Nindha Telugu Movie Review నింద మూవీ రివ్యూ అండ్ రేటింగ్

Rating:
2.5/5

మూవీ: నింద
నటీనటులు: వరుణ్ సందేశ్, అన్నీ, తనికెళ్ల భరణి, భద్రమ్, సూర్య కుమార్, చత్రపతి శేఖర్, మైమ్ మధు, సిద్ధార్థ్ గొల్లపూడి, అరుణ్ దలై, శ్రేయా రాణి రెడ్డి, క్యూ మధు, శ్రీరామ్ సిద్దార్థ కృష్ణ, రాజ్ కుమార్ కుర్ర, దుర్గా అభిషేక్ తదితరులు.
రచయిత, దర్శకుడు, నిర్మాత: రాజేష్ జగన్నాధం
మ్యూజిక్: సంతు ఓంకార్
సినిమాటోగ్రఫి: రమీజ్ నవీత్
ఎడిటింగ్: అనిల్ కుమార్
సాహిత్యం: కిట్టు విస్సాప్రగడ
కాస్ట్యూమ్ డిజైనర్: అర్చన రావు
సౌండ్ డిజైనర్: సింక్ సినిమా
బ్యానర్: ది ఫెర్వెంట్ ఇండీ ప్రొడక్షన్స్
రిలీజ్ డేట్: 2024-06-21

సత్యానంద్ (తనికెళ్ల భరణి) రిటైర్డ్ న్యాయమూర్తి. ఆయన కుమారుడు వివేక్ (వరుణ్ సందేశ్) జాతీయ మానవ హక్కుల కమిషన్‌‌లో పనిచేసే ఉద్యోగి, రచయిత. అయితే తన తండ్రి చివరి తీర్పు వల్ల బాలరాజు (ఛత్రపతి శేఖర్)కు ఉరిశిక్ష పడతుంది. దాంతో ఆయన తన తీర్పు వల్ల నిర్ధోషికి శిక్ష పడిందా? అనే విషయంపై కుమిలిపోతుంటాడు. ఆ విషయాన్ని తన కొడుకు వివేక్‌కు చెప్పడంతో అతడు రంగంలోకి దిగి.. కొందర్ని కిడ్నాప్ చేసి ఓ చోట బంధిస్తాడు.

Nindha Telugu Movie Review and Rating  Varun Sandesh s Crime Drama

బాలరాజు‌కు ఏ కేసులో సత్యానంద్ తీర్పు ఇచ్చాడు? తన జీవితంలో చివరి తీర్పు సత్యానంద్‌ను తీవ్ర వేదనకు గురిచేసింది? తండ్రి పడే వేదనకు పరిష్కారం చూపించాలని వివేక్ ఎలాంటి నిర్ణయం తీసుకొన్నాడు. వివేక్ కిడ్నాప్ చేసిన కొందరు ఎవరు? బాలరాజు కూతురు సుధకు ఈ కేసుకు సంబంధం ఏమిటి? మంజుతో సుధకు వైరం ఏమిటి? తాము ప్రేమించిన యువకుడి ప్రేమను పొందడానికి మంజు, సుధ ఏం చేశారు? చివరకు బాలరాజకు ఉరిశిక్ష తప్పిందా? ఆ కేసులో అసలు హంతకులు ఎవరు? వారికి ఎలాంటి శిక్ష పడింది? అనే ప్రశ్నలకు సమాధానమే నింద సినిమా కథ.

