For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Nenu Meeku Baaga Kavalsinavaadini review పాత కథ, రొటీన్ కథనం.. కిరణ్ అబ్బవరం ఎలా చేశాడంటే?

  |

  Rating:
  2.0/5
  Star Cast: కిరణ్ అబ్బవరం, సంజనా ఆనంద్, సోను థాకూర్
  Director: శ్రీధర్ గాదే

  నటీనటులు: కిరణ్ అబ్బవరం, సంజనా ఆనంద్, సోను థాకూర్, సిద్దార్థ్ మీనన్, గెటప్ శ్రీను, దేవీ ప్రసాద్, ప్రగతి, సమీర్ తదితరులు
  దర్శకత్వం: శ్రీధర్ గాదే
  కథ: కిరణ్ అబ్బవరం
  నిర్మాతలు: కోడి దివ్య దీప్తి, నరేష్ రెడ్డి మూలే, భరత్ రంగోలి
  మ్యూజిక్: మణిశర్మ
  సినిమాటోగ్రఫి: రాజ్ నల్లి
  ఎడిటింగ్: ప్రవీణ్ పూడి
  బ్యానర్: కోడి దివ్య ఎంటర్‌టైన్‌మెంట్స్
  రిలీజ్ డేట్: 2022-09-16

   నేను మీకు బాగా కావలసిన వాడిని కథ ఏమిటంటే?

  నేను మీకు బాగా కావలసిన వాడిని కథ ఏమిటంటే?


  వివేక్ (కిరణ్ అబ్బవరం) ఓ క్యాబ్ డ్రైవర్. తేజూ (సంజనా ఆనంద్) ఓ సాప్ట్ వేర్ ఎంప్లాయ్. ప్రతి రోజూ రాత్రి ఫుల్లుగా తాగిన ఆమెను ఆరు నెలలుగా ఇంటి దగ్గర డ్రాప్ చేస్తుంటాడు. అలా తాగడానికి కారణం ఏమిటి అని వివేక్ అడిగితే తన కథ చెబుతుంది. తనది ఓ హ్యాపీ ఫ్యామిలీ. ఇంట్లో వాళ్లంతా ఆమెను చాలా ప్రేమగా చూసుకుంటారు. కానీ తనను ప్రేమించిన వాడి కోసం పెద్దలు కుదిర్చిన పెళ్లి వద్దనుకుని వెళ్ళిపోతుంది. కానీ అతను మోసం చేస్తాడు.

   కథలో ట్విస్టులు

  కథలో ట్విస్టులు


  ప్రేమలో వైఫల్యం చెంది కుటుంబానికి దూరమైన తేజూ పరిస్థితి ఏంది? తాగుడుకు బానిసైన తేజూకు ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి. లాయర్ దుర్గ (సోనూ థాకూర్)తో వివేక్ కూడా ప్రేమ కథ ఏమైంది. వివేక్ లవ్ స్టోరీకి ఎలాంటి ముగింపు లభించింది. ఈ ఇద్దరి కథలు ఎలాంటి మలుపు తిరిగాయి? ఒకరి కథలు తెలుసుకుని మరొకరు ఏం చేశారు అనే ప్రశ్నలకు సమాధానమే నేను మీకు బాగా కావాల్సినవాడిని సినిమా కథ.

   ఎలా ఉందంటే..

  ఎలా ఉందంటే..


