For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Nene Vasthunna Review ధనుష్ ఫెర్ఫార్మెన్స్.. సెల్వరాఘవన్ టేకింగ్ అదుర్స్

  |

  Rating: 2.75/5

  నటీనటులు: ధనుష్, ఇందుజా రవిచంద్రన్, ఎల్లి అవ్రామ్, యోగిబాబు తదితరులు
  రచన: ధనుష్
  దర్శకత్వం: సెల్వరాఘవన్
  నిర్మాత: కలైపులి ఎస్ థాను
  సినిమాటోగ్రఫి: ఓం ప్రకాశ్
  ఎడిటింగ్: భువన్ శ్రీనివాసన్
  మ్యూజిక్: యువన్ శంకర్ రాజా
  బ్యానర్: వీ క్రియేషన్స్
  రిలీజ్ డేట్: 2022-09-29

  నేనే వస్తున్నా కథ ఏమిటంటే?

  నేనే వస్తున్నా కథ ఏమిటంటే?

  కార్పోరేట్ కంపెనీలో ఉద్యోగి అయిన ప్రభు (ధనుష్) తన భార్య భువన (ఇందుజా రవిచంద్రన్), కూతురు సత్యతో ఆనందంగా జీవితాన్ని ఆస్వాదిస్తుంటాడు. ఉత్తర భారతంలో విహార యాత్ర చేసిన తర్వాత కూతురు సత్య మానసిక పరిస్థితి ఒకరకంగా మారిపోతుంది. తనలో తాను మాట్లాడుకోవడం, నిద్రలేమి సమస్యను సత్యను వెంటాడుతుంటాయి. అయితే సైక్రియాటిస్ట్ (ప్రభు)ను సంప్రదిస్తే.. సత్యను ఆత్మను వెంటాడుతుందని విషయం తెలుస్తుంది.

  నేనే వస్తున్నా మూవీలో ట్విస్టులు

  నేనే వస్తున్నా మూవీలో ట్విస్టులు

  సత్యను ఆత్మ ఎందుకు వెంటాడుతుంది? ప్రభు తన సోదరుడు కదిర్ (ధనుష్)కు ఎందుకు దూరమయ్యాడు? కదీర్‌ను ఆయన సొంత భార్య, పిల్లలు ఎందుకు వ్యతిరేకిస్తారు. కదీర్‌ నుంచి ఆయన కుటుంబం ఎందుకు పారిపోవాలని ప్రయత్నిస్తారు? తన కుటుంబంపై కదీర్ ఎందుకు కసి పెంచుకొంటాడు? అనే ప్రశ్నలకు సమాధానమే నేనే వస్తున్నా మూవీ కథ.

  ఫస్టాఫ్‌ ఎలా ఉందంటే?

  ఫస్టాఫ్‌ ఎలా ఉందంటే?

  నేనే వస్తున్నా (తమిళంలో నానే వరువీన్) చిత్రం సైకలాజికల్ థ్రిల్లర్. అనూహ్య పరిస్థితుల్లో చనిపోయిన ఓ వ్యక్తి.. తన మరణానికి కారణమైన వ్యక్తిపై పగ తీర్చుకొనేందుకు మరో వ్యక్తి శరీరంలోకి తన ఆత్మను ప్రవేశపెట్టడమే నేను వస్తున్నా పాయింట్. ఫస్టాఫ్‌లో ప్రభు కుటుంబంలో ఏర్పడిన సమస్యను ఆసక్తికరంగా దర్శకుడు సెల్వరాఘవన్ తెరకెక్కించాడు. ఫస్టాఫ్‌లో ప్రభు, సత్య మధ్య సన్నివేశాలు ఎమోషనల్‌గా ఉండటమే కాకుండా.. గుండెను పిండేసేలా ఉంటాయి. అయితే ఓ మంచి ట్విస్టుతో ప్రథమార్థం ముగుస్తుంది.

  సెకండాఫ్ ఇలా..

  సెకండాఫ్ ఇలా..

  ఇక సెకండాఫ్‌లో ప్రభు సోదరుడు కదీర్ ఫ్యామిలీలో చోటుచేసుకొన్న అనూహ్య పరిస్థితుల ఆధారంగా సినిమా కథ ముందుకు సాగుతుంది. విచిత్ర హావభావాలు, సమస్యపై తీవ్రంగా స్పందించే లక్షణాలు ఉన్న కదీర్ తనకు ఎదురైన అనుభవానికి పగ తీర్చుకోవడం, ఆ సంఘటనను కొడుకు చూడటంతో కథా స్వరూపం మారిపోతుంది. అయితే సత్యను ఆవహించిన ఆత్మ వదిలిపోయిందా? అనే విషయంతో కథ ముగుస్తుంది. అయితే ఫస్టాఫ్‌లో ఉన్న గ్రిప్పింగ్, డ్రామా, ఎమోషన్స్ సెకండాఫ్‌లో కనిపించవు. సెకండాఫ్‌లో ధనుష్ అగ్రెసివ్ క్యారెక్టర్ కొంత ఆసక్తిగా ఉంటుంది.