తనికెళ్ల భరణి పాత్ర ద్వారా ఎమోషనల్ కొన్ని విషయాలు చెప్పించడం ద్వారా స్టోరిలో ఏదో ఎమోషనల్ పాయింట్ ఉంటుందనే ఫీల్‌ను దర్శకుడు రాజేష్ జగన్నాథం కలిగించిన తీరు సినిమా కనెక్ట్ అయ్యేలా చేసిందని చెప్పాలి. అయితే వరుణ్ సందేశ్‌ ఎంట్రీ ఇచ్చిన తీరు బాగానే ఉంది. కానీ ఆ ఎపిసోడ్ సాగదీసినట్టు ఉండటంతో ఆ ఎంట్రీపై ఉండే క్యూరియాసిటీ తగ్గిందనిపిస్తుంది. నింద కథ విషయానికి వస్తే.. మంచి భావోద్వేగంతో కూడిన పాయింట్. కానీ అంతే భావోద్వేగంతో కథను చెప్పడంలో కొంత వరకు సక్సెస్ అయ్యాడు కానీ.. మరికొంత తడబాటు కనిపిస్తుంది. క్లైమాక్స్‌ నిడివిని కాస్త తగ్గించి.. ట్విస్టులను పొడిగించకుండా క్రిస్పీగా దర్శకుడు చెప్పి ఉంటే.. మంచి ఫీల్‌తో ప్రేక్షకుడు బయటకు వచ్చే అవకాశం ఉండేదనిపిస్తుంది.

Nindha Telugu Movie Review and Rating  Varun Sandesh s Crime Drama

ఇక వరుణ్ సందేశ్ చాలా రోజు తర్వాత ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. వివేక్ రోల్ చాలా మెచ్యుర్డ్ క్యారెక్టర్. సినిమాకు షో రన్నర్. ఎలాంటి కమర్షియల్ పాయింట్స్ లేని ఓ డిఫరెంట్ క్యారెక్టర్‌లో కనిపించాడు. లవర్ బాయ్‌గా మెప్పించిన వరుణ్.. ఈ సినిమాలో పరిణితితో కూడిన ఫెర్ఫార్మెన్స్ చూపించాడు. డిఫరెంట్ క్యారెక్టర్స్‌కు ఆయన పనికి వస్తాడనే ఫీలింగ్ కల్పించాడు. తనికెళ్ల భరణి పాత్ర చిన్నదైనప్పటికీ.. ఆయన రోల్ చుట్టే కథ నడవడం ఇంపార్టెన్స్ కనిపిస్తుంది. ఛత్రపతి శేఖర్ చాలా రోజుల తర్వాత లెంగ్తీ రోల్ చేసి మెప్పించాడు. మైమ్ మధు ప్రజెన్స్, డైలాగ్ డెలివరీ బాగుంది. భద్రమ్ రోల్ కామెడీ, ఎమోషన్స్ పండించింది. మిగితా పాత్రల్లో నటించిన వారందరూ తమ పాత్రలకు న్యాయం చేశారనే చెప్పొచ్చు.

నింద మూవీకి మ్యూజిక్, డైలాగ్స్, సినిమాటోగ్రఫి పాజిటివ్ అంశాలు. గ్రామీణ వాతావరణాన్ని సినిమాటోగ్రాఫర్ రమీజ్ నవీత్ చక్కగా చూపించారు. మూవీ క్వాలిటీ బాగుంటుడంతో సినిమా రిచ్‌గా తెరపైన కనిపించింది. పాత్రల మధ్య డైలాగ్స్ చాలా ఎమోషనల్‌గా ఉన్నాయి. సంతు ఓంకార్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

Nindha Telugu Movie Review and Rating  Varun Sandesh s Crime Drama

తండ్రి, కొడుకు, తండ్రి, కూతురు మధ్య జరిగే క్రైమ్, కోర్డు డ్రామా. ఓవరాల్‌గా కథ కట్టిపడేసేలా ఉంది. కానీ స్టోరీ నేరేట్ చేయడంలో ఇంకాస్త కసరత్తు చేయాల్సి ఉందనిపిస్తుంది. కొన్ని సార్లు కథను కొన్ని ట్విస్టులతో సూటిగా చెబితే కనెక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ట్విస్టులు, స్క్రీన్ ప్లే కొంత డిఫరెంట్‌గా ప్రజెంట్ చేయడం వల్ల కొంత గందరగోళం అనిపిస్తుంది. ఎమోషన్స్ సాగే సన్నివేశాలకు ప్రేక్షకులు థియేటర్లలో స్పందించే తీరును బట్టి ఈ సినిమా విజయం ఆధారపడి ఉంటుంది. తప్పకుండా డిఫరెంట్ కాన్సెప్ట్. ఓసారి లుక్కేయండి. మీకు నచ్చే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X