  ఫస్ట్ హాఫ్ అంతా హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్ తో సరిపోయింది కనుక హీరో పాత్రకు అంతగా ప్రాధాన్యత లేదు. ఇక సెకెండ్ హాఫ్ లో హీరో చెప్పిన ఫ్లాష్ బ్యాక్ లవ్ స్టోరీతో సీన్లకు సీన్లు నింపేసి.. తూచ్ అదంతా ఫేక్ స్టోరీ అని నెక్స్ట్ సీన్ లోనే తెల్చేశారు. దాంతో ఎన్ని మాస్ ఎలివేషన్స్, కామెడీ సీన్స్ జొప్పించినా వృథా ప్రయాసే అయింది. ఇంటర్వెల్‌లో ఒక ట్విస్ట్.. క్లైమాక్స్‌లో మరో ట్విస్ట్ పెట్టుకుని, ఈ మధ్యలో రెండున్నర గంటల సీన్స్ తో నింపేసిన ఫీలింగ్ కలుగుతుంది. ఆ ట్విస్టులు కూడా ప్రేక్షకులకు కొత్తగా అనిపించవు. శశిరేఖా పరిణయం లాంటి సినిమాల్లో చూసిన సన్నివేశాలే మళ్లీ చూసినట్టు కనిపిస్తాయి. దర్శకుడు శ్రీధర్ కొత్తదనంతో సినిమాను అందించడంలో విఫలమయ్యారు.

   కిరణ్ అబ్బవరం గురించి

  కిరణ్ అబ్బవరం గురించి


  పాత, రొటీన్, రెగ్యులర్ కథను కూడా కిరణ్ అబ్బవరం ఒంటిచేత్తో నడిపించాడు. ఈ సినిమా చూసిన తర్వాత మంచి కథ, క్యారెక్టర్ పడితే కిరణ్ అబ్బవరంను ఆపడం కష్టమే అనిపిస్తుంది. కొత్తదనం లేకపోయినా కిరణ్ తన పెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకొంటాడు. డైలాగ్ డెలీవరీ, డ్యాన్సులతో ఎప్పటి మాదిరిగానే ఆకట్టుకొన్నాడు. ఇక హీరోయిన్లు సొనా థాకూర్, ఇతర నటీనటులు తమ పాత్రల పరిధి మేరకు ఒకే అనిపించారు.

   సాంకేతిక అంశాలు

  సాంకేతిక అంశాలు


  సినిమాటోగ్రఫికి వస్తే.. రాజ్ నల్లి కెమెరా వర్క్ బాగుంది. కొత్తగా లేకున్నా మణిశర్మ పాటలు, బ్యాగ్రౌండ్ స్కోర్ కొంత రిలీఫ్. నిర్మాణ విలువలు బాగున్నాయి. కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు కథపై కూడా ఫోకస్ పెడితే బాగుడేది. డైలాగ్స్ మాస్ ప్రేక్షకులకు జోష్ కలిగించేలా ఉంటాయి. కోడి దివ్య అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. కథ ఎంపిక, కథనం విషయంలో టార్గెట్ మిస్ అయ్యారని చెప్పవచ్చు. మొదటి సినిమా అయినా ప్రొఫెషనల్‌గా సినిమాను రూపొందించారు. మంచి కథ, కథనాలు లేకుండా సాహసం చేసిన ఫీలింగ్ కలుగుతుంది.

  ఫైనల్‌గా

  ఫైనల్‌గా


  లవ్, మాస్, ఎమోషన్స్‌ కలబోసిన ఫ్యామిలీ డ్రామా నేను మీకు బాగా కావాల్సినవాడిని. కథ, కథనాల్లో కొత్తదనం లేకపోవడం ఈ సినిమాకు మైనస్. కాకపోతే కిరణ్ అబ్బవరం తన ఫెర్ఫార్మెన్స్‌తో మెప్పించే ప్రయత్నం చేశాడు. హీరోయిన్లు కాస్త బెటర్‌గా ప్రేక్షకులకు పరిచయం ఉన్నవారైతే.. సినిమాకు రీచ్ ఉండేది. కథ, కథనాలపై మరింత దృష్టిపెట్టాల్సింది. కిరణ్ అబ్బవరం ఫ్యాన్స్ ఎంజాయ్ చేసే ఎలిమెంట్స్ ఉంటాయి. వారాంతంలో రెగ్యులర్ ఆడియెన్స్‌ ఓసారి చూడొచ్చు.

  English summary
  Tollywood's young hero Kiran Abbavaram is latest movie is Nenu Meeku Baaga Kavalsinavaadini. This movie is set to release on 16th September. Here is the Nenu Meeku Baaga Kavalsinavaadini review by telugu filmibeat.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X