  ధనుష్ ఫెర్ఫార్మెన్స్

  ధనుష్ ఫెర్ఫార్మెన్స్

  ప్రభు, కదీర్‌గా ధనుష్ ద్విపాత్రాభినయం చేశాడు. ప్రభు ఫ్యామిలీ మ్యాన్‌గా నటిస్తే.. కదీర్ పాత్ర సీరియస్ నోట్‌తో సాగుతుంది. రెండు పాత్రల్లో ఎప్పటిలానే తన ఫెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకొన్నాడు. ప్రభు క్యారెక్టర్ ఎమోషనల్‌ ఉంటే.. కదీర్ పాత్ర అగ్రెసివ్‌గా కనిపిస్తుంది. ఈ రెండు పాత్రలను బ్యాలెన్స్ చేస్తూ ధనుష్ ఆకట్టుకొన్నాడు.

  మిగితా పాత్రల్లో నటీనటులు

  మిగితా పాత్రల్లో నటీనటులు

  మిగితా పాత్రల్లో భువనగా ఇందూజా రవిచంద్రన్, కదీర్ భార్యగా ఎల్లీ అవ్రామ్ నటించారు. వీరిద్దరూ తమ పాత్రలకు న్యాయం చేశారు. ప్రభు స్నేహితుడుగా యోగిబాబు సున్నితమైన హాస్యంతో నవ్వులు పూయిస్తాడు. సైక్రియాటిస్ట్‌గా ప్రభు తన పాత్రలో హుందాగా కనిపిస్తాడు. ధనుష్ కూతురుగా నటించిన బాలనటి అద్భుతమైన ఫెర్ఫార్మెన్స్‌తో సినిమాను ఫీల్‌గుడ్‌గా మార్చింది. మిగితా పాత్రల్లోనే వారి వారి పాత్రల పరిధి మేరకు ఒకే అనిపించారు.

  సినిమాటోగ్రఫి, మ్యూజిక్, ఇతర అంశాలు

  సినిమాటోగ్రఫి, మ్యూజిక్, ఇతర అంశాలు

  సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. నేనే వస్తున్నా సినిమాకు సినిమాటోగ్రఫి మ్యూజిక్ బలమైన అంశాలుగా మారాయి. ఓం ప్రకాశ్ అందించిన సినిమాటోగ్రఫి సినిమా మూడ్‌ను ఎమోషనల్‌గా మార్చింది. ఒక సీరియస్ కంటెంట్‌ను, సైకలాజికల్ థ్రిల్లర్‌ను తెర మీద చెప్పడానికి వాడుకొన్న లైటింగ్ బాగుంది. ఇక యువన్ శంకర్ రాజా అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సన్నివేశాలను మరింత బలంగా మార్చింది. ఎడిటింగ్, ఆర్ట్ విభాగాలు పర్వాలేదనిపించాయి. నిర్మాత కలైపులి థాను అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. సినిమాను మరింత రిచ్‌గా మార్చాయి.

  ఫైనల్‌గా ఎలా ఉందంటే?

  ఫైనల్‌గా ఎలా ఉందంటే?

  నేనే వస్తున్నా ఎమోషనల్ కంటెంట్‌తో కూడిన సైకలాజికల్ థ్రిల్లర్. ధనుష్ ఫెర్ఫారెన్స్, సెల్వ రాఘవన్ టేకింగ్, సినిమాటోగ్రఫి, మ్యూజిక్ ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్. అయితే కథ, కథనాల పరంగా కొన్ని లోపాలు ఉన్నాయి. కవలపిల్లలైన ప్రభు, కదీర్ ఎందుకు విడిపోయారనే విషయాన్ని మరింత డిటైల్‌గా చెప్పి ఉంటే మరింత కనెక్టివ్‌గా ఉండేది.

  ఫస్టాఫ్‌లో ఉన్న భావోద్వేగాన్ని సెకండాఫ్‌లో కొనసాగించడంలో సెల్వరాఘవన్ తన లైన్ మిస్ అయ్యారనిపిస్తుంది. సెకండాఫ్‌ సడెన్‌గా అర్ధాంతరంగా ముగిసిందనే ఫీలింగ్ కలుగుతుంది. ఇలాంటి లోపాలు ఉన్నప్పటికీ.. ఈ వారం థియేట్రికల్ ఎక్స్‌పీరియెన్స్ పుష్కలంగా అందించే సినిమా నేనే వస్తున్నా. ధనుష్ మిమ్మల్ని నిరాశపరచదు. ఎలాంటి అంచనాలు లేకుండా వెళ్తే కొత్త అనుభూతిని ఈ సినిమా పంచుతుంది.

  English summary
  Versatile Actor Dhanush is came with Naane Varuvean (Nene Vasthunna) on September 29th. Here is the Telugu filmibeat brings exclusive review.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X