NGK తెలుగు మూవీ రివ్యూ అండ్ రేటింగ్.. హీరో సూర్య అలా పప్పులే కాలేశాడేంటి!

Recommended Video

'NGK' Telugu Movie Review | Suriya | Rakul Preet Singh | Sai Pallavi |

Rating:
1.5/5
Star Cast: సూర్య, సాయిపల్లవి, రకుల్ ప్రీత్ సింగ్
Director: సెల్వరాఘవన్

దక్షిణాదిలో విలక్షణ నటుడిగా పేరున్న సూర్య, 7జీ బృందావన కాలనీ, ఆడవారికి అర్ధాలే వేరులే లాంటి చిత్రాలు రూపొందించిన సెల్వరాఘవన్ కాంబినేషన్‌లో NGK సినిమా అనగానే విపరీతమైన బజ్ ఏర్పడింది. రకుల్ ప్రీత్ సింగ్, సాయి పల్లవి హీరోయిన్లు అనగానే మరింత హైప్ ఏర్పడింది. ప్రమోషన్‌లో భాగంగా విడుదల చేసిన టీజర్లు, ట్రైలర్లు భారీ అంచనాలను పెంచాయి. ఇటీవల ఇంటర్వ్యూలో హీరో, హీరోయిన్లు సూర్య, రకుల్ చెప్పిన విషయాలు సినిమాపై ఆసక్తిని పెంచాయి. ఈ క్రమంలో మే 31న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలాంటి ఫలితాన్నిఅందించిందో తెలుసుకోవాలంటే సినిమాను సమీక్షించాల్సిందే.

NGK మూవీ కథ

NGK మూవీ కథ

నంద గోపాల కృష్ణ అలియాస్ NGK ఎంటెక్ చదివి సాఫ్ట్ వేర్ ఉద్యోగి. ఆర్గానిక్ వ్యవసాయంపై మక్కువతో జాబ్‌ను వదిలేసి తన సొంత ఊరు శృంగవరపు కోటకు వస్తాడు. భార్య (సాయిపల్లవి)తో హ్యాపీగా జీవితం సాగిస్తూనే, పోరాటలు చేస్తూ ప్రజలను చైతన్యం చేసే దిశగా అడుగులేస్తుంటాడు. కొన్ని పరిస్థితుల కారణంగా గ్రామ రాజకీయాల్లోకి ప్రవేశిస్తాడు. ఆ క్రమంలో అధికార పొలిటిక్ పార్టీలోని పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్‌ వనిత (రకుల్)తో సన్నిహిత సంబంధాలు పెట్టుకొంటాడు. అలా గ్రామీణ స్థాయి రాజకీయాల నుంచి రాష్ట్ర రాజకీయాల్లోకి అడుగుపెడుతాడు. NGK ఎదుగుదలను చూడలేక అధికార, ప్రతిపక్ష పార్టీలు కక్ష కడుతాయి.

NGK మూవీలో మలుపులు

NGK మూవీలో మలుపులు

అధికార, ప్రతిపక్ష పార్టీల ఎత్తులకు ఏ పై ఎత్తులు వేశాడు. వనిత (రకుల్‌)తో ప్రైవేట్ సంబంధం వివాహిక జీవితంలో ఎలాంటి చిక్కుల తెచ్చిపెట్టాయి. రాజకీయ ప్రయాణంలో భర్త అనుసరిస్తున్న పద్దతులకు భార్య (సాయిపల్లవి) ఎలా స్పందించింది. చివరకు రాష్ట్ర సీఎంగా ఎంపిక కావడానికి ఎలాంటి ప్రతికూల పరిస్థితులను ఎలా సానుకూలంగా మలుచుకొన్నాడు. NGK జీవితంలో చివరకు వనిత, సాయి పల్లవి ఎలాంటి పాత్ర పోషించారు అనే ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా కథ.

