Newton's 3rd Law First Review: న్యూటన్ థర్డ్ లా మూవీ ఫస్ట్ రివ్యూ

టాలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్స్ సుమంత్, జగపతి బాబు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం న్యూటన్ థర్డ్ లా (Newton's 3rd Law). ఈ చిత్రంలో త్రినాథ్ వర్మ, శ్రీనివాస్ అవసరాల, నేహా పఠాన్, రవివర్మ, షెల్లీ ఎన్ కుమార్, బేబీ అభినయన రెడ్డి ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు రాజేష్ కర్ణ దర్శకత్వం వహించారు. మార్క్ మై వర్డ్స్ బ్యానర్‌పై ఈ సినిమాను హరీష్ కోహిర్కార్ నిర్మించారు.ఈ టీవీ విన్ సమర్పించింది. ఏషియన్ సురేష్ ఈ సినిమాను డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు.

ఈ సినిమా సాంకేతిక విభాగాల వివరాల్లోకి వెళితే.. సినిమాటోగ్రఫి: వేదవ్యాస్ గొట్టిపాటి, మ్యూజిక్ డైరెక్టర్: సింజిత్ ఎర్రమిల్లి, ఎడిటర్: అనిల్ పసల, ప్రొడక్షన్ డిజైనర్: శివకుమార్ మచా తదితరులు తమ బాధ్యతలను నిర్వర్తించారు. క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమా జూలై 31వ తేదీన గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్నది. ఈ సినిమాను ఇటీవల సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ (CBFC) రివ్యూ చేసింది. సెన్సార్ బోర్డు ఈ సినిమాకు జారీ చేసిన సర్టిఫికెట్ ఏమిటి? ఈ సినిమా రన్ టైమ్ ఎంత? ఈ చిత్రానికి సంబంధించిన ఫీడ్ బ్యాక్ ఏమిటి? అనే వివరాల్లోకి వెళితే..

Newton s 3rd Law CBFC Review

న్యూటన్ థర్డ్ లా సినిమా కథ విషయానికి వస్తే.. మెర్కురీ (జగపతి బాబు) మోస్ట్ వాంటెడ్ క్రిమినల్. పోలీస్ ఆఫీసర్ వాసుదేవ్ (సుమంత్) ముందుకు అనుమానాస్పద యాక్సిడెంట్ కేసు మిస్టరీగా మారుతుంది. అయితే యాక్సిడెంట్ కాకుండా మర్డర్ అని అనుమానాలు తలెత్తుతాయి. మిస్టరీగా మారిన కేసును వాసుదేవ్ తనదైన శైలిలో దర్యాప్తు చేయడం మొదలుపెడుతాడు. అయితే ఇన్వెస్టిగేషన్‌ను తప్పించుకోవడానికి మెర్కురీ ముఠా ప్లాన్ ఏ, ప్లాన్ బీ, ప్లాన్ సీ అంటూ రకరకాలుగా వ్యూహాలు పన్నుతుంది. ఈ క్యాట్ మౌస్ గేమ్‌లో వినయ్ (త్రినాథ్ వర్మ), పార్వతి (షెల్లీ ఎన్ కుమార్), గంగాధర్ (రవివర్మ), కార్తీక్, మరో పోలీస్ ఆఫీసర్ (అవసరాల శ్రీనివాస్) పాత్రల మధ్య ఎత్తులు పైఎత్తులు ఎలా కొనసాగాయి? అసలు మృతుడిది యాక్సిడెంటా? మర్డరా? మర్డర్ అయితే ఎందుకు హత్య చేశారు? న్యూటన్ థర్డ్ లా మర్డర్ మిస్టరీని ఛేదించడానికి ఎలా ఉపయోగపడింది? అనే ప్రశ్నలకు సమాధానమే న్యూటన్స్ 3rd లా సినిమా కథ.

క్రైమ్, మర్డర్ మిస్టరీ, థ్రిల్లర్, సస్పెన్స్ డ్రామా అంశాలతో రూపొందిన ఈ సినిమాను ఇటీవల సెన్సార్ అధికారులు, ప్రతినిధులు వీక్షించారు. ఈ సినిమాలోని హింసాత్మక సన్నివేశాలు, మితిమీరిన రక్తపాతం, కొన్ని డైలాగ్స్‌పై స్వల్ప అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. అయితే చిత్ర యూనిట్ సెన్సార్ సలహాలను, సూచనలకు సానుకూలంగా స్పందించడంతో ఎలాంటి వివాదం లేకుండా ఈ సినిమా సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తయ్యాయి. దాంతో ఈ సినిమా విడుదలకు సెన్సార్ క్లియరెన్స్ ఇచ్చింది.

సెన్సార్ బోర్డు జారీ చేసిన సర్టిఫికెట్ ప్రకారం.. ఈ సినిమాకు యూఏ (UA16+) సర్టిఫికెట్ జారీ చేశారు. సర్టిఫికెట్ అనుగుణంగా ఈ చిత్రాన్ని 16 ఏళ్లు పైబడిన వారు ఎలాంటి అభ్యంతరం లేకుండా చూడొచ్చు. అంతకంటే తక్కువ వయసు ఉన్నవారు తల్లిదండ్రుల అనుమతితో చూడాల్సి ఉంటుంది. ఈ సినిమాను ఎలాంటి సాగదీయకుండా.. గ్రిప్పింగ్ తెరకెక్కించడం వల్ల దాని నిడివి 2 గంటల 18 నిమిషాలకు పరిమితం చేశారు. అంటే ఈ సినిమా రన్ టైమ్ 138 నిమిషాలు అని సర్టిఫికెట్‌లో పేర్కొన్నారు.

ఇక ఈ సినిమా విషయానికి వస్తే.. సైంటిఫిక్‌గా సాగే క్రైమ్, మర్డర్ ఇన్వెస్టిగేషన్. సుమంత్, జగపతి బాబు, అవసరాల శ్రీనివాస్, త్రినాథ రావు పాత్రలు మధ్య మానసిక సంఘర్షణ హైలెట్‌గా ఉంటుంది. బేబీ అభినయన రెడ్డి చుట్టూ తిరిగే కథ ఆసక్తిగా సాగుతుంది. ఒకవేళ ఈ సినిమా కంటెంట్ ఆడియెన్స్ కనెక్ట్ అయ్యే విధానంపైనే సక్సెస్, ఫెయిల్యూర్ ఆధారపడి ఉంటుందనే టాక్ బయటకు వచ్చింది. ఈ సినిమా గురించిన ఎక్స్‌క్లూజివ్ రివ్యూ కోసం ఫిల్మీబీట్‌ను ఫాలో అవ్వండి.

Read more about: sumanth jagapathi babu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X