twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నేనున్నాను- సమీక్ష

    By Staff
    |

    Nenunnanu
    -జలపతి గూడెల్లి
    చిత్రం: నేనున్నాను
    నటీనటులు: నాగార్జున, శ్రియా, ఆర్తి అగర్వాల్‌,
    పశుపతి, ముఖేష్‌ రిషి, తనికెళ్ళ భరణి, రవిబాబు, తదితరులు
    సంగీతం: కీరవాణి
    కథ: భూపతిరాజా
    నిర్మాత: డి.శివప్రసాద్‌ రెడ్డి
    స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వి.ఎన్‌.ఆదిత్య

    అరిగిపోయిన పాత రికార్డులో కొత్త సంగీతం విన్పించే ప్రయత్నంలాంటిది ఈ సినిమా. పాత చింతకాయ పచ్చిడి కథలను వండే భూపతిరాజా తిరిగి అలాంటి కథనే అందిస్తే, దానికి అంతే అర్ధరహితమైన స్క్రీన్‌ ప్లేను దర్శకుడు వి.ఎన్‌. ఆద్యిత, ఘనతవహించిన పరుచూరి బ్రదర్స్‌ సమకూర్చారు. ప్రేమించినవాడు దూరమైతే, చేరదీసిన వాడితో 'రంకు' అంటగట్టడం అనే పనికిమాలిన కథను ఇప్పటికే భూపతిరాజా, ఆయనలాంటి రచయితలు తెలుగులో ఎన్నో సినిమాలు వండి వార్చారు.

    దాన్నే తిరిగి దర్శకుడు వి.ఎన్‌.ఆదిత్య ఇంకా నీచంగా, ఏ మాత్రం సృజనాత్మకత లేకుండా తీశాడీ సినిమాను. 'మనసంతా నువ్వే' వంటి సినిమా తీసిన దర్శకుడే ఈ సినిమా తీశాడంటే నమ్మలేం. సినిమాలో ఎక్కడా కొత్తదనం లేదు. నాగార్జున ఇంత అసంబద్దంగా నటించిన సినిమా కూడా ఇటీవల కాలంలో ఇదేననుకుంటా. ప్రతీ సీన్‌ కూడా 'ఫోర్స్‌'గా ఉంటుంది. సినిమా అంతా సాగతీతే.

    వేణు (నాగార్జున) అనాథగా పెరిగి ఓ పెద్ద కాంట్రాక్టర్‌గా ఎదుగుతాడు. అనూ (శ్రియా) జేపీ (ముఖేష్‌ రుషి) అనే ఓ వ్యాపారవేత్త కుమారుడిని ప్రేమిస్తుంది. పెద్దలు పెళ్ళికి అంగీకరించకపోతే అతనితో కలిసి పారిపోతుండగా, వేణు పొరపాటున అతన్ని పట్టుకొని పోలీసులకు అప్పచెప్పుతాడు. వారు అతన్ని తిరిగి జేపీకి అప్పచెప్పుతారు. తప్పు తెలుసుకున్న వేణు అనూకు, అతనికి పెళ్ళి చేసే బాధ్యతను స్వీకరిస్తాడు.

    ఇక అనూ తండ్రి కూడా ఛీదరించకోవడంతో వేణు ఆమెను చేరదీస్తాడు. మధ్యలో అనూ స్నేహితురాలు శ్రుతి(ఆర్తి అగర్వాల్‌) ప్రేమిస్తుంటుంది. హీరోగారు అనూకు ఆమె ప్రేమికుడితో పెళ్ళి జరిపిస్తాడు. కానీ మూడు ముళ్ళు వేసిన మరుక్షణమే వేణుతో అనూకు 'రంకు' అంటగట్టగానే, వదిలేసి వెళ్ళిపోతాడు. ఇక సినిమా అంతా అనూ వాడి అసలు స్వరూపం తెలుసుకోవడం, వేణును పెళ్ళి చేసుకోవడంపైనే సాగుతుంది.

    దర్శకుడు వి. ఎన్‌.ఆదిత్య ప్రతిభ ఎంత గొప్పది సినిమాలో ప్రతి వారి మోటివ్స్‌, ప్రతి పాత్ర గురించి ఇంట్రడెక్షన్‌ టకటకా పది నిమిషాల్లో చెప్పేశాిడు. సినిమా అంతా పది నిమిషాల్లో చెప్పేశాక, ఇంకా చూసేందుకు ఏముంటుంది. ఏముండదు కదా? అందుకే, మిగతా అంతా సాగతీత. ఒక డ్రామాలా సాగుతుంది. నటీనటులు హీరో నాగార్జునతో సహా డ్రామాల్లో మాదిరిగా నటించారు ఇందులో.ఆర్తి అగర్వాల్‌ పాత్ర శుద్ద దండగ. శ్రియా చూడడానికి బాగున్నా, ఎక్స్‌ప్రెషన్స్‌లలో వైవిధ్యం లేదు. విలన్‌గా నటించిన పశుపతి, తనికెళ్ళ భరణి బాగా చేశారు, కానీ వారి పాత్రలు సినిమాకు ఏ మాత్రం ఉపయోగపడనివి.

    ఈ సినిమా అంతా ఆమె చేసింది నవ్వడమో, ఏడ్వడమో. కీరవాణి స్వరపర్చిన మూడు పాటలు బాగున్నాయి. ఈ సినిమా కోసం చిత్రీకరించిన ఎడ్ల పందాల రేస్‌ మాత్రం ఇందులో చేర్చలేదు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X