twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రెండు చిత్రాలూ అంతే..!

    By Staff
    |

    Premayanamaha
    -జలపతి గూడెల్లి
    ఈ వారం నాలుగు చిత్రాలు విడుదలయ్యాయి. అందులో ప్రధానమైన రెండు చిత్రాలు- శ్రీకాంత్‌ హీరోగా నటించిన 'నీకే మనసిచ్చాను', గాయకుడు సాందీప్‌ హీరోగా నటించిన 'ప్రేమాయనమః' రెండూ ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించేవే. ఈ రెండు చిత్రాలకు సమీక్ష కూడా అనవసరం. సంక్షిప్తంగా వాటి గురించి ఇలా..

    చిత్రం: నీకే మనసిచ్చాను
    నటీనటులు: శ్రీకాంత్‌, ఛార్మి, ఇతర బృందం
    సంగీతం: శ్రీ
    నిర్మాత: ఎం.ఎస్‌.కుమార్‌
    కథ, స్క్రీన్‌ ప్లే, దర్శకత్వం: సూర్యతేజ

    రాఘవేంద్రరావు శిష్యుడు సూర్యతేజ తీసిన ఈ చిత్రంలోని ప్రధానలోపం అమెచ్యురిష్‌ టేకింగ్‌ స్టైల్‌. 'పెళ్ళిసందడి' చిత్రంలో పాటలు అంత బాగా రావడానికి ఈయనే ప్రధాన కారణం సినిమా విడుదల ముందు గొప్పగా చెప్పుకున్నారు. కానీ, ఇందులో ప్రతి సీన్‌ అమెచ్యుర్డ్‌గానే ఉంది. కథ సోది కథ. దానికి తగ్గట్లే కథనం, హీరోగారి నటన. విచారకరమైన విషయమేమిటంటే 'శ్రీ' అంత సాధారణంగా సంగీతం అందివ్వడం. హైదరాబాద్‌ లో చెప్పాలంటే ఈ సినిమా బండల్‌.

    చిత్రం: ప్రేమాయనమః
    నటీనటులు: సాందీప్‌, కౌష, తనికెళ్ళ భరణి, 'నిర్మాతల' బృందం
    సంగీతం: రమేష్‌ ఎర్రా
    నిర్మాతలు: దయానంద్‌, విద్యాశంకర్‌, అమర్‌ నాథ్‌ గౌడ్‌, హరనాథ్‌
    కథ, స్క్రీన్‌ ప్లే, దర్శకత్వం: శివరామ్‌

    ఇది అమెరికా-ఆంధ్రా చట్నీ. అటు అమెరికా అమ్మాయి, గోదావరి జిల్లాలోని అబ్బాయి....

    మధ్య ప్రేమ అనే అరిగిపోయిన రికార్డ్‌ టైప్‌ కథను అంతే స్థాయిలో చిత్రీకరించాడు దర్శకుడు శివరామ్‌. తేజ, జెమిని టీవీల్లో పనిచేసిన ఈ క్రియేటివ్‌ టీం - ఫోటోగ్రఫీ విషయంలోనూ, అమెరికాలోని కొన్ని ప్రాంతాల చిత్రీకరణ విషయంలో మినహా మిగతా విషయాల్లో ప్రతిభను చూపించలేదు. ఇందులో ప్యారలెల్‌ గా సాగే (అది కూడా ఆ ఛానల్‌ లో కార్యక్రమాలు చేసేవాళ్ళే) కామెడీ దర్శకుడి, నిర్మాతలకు తప్ప మనలాంటి సామాన్యులకు నవ్వు తెప్పించదు. ఇక గాయకుడు సాందీప్‌ హీరోగా మారిన ఈ చిత్రంలో ఆయన నటన 'ఓరి నీ ప్రేమ బంగారం కానూ'లో నటించిన మరో గాయకుడు రాజేష్‌ కన్నా బెటరే అని చెప్పవచ్చు. ఈ సినిమాలో హీరో, కథలో పట్టు లేకపోవడం, కథనం వీక్‌ గా ఉండడం ప్రధాన లోపాలు. హీరోయిన్‌ కౌష బాగుంది. ఈ ఎన్నారై నిర్మాతలు, వారి తాలూకు వాళ్ళు తలో పాత్ర వేసేందుకు సినిమా తీశారేమో! రమేష్‌ ఎర్రా స్వరపర్చిన రెండు పాటలు బాగున్నాయి.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X