన్‌ చిత్రాల కనిపించే స్క్రీన్‌ ప్లే ఈ చిత్రంలో కనిపిస్తుంది. కోల్‌ కతా, గోవా, హైదరాబాద్‌ ఈ మూడు ప్రాంతాల్లో చిత్రం చిత్రీకరించడం అక్కడి లోకేషన్స్‌ ను గోపాల్‌ రెడ్డి అందంగా చూపించడంతో పాటు, కొత్త దర్శకుడు పరుచూరి మురళి ప్రతిభ కలిసి సినిమా హాయిగా సాగుపోతుంది.

    ఎమోషనల్‌ సీన్స్‌ లో ఉదయ్‌ కిరణ్‌ నటన ఇంకా ఇంప్రూవ్‌ కావాల్సి ఉన్నప్పటికీ ఈ చిత్రంలో నటన బాగుంది. పూర్తి స్థాయి మిడిల్‌ క్లాస్‌ అమ్మాయిగా నటించిన ఆర్తి ఈ చిత్రంలో చక్కగా నటించింది. ఆర్పీ పట్నాయక్‌ సంగీతం కన్నా రీరికార్డింగ్‌ ఈ చిత్రానికి ఎస్సెట్‌ గా నిలిచింది. పాటలు తెరపై అన్ని బాగానే ఉన్నా...'హిందోళంలా...సాగే..' అనే పాటను నేపథ్యానికి ఉపయోగించుకున్న తీరు బాగుంది.

    సీతాకోక చిలుక చిత్రంలో ఇళయారాజా కంపోజ్‌ చేసిన 'అలలు కలలు..' ట్యూన్‌ మాదిరిగా ఉంది. అదే రీతిలో సినిమాలో ఈ పాటను మూడుసార్లు ఉపయోగించుకున్నారు. కొత్త హీరో జతిన్‌ నటన కూడా బాగుంది. కామెడీ నవ్వించేట్లుగా ఉన్నా, కొంచెం రోటిన్‌ డైలాగ్స్‌ ఎక్కువయ్యాయి. హిందీ చిత్రం సాజన్‌ ఈ చిత్రానికి ప్రేరణలాగా తొలుత అన్పించినా...అది ప్రేరణగానే మిగిలింది. ఇంటిల్లిపాది హాయిగా చూడదగ్గ చక్కటి ప్రేమకథా చిత్రం.

    కథ: ఆర్తి మిడిల్‌ క్లాస్‌ అమ్మాయి. తల్లితండ్రులు చిన్నప్పుడే చనిపోతారు. అమ్మమ్మ, తాతలే పెంచుతారు. ఉదయ్‌ కిరణ్‌, జతిన్‌ లు ప్రాణ స్నేహితులు. వీరిద్దరూ జాతీయ స్థాయి ఫుట్‌ బాల్‌ ఆటగాళ్ళు. ఉదయ్‌ వల్ల జతిన్‌ కాలు విరిగిపోతుంది.

    దాంతో జతిన్‌ ఫుట్‌ బాల్‌ కు పనికి రానివాడవుతాడు. మరోవైపు, ఉదయ్‌ ఆర్తిని చూడగానే ఇష్టపడుతాడు. కానీ ఆర్తికి ఉదయ్‌ వల్లే కష్టాలు వస్తున్నాయని గ్రహించి అతన్ని ద్వేషిస్తుంది. ఆర్తికి తెలియకుండా ఆమెను ఉదయ్‌ ఆదుకుంటాడు. మూగగా ప్రేమిస్తాడు. చివరికి ఆర్తికి, జతిన్‌ కు పెళ్ళి కుదురుతుంది. ఆ తర్వాత క్లైమాక్స్‌ ఏమిటో మీకు తెలిసిపోయే ఉంటుంది.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X