ఫస్టాఫ్ రివ్యూ

ఫస్టాఫ్ రివ్యూ

నంద గోపాల కృష్ణ ఉరఫ్ గోపాలం సాఫ్ట్‌వేర్ ఉద్యోగాన్ని ఎందుకు వదిలిపెట్టి వ్యవసాయంలోకి వచ్చారనే అంశాలను ఎమోషనల్‌గా కాకుండా సాదాసీదాగా చెప్పడంతో కథ మొదలవుతుంది. కథనంలో ఎలాంటి భావోద్వేగం లేకుండా గాలివాటుగా నాసిరకం సీన్లతో సాగిపోతుంటుంది. రాజకీయాల్లో ప్రవేశించడం, ఎమ్మెల్యే వద్ద నాసిరకం పనులు చేయడం లాంటి సీన్లు చాలా పేలవంగా కనిపిస్తాయి. సూర్య క్యారెక్టరైజేషన్ వీక్‌గా ఉంటడంతో సినిమాలో లీనం కావడానికి ప్రేక్షకుడికి కఠిన పరీక్షే ఎదురైనట్టు కనిపిస్తుంది. రకుల్, సాయిపల్లవి క్యారెక్టరైజన్స్‌తో అలా నడిచిపోతుంది. స్నేహితుడు మరణించడమనే ఓ ఎమోషనల్ పాయింట్‌తో తొలి భాగానికి తెరపడుతుంది.

 సెకండాఫ్ రివ్యూ

సెకండాఫ్ రివ్యూ

ఇక రెండో భాగంలో మరణించిన స్నేహితుడి ఊసే కనిపించదు. ఇక కథ, కథనాలు ఇష్టం వచ్చినట్టు ఊగిలాటలాడుతాయి. కథ ఏ గ్యమం వైపు వెళ్లుందో క్లారిటీ కనిపించదు. రకుల్‌తో సూర్య రొమాంటిక్ సన్నివేశాలు ఉంటాయేమోనని ఆశించిన ప్రేక్షకులకు ఓ భంగపాటు తప్పదు. వారి మధ్య చిత్రీకరించిన ఓ పాట కూడా పెద్దగా ఆకట్టుకొనేలా ఉండదు. కొంతలో కొంత సాయిపల్లవి ఎమోషనల్ యాక్టింగ్ సినిమాలో చెప్పుకొనే విధంగా ఉంటాయి. క్లైమాక్స్‌లో వచ్చే ఫైట్ కాస్త ఊపు తెస్తుంది. ఆ తర్వాత ఏదో ఉంటుందని భావించిన ప్రేక్షకులను నిరాశ పరిచి డైరెక్ట్‌గా NGKను సీఎంగా చేయడంతో ఆసక్తిక పూర్తిగా ఆవిరైపోతుంది.

 దర్శకుడి ప్రతిభ

దర్శకుడి ప్రతిభ

NGK సినిమా ప్రేక్షకుల అంచనాలకు కనీసం చేరకుండా వైఫల్యం చెందడానికి దర్శకుడు సెల్వరాఘవన్ ప్రధాన కారణమని చెప్పవచ్చు. ఒక్కడే కూర్చొని రాసుకోవడం వల్ల జడ్జిమెంట్ తప్పిందా అనే అనుమానం కలుగుతుంది. ఇక పొలిటికల్ బ్యాక్‌డ్రాప్ అంటే బలమైన సీన్లు, ఎమోషనల్ కంటెంట్‌ను ఉంటాయనే భావించిన వారికి పెద్ద షాకే ఇచ్చాడు. ఏ దశలోనూ ప్రేక్షకుడిని ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నించిన పాపాన పోయినట్టు కనిపించలేదు. ఓవరాల్‌గా సూర్య ఇమేజ్‌కు దూరంగా NGKను తెరకెక్కించాడనే ఫీలింగ్ మాత్రం తప్పకుండా కలుగుతంది.

