twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎవరు సైతం చూడలేరు

    By Staff
    |

    Nenu Saitam
    - జలపతి గూడెల్లి
    చిత్రం: నేను సైతం
    నటీనటులు: మాదాల రవి, మాదాల రంగారావు,
    గుర్లిన్‌ చోప్రా, జయప్రకాష్‌రెడ్డి, తదితరులు
    సంగీతం: రాజ్‌
    నిర్మాత: డాక్టర్‌ మాదాల రవి
    స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ధవళ సత్యం

    ఒకనాటి విప్లవ చిత్రాల కథానాయకుడు మాదాల రంగారావు కుమారుడు డాక్టర్‌ మాదాల రవి హీరోగా నటించిన తొలి చిత్రం పేరు 'నేను సైతం'. కానీ, నిజం చెప్పాలంటే నేను సైతం ( ఇన్ని తెలుగు సినిమాలు చూసి చూసి 'గట్టి'పడిన వాడిని సైతం) ఈ సినిమా చూడలేకపోయాను. ఆరోగ్యరీత్యా, మీరు సైతం చూడొద్దు అని చెప్పగలను. ఏ ఇతర రంగంలోనైనా, ఎక్కడైనా వయసుతో పాటు, అనుభవంతో పాటు కాస్తా బుద్ది పెరుగుతుంది, ప్రతిభ ఎక్కువవుతుంది. కానీ ఒక్క సినిమా రంగంలోనే అందుకు భిన్నంగా జరుగుతుందని అనేక మంది దర్శకులు ఇప్పటికే నిరూపించారు.

    ఒకప్పుడు ఎన్నో హిట్‌ విప్లవ చిత్రాలకు దర్శకత్వం వహించిన ధవళసత్యం 'నేను సైతం' సినిమాను ఎంత దరిద్రం చిత్రీకరించారంటే, ఆయనకు ఫిల్మ్‌మేకింగ్‌లో 'అ, ఆ, ఇ, ఈ'లు కూడా రావని అనుకునేలా. సమాజంలో రాజకీయనాయకులు, తమ అవసరాల కోసం భూములను కబ్జా చేయడం, అమాయక రైతులను ఇక్కట్లకు గురిచేయడం, దాంతో అంతా చూస్తూ ఉన్న ఓ యువకుడు తిరగబడి, వాడిని ఖతం చేయడం.. ఇదీ పాయింట్‌. ఈ కథతో ఎన్ని చిత్రాలు వచ్చినా, కొద్దొగొప్పో ఆ విప్లవచిత్రాల ఫార్మట్‌లోనే కాస్తా బాగానే చెప్పవచ్చు.

    కానీ ఈ సినిమా ఆరంభమే మనల్ని బయటపెడుతుంది. ఇక చివరి వరకు.. హీరో అవమనాలు ఎదుర్కొవడం, రెండు డైలాగ్‌లు చెప్పడం, విప్లవపద్దతిలో పిడికిలి బిగిస్తే చుట్టూ జనం కాగడాలు పట్టుకొని అటూ ఇటూ తిరుగుతుంటారు..బ్యాక్‌గ్రౌండ్‌లో 'మానవ లోకం..' అంటూ పాట వస్తుంటుంది. ఈ తతంగం సినిమా ఆసాంతం కొనసాగుతుంది. హీరోకి తలనొప్పి వచ్చిన 'మానవ లోకం..' అనే విప్లవగీతమే, అభ్యుదయమనే కక్కొచ్చినా అదే.

    ఈ సినిమా కథ గురించి చెప్పడం దండగ. మాదాల రంగారావు తన పాత పద్దతిలోనే నటిస్తూ 'గెస్ట్‌అప్పిరెయన్స్‌' ఇచ్చారు. యువకుడు మాదాల రవి నటన గురించి ఎంత తక్కువగా చెప్పుకుంటే అంత మంచిది. డబ్బు ఉన్నా, సినిమా గురించి ఏ మాత్రం అవగహన లేకపోతే ఇలాంటి సినిమాలు తీయాల్సి వస్తుంది. రాజ్‌ సంగీతం దారుణం. ఆయన సినిమా ఆసాంతం దిష్టిబొమ్మలా నిల్చొనే ఉంటారు. ఎందుకో!

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X