నువ్వే ఇబ్బందిపడుతావు..!

By Staff

Ninne Istapaddanu
-జలపతి గూడెల్లి
చిత్రం: నిన్నే ఇష్టపడ్డాను
నటీనటులు: తరుణ్‌, అనిత, శ్రీదేవి,
గిరిబాబు, శరత్‌ బాబు, రాజీవ్‌ కనకాల, సునీల్‌
సంగీతం: ఆర్పీ పట్నాయక్‌
నిర్మాత: కె.ఎల్‌.నారయణ
కథ, దర్శకత్వం: కొండా

విజయవంతమైన చిత్రాలను రూపొందిస్తోన్న దుర్గా ఆర్ట్స్‌ నుంచి వచ్చిన తాజా చిత్రం ఏ వర్గాన్ని ఆకర్షించలేని చిత్రం. ప్రేమకథలో కొత్త పాయింట్‌ తీయాలనుకొని నూతన దర్శకుడు తన అనుభవరాహిత్యంతో పాటు బలహీనమైన స్క్రీన్‌ ప్లే తోడవడంతో సినిమా ఆసాంతం నిస్సారంగా, స్లోగా సా..గుతుంది. ప్రేక్షకులకు బోర్‌ మాత్రమే మిగులుస్తుంది. ప్రేమకథలకు ముఖ్యమైన సంగీతం కూడా ఇందులో అతి సాధారణంగా ఉండడంతో ఈ సినిమా ఏ దశలోనూ ఆకట్టుకోదు. చూడకపోవడమే అతి ఉత్తమం.

తరుణ్‌ వైజాగ్‌ లో చదువుకుంటుండగా, పక్క కాలేజ్‌ లో చదివే అనిత వీళ్ళ గ్యాంగ్‌ ను ఆటపట్టిస్తుంది. ఫూల్స్‌ ను చేస్తుంది. దీంతో హీరో వెళ్ళి ఆమెనూ ఫూల్‌ చేస్తాడు. కానీ ఆమెను ప్రేమిస్తుంటాడు కూడా. తన ప్రేమను తెలియచేస్తాడు. ఆమె కూడా సరేనంటుంది. చదువు పూర్తి కాగానే, అనిత హైదరాబాద్‌ వెళుతుంది. తిరిగి వస్తానని చెప్పి..వెళ్ళినా..ఒక్కసారి కూడా ఫోన్‌ చేయకపోవడంతో హీరో గారు రెండు నెలల తర్వాత హైదరాబాద్‌ వెళ్ళి ఆమెకు వెతకుతుంటాడు. ఈ దశలో యాక్సిడెంటల్‌ గా శ్రీదేవి తారసపడుతుంది. పరిస్థితుల వల్ల తరుణ్‌ వాళ్ళింట్లోనే ఉండాల్సి వస్తుంది.

ఈలోగా తరుణ్‌ అనితను కలిసి తమ ఇంట్లో పెళ్ళికి ఒప్పుకున్నారని చెపుతాడు. తాను తరుణ్‌ ఫూల్‌ చేసేందుకు ప్రేమించాననీ, వేరే అబ్బాయితో తనకి పెళ్ళి కుదరిందని షాక్‌ ఇస్తుంది అనిత. దీంతో అనితకు బుద్దిచెప్పాలని నిర్ణయించకుంటాడు. చివరికి ఎలా పగ తీర్చుకొని అమాయకురాలైన శ్రీదేవిని పెళ్ళి చేసుకుంటాడనేది మిగతా భాగం.

సినిమా ప్రారంభం నుంచి చివరి వరకు..ఏ దశలోనూ సినిమా ఆసక్తి కలిగించదు. అనిత, తరుణ్‌ మధ్య ప్రేమ దృశ్యాలు గానీ, తరుణ్‌ ఎక్స్‌ ట్రా కటింగ్‌ లు గానీ ఏవీ పెద్దగా ఆకట్టుకోవు. ఇక శ్రీదేవి క్యారక్టర్‌ ఆమె ప్రవర్తన..ఎన్నో సినిమాలో ఆ తరహా క్యారెక్టర్‌ లు ఎలా బిహేవ్‌ చేస్తాయో అలానే ఉంది. అతి సాధారణమైన సినిమాలో ఇందులో ఎవరి నటన గురించి గానీ, సాంకేతిక నిపుణుల ప్రతిభ గురించి ప్రత్యేకించి చెప్పుకోవడానికీ ఏమీలేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X