Nethone Nenu Review సోషల్ మెసేజ్‌తో లవ్ స్టోరి.. నీతోనే నేను మూవీ ఎలా ఉందంటే?

నటీనటులు: వికాస్ విశిష్ట, మోక్ష, కుషితా కల్లాపు, ఆకాశ్ శ్రీనివాస్, హారికా పెద్దాడ, నళిని, అనిల్ కుమార్ తదితరులు
దర్శకత్వం: అంజి రామ్
నిర్మాతలు: మామిడి సుధాకర్ రెడ్డి
మ్యూజిక్ డైరెక్టర్: కార్తీక్ కొడకండ్ల
సినిమాటోగ్రాఫర్: మురళీ మోహన్ రెడ్డి
ఎడిటర్: ప్రతాప్ కుమార్
రిలీజ్ డేట్: 2023-10-13

ప్రభుత్వ పాఠశాలలో రామ్ (వికాస్ వశిష్ట) టీచర్. ఇతరులకు సహాయం చేస్తూ అందరితో స్నేహంగా ఉంటాడు. అదే స్కూల్‌లో పీటీ టీచర్‌గా ఆయేషా (కుషితా కల్లాపు) పని చేస్తుంటుంది. రామ్ మంచితనం చూసి అతడిని ప్రేమిస్తుంది. అయితే తన మనసులోని ప్రేమను రామ్ చెప్పే ప్రయత్నంలో ఆమెకు షాకిస్తాడు. తన చిన్ననాటి స్నేహితురాలు సీత (మోక్ష)తో పెళ్లి అయిపోయిందటూ చెప్పగానే ఆయేషా నిరాశ పడుతుంది. అయితే రామ్, సీతను పలకరించడానికి వెళ్తే షాకింగ్ విషయాలు తెలుస్తాయి.

Nethone-Nenu-Movie Review

రామ్ గురించి ఆయేషాకు ఏం తెలిసింది? రామ్ జీవితంలో ఆయేషా చూసిన షాకింగ్ సంఘటన ఏమిటి? సీతకు, ఆయేషాకు ఉన్న రిలేషన్ ఏమిటి? రామ్ గత జీవితం ఏమిటి? రామ్ ఎలాంటి వాడు? పిల్లల కోసం రామ్ ఎలాంటి పనులు చేసేవాడు? అనే ప్రశ్నలకు సమాధానమే నీతోనే నేను (Nethone Nenu)

ప్రభుత్వ పాఠశాలల్లో పరిస్థితులను అంతర్లీనంగా చెబుతూ లవ్ స్టోరితోపాటు ఓ సందేశాన్ని ఇచ్చే సినిమాగా నీతోనే నేను కనిపిస్తుంది . ఇంకా కథ, కథనాలపై ఇంకాస్త కసరత్తు చేయాల్సి ఉందనిపిస్తుంది. ఇంటర్వెల్ ముందు వచ్చే ట్విస్టు బాగుంది. కథను ఎమోషనల్‌గా చెప్పకుండా కమర్షియల్ అంశాలకు జోలికి వెళ్లడం వల్ల ఫీల్ మిస్ అయిందనిపిస్తుంది.

సినిమా బండి, ముఖ చిత్రం మూవీస్‌తో ప్రేక్షకులను ఆకట్టుకొన్న వికాస్ వశిష్ట మరోసారి మంచి ఫెర్పార్మెన్స్‌‌తో మెప్పించే ప్రయత్నం చేశాడు. సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా అందరికి సుపరిచితులైన కుషితా కల్లపు ఆయేషా పాత్రలో ఒదిగిపోయింది. తొలి చిత్రంతో ఆకట్టుకొన్నది. మోక్ష తదితరులు తమ ఫెర్ఫార్మెన్స్‌తో మెప్పించారు.

టెక్నికల్ విభాగాల విషయానికి వస్తే.. మ్యూజిక్, సినిమాటోగ్రఫి అంశాలు సినిమాకు ప్లస్‌గా మారాయి. కార్తీక్ కొడకొండ్ల మ్యూజిక్‌తో, మురళీ మోహన్ రెడ్డి సినిమాటోగ్రఫి ఆకట్టుకొనేలా ఉంది. నిర్మాత మామిడి సుధాకర్ కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించి సినిమా అంటే తనకు ఎంత తపన చెప్పకనే చెప్పారు. ఇంకాస్త బెటర్‌గా వర్క్ చేసి ఉండే డెఫినెట్‌గా ఫీల్‌‌గుడ్ స్టోరి అయ్యేదనిపిస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X