twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సినిమానే తేడా(వీడు తేడా రివ్యూ)

    By Srikanya
    |

    సంస్థ:లక్ష్మీనరసింహా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ‌
    నటీనటులు:నిఖిల్‌, పూజాబోస్‌, బ్రహ్మానందం, కృష్ణభగవాన్‌, అలీ, ఎమ్మెస్‌నారాయణ, రఘుబాబు, మాస్టర్‌ భరత్‌ తదితరులు.
    నిర్మాత:కల్యాణ చక్రవర్తి
    సంగీతం :చక్రి
    దర్శకత్వం:బి.చిన్నికృష్ణ

    రవితేజను కంటిన్యూగా ఇమిటేట్ చేస్తూ తన కెరీర్ ను తనే కూలుదోసుకునే ప్రయత్నాల్లో ఉన్న హీరో నిఖిల్ .అతనికి పెద్ద దర్శకులుసినిమాలు అనుకరించే బి.చిన్ని కృష్ణ దర్శకుడు రూపంలో దొరికాడు.దాంతో ఇద్దరూ కలిసి తెరపై వీరంగం ఆడేసారు.దాంతో రవితేజ వీర రేంజి సినిమాగా వీడు తేడా మారిపోయింది.

    కత్తిశీను (నిఖిల్‌)ఓ పోరంబోకు.తన బావ(కృష్ణ భగవాన్)ఆనందం కోసం ఓ అమ్మాయిని ప్రేమలో పడేసి ప్రయోజకుడు అనిపించుకోవాలని మేఘన(పూజా బోస్)వెనక పడతాడు.ఆమెను శాయిశక్తులా ప్రేమలో పడేయటానకి ప్రయత్నించి సాధించాను అనగా ఓ ట్విస్టు.జైలులో ఉన్న ఆమె తండ్రి దుర్గా(సుమన్)శతృవైన శంకర్(షాయాజీ షిండే)ఆమెని పొందాలని తిరుగతున్నట్లు తెలుస్తుంది.దాంతో శ్రీను ఆమెను ఆ దుర్మార్గుడైన శంకర్ నుంచి రక్షించే భారం తనపై వేసుకుని ఎలా తన ప్రేమను గెలుచుకున్నాడనేది మిగతా కథ.

    ఈ సినిమా కధ గురించి పెద్దగా చెప్పుకునేది ఏమీ లేదు..ఎందుకంటే ఇలాంటి లక్షా తొంభై కథలను ఇప్పటికే తెలుగు ప్రేక్షకులు నమిలి మింగేసారు.అయితే కామిడీగా కథను చెప్పటానకి కమిడెయిన్స్ తో కథనం నడిపించాడు కాబట్టి ఉన్నంతలో అప్పుడప్పుడూ నవ్వులు పండి రిలీఫ్ ఇచ్చాయి.ఇక దూకుడు చిత్రంలో ఎమ్ ఎస్ నారాయణ చేసిన మిమిక్రీ వ్యవహారం ఇందులో మళ్ళీ ఉపయోగించాడు.అయితే ఈ సారి పవన్ కళ్యాణ్ ని,మహేష్ బాబుని ఇమిటేట్ చేస్తూంటాడు.ఇక పాటలు అంటారా సినిమాకి తగ్గట్లే ఉన్నాయి.ఈ సినిమాకి చక్కి మ్యూజిక్ డైరక్టరా అని ఆశ్చర్యపోయేలా మ్యూజిక్ ఇచ్చాడు.

    నిఖిల్ ఎప్పటిలాగే రవితేజలా చేస్తున్నాననుకుని రెచ్చిపోయాడు.హీరోయిన్ కేవలం గ్లామర్ డాల్ గానే ఉండిపోయింది.బ్రహ్మానందం,మాస్టర్ భరత్ ఒక్కో సీన్ కే పరిమితం అయ్యారు.ప్రోమోలకు,పోస్టర్స్ కి ఉపయోగపడతారని వాళ్లని ప్లాన్ చేసి ఉండవచ్చు.విలన్ గా షాయాజీ షిండే కూడా పెద్దగా చేసిందేమీ లేదు.మరీ ఇంత చిన్న హీరోని పెద్దగా భయపెట్టడం ఎందుకు అనుకున్నారో ఏమో కానీ పెద్దగా వర్కవుట్ చెయ్యలేదు.ఇక దర్శకత్వం కూడా పెద్ద దర్సకుల శైలిని అనుకరిస్తూ సాగుతూంటుంది.చిన్న సినిమాని చిన్న సినిమాలాగ ప్రెజెంట్ చేస్తే బాగుండేది.

    ఇక దర్శకుడు ఏకైక లక్ష్యమైన బి,సి సెంటర్లలోని మాస్ ఆడియన్స్ కు చేరువైతే సినిమా ఒడ్డున పడ్డట్టే.ఇక ప్రేక్షకులు ధియోటర్స్ లో ఉన్నంతసేపు అక్కడడక్కడా నవ్వినా..బయిటకొచ్చాక ఎన్నో సార్లు చూసిన కామిడీ కావటంతో బయిటకు వచ్చి మౌత్ టాక్ కి సహకరించేటట్లు లేరు.ఏదైమైనా ఇలాంటి రెగ్యులర్ రొటిన్ కథతో తొలి చిత్రం దర్శకత్వం చేయటానికి వచ్చిన దర్సకుడు ధైర్యానికి మెచ్చుకోవచ్చు.ఇంతకీ ధర్శకుడు ఎవరంటారా..అదే కొత్త బంగారు లోకం సినిమాలో బట్లర్ ఇంగ్లీష్ తో మాట్లాడే వార్డెన్..గుర్తు వచ్చాడా.

    English summary
    Nikhil’s Veedu Theda relesed today with average talk. B Chinni Krishna is directing the film and it’s his debut as a director.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X