twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    క్రైమ్ సరే...కామెడీ ఏది?('శంకరాభరణం' రివ్యూ)

    By Srikanya
    |

    Rating:
    2.0/5
    ---సూర్య ప్రకాష్ జోశ్యుల

    రీమేక్ లు ఎంత సేఫో..అంత రిస్క్. ముఖ్యంగా ఒరిజనల్ లో ఉన్నదున్నట్లు తీస్తే..ఇంతోటి దానికి రీమేక్ ఎందుకు..డబ్బింగ్ చేయవచ్చు కదా...అయినా నేటివిటి మిస్సైంది అంటారు...అదే నేటివిటి పేరుతో మార్పులు చేస్తూ మూల కథ మాత్రమే తీసుకుంటే ...ఇంతోటి దానికి కొనటమెందుకు...మంచి సినిమా పాడు చేసారు అంటారు. అయితే ఈ రెండు కామెంట్స్ వచ్చేవి...ఆ రీమేక్ సక్సెస్ కానప్పుడే. సినిమా హిట్టైతే కాపీ అయినా రీమేక్ అయినా ఎవరూ పట్టించుకోరు. అయితే ఈ రోజు విడుదలైన 'శంకరాభరణం' రీమేక్ గా విమర్శలకు లోనయ్యేటట్లు ఉంది.

    చెన్నై వరదలు: కోటి విరాళం ప్రకటించిన ఆ స్టార్ ఎవరో తెలుసా?చెన్నై వరదలు: కోటి విరాళం ప్రకటించిన ఆ స్టార్ ఎవరో తెలుసా?

    వ్యగ్యాత్మక హిందీ కామెడీ చిత్రం 'ఫస్‌ గయారే ఒబామా' సినిమా రైట్స్ తీసుకుని చేసిన ఈ చిత్రం నేటివిటీ పేరుతో, కామెడీ వంకతో అక్కర్లేని,బోర్ కొట్టే సన్నివేశాలు చాలా చొప్పించారు. అయితే ఆ కామెడీకానీ, నేటివిటీ కాని పండక,ఒప్పక ఫలించలేదు. ముఖ్యంగా ఒరిజనల్ లో ఏదైతే హైలెట్ అదే ఈ సినిమాలో దారుణంగా తయారైంది. హీరోయిజం,సెంటిమెంట్, లవ్ ట్రాక్ కలపాలని చేసిన ప్రయత్నాలు వికటించాయి. ఉన్నంతలో కాస్త రిలీఫ్... క్లైమాక్స్ లో పండిన కామెడీనే. అలాగే పృధ్వీ, గిరి, సప్తగిరి పాత్రలు అక్కడక్కడా నవ్వించటం పూర్తిగా కాకపోయినా కాస్త గిట్టుబాటు అనిపిస్తాయి. ట్రైలర్స్ ద్వారా ఎంతో ఎక్సపెక్టేషన్స్ పెంచిన అంజలి పాత్రే సినిమాలో పనికిరాలేదు.

    యుఎస్ లో ఉంటూ నచ్చినట్లు ఎంజాయ్ చేస్తూ బ్రతుకుతున్న మిలియనీర్ గౌతమ్(నిఖిల్). ఓ రోజు అతని తండ్రి(సుమన్) ఊహించని విధంగా పార్టనర్స్ మోసంతో బిజినెస్ లో నిండా ములిగిపోతాడు. 12 కోట్లు అర్జెంటుగా కట్టాల్సిన పరిస్దితి వస్తుంది. డబ్బులేక... ఏం చేయలో అర్దం కాక, ఆత్మహత్య చేసుకోబోతే...సమస్య తెలుసుకున్న కొడుకు గౌతమ్...బీహార్ లో ఉన్న తన తల్లి ఆస్ది శంకరాభరణం అనే బిల్డింగ్ అమ్మి , అప్పులు నుంచి బయిటపడేద్దామని ఇండియా బయిలుదేరతాడు.

    నిత్యం కిడ్నాప్ లతో, అందుకు సంభందించిన గ్యాంగ్ లతో కిటకిటలాడుతున్న బీహార్ లోకి ఓ ఎన్నారై అడుగుపెట్టాడని తెలియగానే వారిలో కదలిక వస్తుంది. గౌతమ్ కిడ్నాప్ చేసి కోట్లు సంపాదించాలని ఎత్తు వేసి,అమలు చేస్తారు. తన ఆస్ది అమ్ముకుని పోదామనకున్న గౌతమ్ ఉన్నట్లుండి కిడ్నాప్ కావటంతో ... ఆ కిడ్నాప్ నుంచి డబ్బు సంపాదించాలనే ఎత్తు వేస్తాడు. అక్కడ నుంచి గౌతమ్ ఏం చేసాడు...శంకరాభరణం బిల్డింగ్ ని అమ్మాడా... తన తండ్రిని సమస్యల నుంచి బయిటపడేసాడా...కిడ్నాపైన అతని పరిస్ధితి ఏమైంది, సినిమాలో అంజలి పాత్ర ఏమిటి అనేది మిగతా కథ.

