twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నిన్నేప్రేమిస్తా సూపర్‌ గుడ్‌

    By Staff
    |

    Ninne Premista
    చిత్రం: నిన్నేప్రేమిస్తా
    నటీనటులు: నాగార్జున, సౌందర్య, శ్రీకాంత్
    సంగీతం: ఎస్‌.ఎ.రాజ్‌ కుమార్
    నిర్మాత: ఆర్‌.బి.చౌదరి
    దర్శకత్వం:షిండే

    ఈ తరం కొత్తదర్శకులు తెలుగు సినిమాకు నూతనత్వాన్ని తీసుకువస్తున్నారనడానికి నిన్నే ప్రేమిస్తా ఉదాహరణ. ఎంతో కాలం అసిస్టెంట్‌ డైరక్టర్‌ గా పనిచేసిన షిండేకు ఇది తొలి సినిమా ఐనా వినూత్నమైన టేకింగ్‌ స్టైల్‌ తో సినిమాను ఆద్యంతం ఆకట్టుకునేలా రూపొందించాడు. చిత్రం సినిమా మాదిరిగా నిన్నే ప్రేమిస్తా కొత్తతరహాలో రూపొందించిన సినిమా. ఎక్కడా బోర్‌ ఫీలింగ్‌ లేకుండా చిత్రాన్ని తీయడంలో షిండే సఫలీకృతుడయ్యాడు.

    శ్రీకాంత్‌ బ్యాంక్‌ మేనేజర్‌. ఒక సారి బస్‌ లో ప్రయాణిస్తుండగా యాక్సిడెంట్‌ అవుతుంది. కట్‌....మూడు సంవత్సరాల తర్వాత.....

    కోనసీమలోని ఓ గ్రావుంలో బ్యాంక్‌ మేనేజర్‌ గా శ్రీకాంత్‌ వస్తాడు. శ్రీకాంత్‌ పక్కింట్లో అందమైన పల్లెటూరి యువతి మేఘమాల (సౌందర్య) ఉంటుంది. ఆమెను చూడగానే శ్రీకాంత్‌ గుండెల్లో ఏదో తెలియని ఫీలింగ్‌. అతని ఫీలింగ్‌ లకు ఆజ్యంపోస్తూ సౌందర్య కూడా అతనితో సన్నిహితంగా ఉంటుంది. అతనికి అన్నిరకాల సాయం చేస్తుంటుంది. అడగకుండానే వంట చేస్తుంది. కళ్ళకు చలవ అంటూ...రకరకాల వస్తువులు ఇస్తుంటుంది. దాంతో మనవాడు ఒక రోజు ధైర్యంచేసి తనని పెళ్ళి చేసుకుంటానని సౌందర్యకు చెపుతాడు. అందుకు సౌందర్య ఒప్పుకోదు. మరి తనతో ఎందుకు అంత క్లోజ్‌ గా ఉన్నావిన్నాళ్ళు అని అడుగుతాడు. దానికి సౌందర్య ఓ ఫ్లాష్‌ బ్యాక్‌ చెపుతుంది......

    మేజర్‌ నాగార్జున, సౌందర్య ప్రేమించుకుంటారు. కానీ ప్రేమ కన్నా దేశం ముఖ్యమని భావించిన నాగార్జున కార్గిల్‌ యుద్దం సమయంలో సరిహద్దులో పోరాడేందుకు బయలుదేరుతాడు-సౌందర్యను ఇక్కడే వదిలి. నాగార్జున ప్రయాణిస్తున్న కారును బస్‌ ఢీకొనడంతో అక్కడికక్కడే చనిపోతాడు. ఈ ఘటనతో షాక్‌ తిన్న సౌందర్య స్పృహ తప్పుతుంది. ఆసుపత్రిలో కళ్ళు కోల్పోయిన శ్రీకాంత్‌ ను చూస్తుంది. దాంతో నాగార్జున కళ్ళు శ్రీకాంత్‌ కు దానం చేస్తుంది. సో శ్రీకాంత్‌ కళ్ళంటే ఇష్టం అని, శ్రీకాంత్‌ కాదని సౌందర్య చెపుతుంది. చివరికి సౌందర్య, శ్రీకాంత్‌ లు ఇద్దరు ఒకకరి కళ్ళలోకి ఒకరు చూస్తూ కాలం గడుపుతారా?అనేది సస్పెన్స్‌. అదే క్లైమాక్స్‌.

    కొత్త కథ, ఆకట్టుకునే స్క్రీన్‌ ప్లే ఈ చిత్రానికి ప్లస్‌ పాయింట్‌. రాజేంద్రప్రసాద్‌, ఇతర హాస్యనటుల కామెడీతో చిత్రాన్ని ఆకట్టుకునేలా చేయగలిగాడు దర్శకుడు షిండే. పల్లెటూరి అమ్మాయి పాత్రలో సౌందర్య చక్కగా నటించింది. శ్రీకాంత్‌ కు ఇలాంటి పాత్రలు కొత్తేమీ కాదు కాబట్టి నటనలో ఈజ్‌ కనపడింది. నాగార్జునది చిన్న పాత్రైనా సినిమాకు అదే ఆయువుపట్టు. ఈ సినిమాలో ముఖ్యంగా చెప్పుకోవలిసింది ఎస్‌.రాజ్‌ కుమార్‌ మెలోడి సంగీతం. పాటలన్నీ హాయిగొల్పే విధంగా ఉంది. మొత్తమ్మీద సూపర్‌ గుడ్‌ ఫిలింస్‌ కు మరో హిట్‌ చిత్రం.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X