 సూర్య ఫెర్ఫార్మెన్స్

సూర్య ఫెర్ఫార్మెన్స్

NGKగా సూర్య నుంచి కొత్తగా చూడాల్సిన అంశాలే కనిపించవు. ఎందుకంటే అంత నాసిరకంగా సినిమా కథ ఉండటం ప్రధాన కారణం. బలమైన సన్నివేశాలు లేకపోవడం, పాత్ర ప్రభావవంతంగా లేకపోవడం మరో మైనస్ అని చెప్పవచ్చు. పొలిటికల్‌గా ఇంప్రెసివ్ యాక్టింగ్ లేక.. ఇద్దరు హీరోయిన్లతో గ్లామర్ పండించలేక సూర్య నలిగిపోయడనే ఫీలింగ్ కలుగుతుంది. బేసిగ్గా సూర్య పాత్రలో క్లారిటీ లేకపోవడం వల్ల అసలుకే ఎసరు పెట్టిందని చెప్పవచ్చు.

సాయిపల్లవి యాక్టింగ్ గురించి

సాయిపల్లవి యాక్టింగ్ గురించి

NGK మూవీలో కొంతలో కొంతగా చెప్పుకోవాలంటే సాయిపల్లవి పాత్ర కొంత బెటర్‌గా ఉంటుంది. తొలి భాగంలో గృహిణిగా భర్త ఆశయాలను, ఆకాంక్షలను అర్థం చేసుకొనే పాత్రలో బాగా రాణించారు. ఇక రెండో భాగంలో తాను కాకుండా తన భర్త జీవితంలో మరో మహిళ ఉన్నారనే అంశాన్ని తట్టుకోలేని భార్యగా తన పాత్రను మరో లెవల్‌కు తీసుకెళ్లింది. తనకు లభించిన నాలుగు సీన్లతో తన ప్రతిభను పూర్తిగా రుచిచూపించిందని చెప్పవచ్చు. పాత్రపై ఉండే పరిమితుల కారణంగా సాయిపల్లవి ఫెర్ఫార్మెన్స్‌కు చోటులేకుండా పోయిందనే ఫీలింగ్ కలుగుతుంది.

 రకుల్ ప్రీత్ సింగ్ రోల్ గురించి

రకుల్ ప్రీత్ సింగ్ రోల్ గురించి

కార్పోరెట్ పీఆర్‌గా వనిత పాత్రలో రకుల్ నటించింది. NGK లాంటి యువ రాజకీయ వేత్తను చూసి ట్రాప్‌లో పడే పాత్రలో కనిపించింది. ఈ సినిమాలో పెద్దగా రకుల్ గురించి చెప్పుకోవడానికి పెద్దగా స్కోప్ ఉండదు. ప్రథమార్థంలో కొన్ని సీన్లు, రెండో భాగంలో మరో రెండు, మూడు సీన్లకు పరిమితమైన పాత్ర. చివర్లో నామమాత్రంగా తెరపైన కనిపించింది.

మిగితా పాత్రల్లో

మిగితా పాత్రల్లో

మిగితా పాత్రల్లో దేవరాజ్, నిళగల్ రవి, ఇలవరసు తదితరులు నటించారు. దేవరాజ్ ఎలాంటి ప్రాధాన్యం లేని ముఖ్యమంత్రి పాత్రలో కనిపించారు. ఆయనకు నటించే ఛాన్సే దక్కలేదు. ఇక నిళగల్ రవి హీరో తండ్రిగా నటించాడు. రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్‌గా కనిపించాడు. కథలో పెద్దగా ప్రాధాన్యం ఉండదు. ఇలవరసు తదితర నటులకు స్కోప్ లేకుండా పోయింది.

మ్యూజిక్

మ్యూజిక్

టెక్నికల్ విభాగంలో దారుణంగా విఫలమైన విభాగం మ్యూజిక్. బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తోగానీ, పాటలతో గానీ యువన్ శంకర్ రాజా ఏ కోశాన మెప్పించలేకపోయారు. తెర మీద పాటలకు పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. నేపథ్యం సంగీతం పేలవంగా ఉంది.