    సాధారణంగా కోన వెంకట్ సినిమా అంటే కామెడీ సినిమా అని ఎక్సపెక్ట్ చేస్తాం. అందుకు తగినట్లుగానే క్రైమ్ కామెడీ అంటూ భారి ఎత్తున పబ్లిసిటీ చేసారు. అయితే సినిమాలో ఆ స్ధాయిలో కామెడీ లేదు. ఫస్టాఫ్ మొత్తం క్యారక్టర్స్ సెటప్ కే సమయం సరిపోయింది. అంతలా సెటప్ చేసిన పాత్రలు సెకండాఫ్ లో పనికి వచ్చేవా అంటే అదీ లేదు. అసలు వాళ్లు క్లైమాక్స్ దాకా కనపడరు. అంతోటి దానికి అంతమందిని ఎందుకు ఎస్టాబ్లిష్ చేసి స్క్రీన్ టైం ఎందుకు వృధా చేసారో అర్దం కాదు. దాంతో కృష్టవంశీ సినిమాల్లో లాగ ఫ్రేమ్ పెడితే కుప్పలు తెప్పలుగా జనం తప్ప ఇంకేమీ లేదనిపిస్తుంది.

    సెకండాఫ్ లో కథ మొదలవుతుంది. అక్కడ మళ్లీ కొత్త పాత్రలతో డ్రామా.దాంతో ఫస్టాఫ్ కు సెకండాఫ్ కు సంభంధంలేకుండాపోయింది. అంటే పస్ గయారే ఒబామా లో సీన్స్ సెకండాఫ్ కు తెచ్చుకున్నారన్నమాట. ఇక హీరో వేసే ఎత్తులకు ఎక్కడా ప్రతి ఎత్తులు వేసే వాళ్లు ఉండకపోవటంతో ప్యాసివ్ పాత్ర అయ్యిపోయింది. ప్రధాన నెగిటివ్ పాత్ర కూడా ఒకటే ఉంటే బాగుండేది...చాలా మంది కిడ్నాపర్స్ ని చూపటం, విలన్ సంపత్ రాజ్ తో చివరివరకూ ఘర్షణ లేకపోవటం ఇబ్బందిగా మార్చేసింది.

    స్లైడ్ షోలో మిగతా రివ్యూ...

    హైలెట్

    హైలెట్

    సప్తగిరి, శకలక శంకర్, సత్యం రాజేష్ లతో సంజయ్ మిశ్రా చేసిన కామెడీ, పృధ్వీ పంచ్ డైలాగులు, క్లైమాక్స్ సీన్స్

    విలనీ బాగుంది కానీ...

    విలనీ బాగుంది కానీ...


    సంపత్ రాజ్ విలనీ బాగుంది కానీ...ఆ పాత్రకే కథలో సరైన ప్రాధాన్యత ఇవ్వలేదు. ముఖ్యంగా హీరోకు , సంపత్ కు మధ్య జరిగే సన్నివేశాలతో సెకండాఫ్ డిజైన్ చేస్తే బాగుండేది.

    కొత్త దర్శకుడు...

    కొత్త దర్శకుడు...


    ఈ సినిమా ద్వారా ఉదయనందనవనం దర్శకుడుగా పరిచయం అయ్యాడు. అయితే అతని మార్క్ ఏదీ సినిమాలో కనిపించదు. అంతలా అద్బుతంగా చేసినా కోన వెంకట్...దర్శక పర్యవేక్షణ ఉండటంతో అది కలిసివచ్చేది కాదనుకోండి.

    నిఖిల్, నందిత

    నిఖిల్, నందిత

    నందిత ఎంప్పటిలాగే బాగా చేసింది. నిఖిల్...ఎన్నారై కొన్ని సన్నివేశాల్లో మెప్పించాడు...కానీ పెద్దగా అతను కథని లీడ్ చేయలేదనిపించింది.

    ఇవేం డైలాగులు

    ఇవేం డైలాగులు

    సినిమాలో కొన్ని డైలాగులు పేలినా...కోన వెంకట్ వంటి సీనియర్ నుండి ఎక్సపెక్ట్ చేసే డైలాగుల్లా ఉండవు.

    నో లాజిక్స్

    నో లాజిక్స్

    సినిమాలో కీలకమైన రావు రమేష్ పాత్రకు లాజిక్ పెట్టుకుంటే బాగుండేది. అతను తన అక్క ఆస్ధిని అక్రమంగా కబ్జా చేసి మరీ పెద్ద మనిషిలా కబుర్లు చెప్తూంటాడు. హీరో కూడా ఆ విషయమై ఏమీ పట్టించుకున్నట్లు కనపడడు. అలాగే..చదువుకున్న అతను ..చూసుకోకుండా వేలి ముద్ర వేసేయటం కూడా ఆశ్చర్యమనిపిస్తుంది.

    క్రైమ్ సరే...కామెడీ  ఏది?('శంకరాభరణం' రివ్యూ)

    క్రైమ్ సరే...కామెడీ ఏది?('శంకరాభరణం' రివ్యూ)

    నటీనటులు: నిఖిల్‌, నందిత, రావు రమేష్, అంజలి, సుమన్‌, సితార, రావు రమేష్‌, సప్తగిరి, సత్యం రాజేష్, షకలక శంకర్, సుజయ్ మిశ్రా తదితరులు
    కెమెరా: సాయిశ్రీరామ్,
    సంగీతం: ప్రవీణ్ లక్కరాజు,
    రచనాసహకారం: వెంకటేశ్ కిలారు, భవానీ ప్రసాద్,
    డ్యాన్స్ మాస్టర్స్: శేఖర్-శివ,
    ఫైట్ మాస్టర్: విజయ్,
    మేనేజర్స్: నాగు-రవి,
    ఎగ్జిక్యూటివ్ నిర్మాత: రామన్ చౌదరి,
    సహనిర్మాతలు: వి.ఎస్.ఎన్. కుమార్ చీమల, జి. వెంకటేశ్వరావ్,
    కథ-స్క్రీన్‌ప్లే-మాటలు: కోన వెంకట్.
    దర్శకత్వం :ఉదయ్ నందనవనం
    విడుదల తేదీ :04-12-2015

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X