 సినిమాటోగ్రఫి గురించి

సినిమాటోగ్రఫి గురించి

ఈ సినిమాకు సంబంధించిన వరకు కొంతలో కొంత సినిమాటోగ్రఫి బాగుంటుంది. కీలక సన్నివేశాలను బాగా తెరకెక్కించాడు శివకుమార్. దక్షిణాదిలో స్టార్ ఎడిటర్‌గా పేరున్న ప్రవీణ్‌ కేఎల్‌ పనితీనం ఎక్కడా కనిపించలేదు. చాలా సీన్లు లెంగ్తీగా, విషయంలేకుండా సాగిపోతుంటాయి.

 ప్రొడక్షన్ వ్యాల్యూస్

ప్రొడక్షన్ వ్యాల్యూస్

టాలీవుడ్‌లో పలు సూపర్ హిట్ చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాత, శ్రీసత్యసాయి ఆర్ట్స్‌ అధినేత కె.కె.రాధామోహన్‌ తెలుగు ప్రేక్షకులకు అందించారు. తమిళంలో ఎస్ఆర్ ప్రభు, ఎస్ఆర్ ప్రకాశ్ బాబు ఈ సినిమాను అందించారు. నిర్మాణ విలువలు ఫర్యాలేదనిపించే స్థాయిలో ఉన్నాయి.

 ఫైనల్‌గా

ఫైనల్‌గా

సాధారణ కుటుంబంలో విద్యాధికుడైన యువకుడు అనుకోని పరిస్థితుల్లో రాజకీయాల్లోకి ప్రవేశించి ముఖ్యమంత్రి పదవిని ఎలా చెప్పట్టాడనే సింగిల్ ఎజెండా పాయింట్‌తో రూపొందిన చిత్రం NGK. కథలో బలం లేకుండా కథనంలో పస లేకుండా వండి వార్చిన వంటకం ఈ సినిమా అని చెప్పవచ్చు. ప్రేక్షకుడిని సునాయసంగా థియేటర్‌కు రప్పించే భారీ తారలకు సరైన పాత్రలను డిజైన్ చేయడంలో ఘోర వైఫల్యం ఈ సినిమాలో కనిపిస్తుంది. సూర్య మీద కక్ష కట్టి సెల్వరాఘవన్ సినిమా తీశాడా అనే సందేహం కూడా కలుగక మానదు. ఏ దశలోనూ ప్రేక్షకుడిని ఒప్పించలేకపోయిన సినిమా NGK అని చెప్పవచ్చు. బీ, సీ సెంటర్ల ప్రేక్షకుల ఆదరణ పొందితే సినిమా కలెక్షన్లపరంగా విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి.

బలం, బలహీనతలు

బలం, బలహీనతలు

ప్లస్ పాయింట్స్
సాయిపల్లవి
సినిమాటోగ్రఫి

మైనస్ పాయింట్స్
కథ, కథనం
నిడివి
ఎడిటింగ్
డైరెక్షన్

తెర ముందు, తెర వెనుక

తెర ముందు, తెర వెనుక

నటీనటులు: సూర్య, సాయి పల్లవి, రకుల్ ప్రీత్ సింగ్, దేవరాజ్, ఇలవరసు, నిళగల్ రవి తదితరులు
దర్శకత్వం: కే సెల్వరాఘవన్
నిర్మాత: కేకే రాధా మోహన్
సంగీతం: యువన్ శంకర్ రాజా
సినిమాటోగ్రఫి: శివకుమార్ విజయన్
ఎడిటింగ్: ప్రవీణ్ కేఎల్
బ్యానర్‌: డ్రీమ్ వారియర్ పిక్చర్స్, సత్యసాయి ఫిలింస్
రిలీజ్ డేట్: 2019-05-31

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X