twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నిన్ను కోరి సినిమా రివ్యూ: ప్రేమ, పెళ్లి మధ్య సంఘర్షణ

    సినిమాలకు మూలధనమైన ప్రేమ కథలను మళ్లీ మళ్లీ చూపించినా ఏదో పాయింట్ కనెక్ట్ చేసుకొని ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం సినీ నిర్మాత, దర్శకులకూ ధీమా ఉంటుంది. ఆ క్రమంలో వచ్చిన సినిమానే నిన్ను కోరి.

    By Rajababu
    |

    Rating:
    2.5/5
    Star Cast: నాని, నివేద థామస్, ఆది పినిశెట్టి, మురళీ శర్మ, పృథ్వీ
    Director: శివ నిర్వాణ

    జెంటిల్మన్, నేను లోకల్ లాంటి హిట్స్ నాని, సరైనోడుతో ఆది పినిశెట్టి, జెంటిల్మన్‌తో నివేద థామస్ మంచి జోష్ మీద ఉన్నారు. ఈ ముగ్గురు కలిసి చేసిన తాజా సినిమా 'నిన్ను కోరి'. ప్రేమించి పెళ్లి చేసుకోవడం, పెళ్లి చేసుకొని ప్రేమించుకోవడం అనే రెండు రకాల కాన్సెప్ట్‌లతో ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు శివ నిర్వాణ రూపొందించారు. రాధాకల్యాణం, అభినందన, మౌనరాగం లాంటి సినిమాల ఛాయలు నిన్నుకోరి చిత్రంలో కనిపిస్తాయి. సినిమాలకు మూలధనమైన ప్రేమ కథలను మళ్లీ మళ్లీ చూపించినా ఏదో పాయింట్ కనెక్ట్ చేసుకొని ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం సినీ నిర్మాత, దర్శకులకూ ధీమా ఉంటుంది. ఆ క్రమంలో వచ్చిన సినిమానే నిన్ను కోరి. విభిన్నమైన ప్రాతలను ఎంచుకొని హిట్లు సొంతం చేసుకొంటున్న నేచురల్ స్టార్ నాని నిన్నుకోరి చిత్రంలో భగ్న ప్రేమికుడిగా నటించారు. భారీ అంచనాలతో వచ్చిన నిన్ను కోరి చిత్రం ఏ మేరకు ఆకట్టుకొన్నాయో తెలుసుకోవాలంటే కథ గురించి తెలుసుకోవాల్సిందే.

    నిన్ను కోరి కథ ఇలా..

    నిన్ను కోరి కథ ఇలా..

    ఉమా అలియాస్ ఉమా మహేశ్వర్‌రావు (నాని) వైజాగ్ యూనివర్సిటీ స్టూడెంట్. పల్లవి ఓ కాలేజిలో చదివే స్టూడెంట్. పల్లవికి డ్యాన్స్ నేర్చుకోవాలనే కోరిక ఉంటుంది. స్వతహాగా ఉమ మంచి డ్యాన్సర్ కావడంతో పల్లవి ఆయన వద్ద డ్యాన్సర్‌గా చేరుతుంది. ఉమ, పల్లవి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారుతుంది. ఓ దశలో ఉమ ఏకంగా పల్లవి ఇంటిపై ఉండే పెంట్ హౌస్‌లో అద్దెకు దిగుతాడు. దాంతో పల్లవి తండ్రి, బావ (మురళీ శర్మ, పృథ్వీ)తో పరిచయం పెరుగుతుంది. పల్లవి ఇంట్లో ఓ సభ్యుడిగా మారిపోతాడు. అన్ని సక్రమంగా సాగిపోతుండగానే ఉమ ఢిల్లీ యూనివర్సిటీలో పీహెచ్‌డీ కోసం పల్లవిని వదిలేసి వెళ్తాడు. ఈలోగా పల్లవి పెళ్లి (అరుణ్)తో జరిగిపోతుంది. పల్లవి, అరుణ్ అమెరికాలో సెటిల్ అవుతారు. పీహెచ్‌డీ పూర్తి చేసుకొన్న ఉమ కూడా అమెరికాలోనే ఉద్యోగం చేస్తుంటాడు. ఓ దశలో పల్లవికి దూరమైన బాధతో ఉమ ఉద్యోగం వదిలేసి తాగుడు బానిస అవుతాడు.

    ప్రేమ, పెళ్లి సంఘర్షణ

    ప్రేమ, పెళ్లి సంఘర్షణ

    ఉమ గురించి తెలుసుకొన్న పల్లవి.. అరుణ్‌కు ఒప్పించి తన ఇంట్లోకి తీసుకొస్తుంది. నేను లేకుండా నీవు సుఖంగా బతుకలేవు అని పల్లవితో ఉమ అంటాడు. పెళ్లి తర్వాత మేము చాలా సంతోషంగా ఉంటున్నాం. కావాలంటే నీవు మమ్మల్ని చూస్తే అది నీకే అర్థం అవుతుంది అని చెప్తుంది. కానీ ఉమ అంత తేలిగ్గా నమ్మడు. ఈ పరిస్థితుల్లో అరుణ్ ఒప్పించి ఉమను తన ఇంట్లో పదిరోజులు ఉండేందుకు పల్లవి తీసుకొస్తుంది. ఈ లోగా అరుణ్‌కు మరో మహిళతో సంబంధం ఉందనే విషయం తెలుస్తుంది. మరో మహిళతో అరుణ్‌కు నిజంగానే రిలేషన్ ఉందా? అరుణ్‌కు అలాంటి రిలేషన్ ఉంటే ఏమైంది ? ఆ పది రోజుల్లో అరుణ, పల్లవిల మధ్య ప్రేమను చూసి మనసు మార్చుకొన్నాడా? పల్లవి, ఉమ మధ్య ఉన్న ప్రేమను చూసి అరుణ్ మనసు మార్చుకొన్నాడా? చివరకు పల్లవి, ఉమ ఒక్కటవుతారా? లేక పల్లవి, అరుణ్ భార్యభర్తలుగానే మిగిలిపోతారా? అనే ప్రశ్నలకు సమాధానమే నిన్ను కోరి చిత్రం.

    ఫస్టాఫ్ చకచకా..

    ఫస్టాఫ్ చకచకా..

    నిన్ను కోరి సినిమా పల్లవి, అరుణ్ వివాహ వార్షికోత్సవంతో ప్రారంభమవుతుంది. వారి మధ్య ఉన్న ప్రేమ, అనురాగం, ఆప్యాయతలు చకచకగా సన్నివేశాల రూపంలో సాగిపోతాయి. కానీ తన ప్రేమికుడు నాని కష్టాల్లో ఉన్నాడని తెలుసుకొన్న నివేదా భర్త ఆదికి చెప్పకుండా అక్కడకు వెళ్తుంది. అక్కడే ప్రేక్షకుడికి ట్విస్ట్ ఇస్తాడు దర్శకుడు. అక్కడి నుంచి కథ అమెరికా నుంచి వైజాగ్‌కు చేరుకొంటుంది. తొలిభాగంలో నాని, నివేద ప్రేమ, వారి రొమాన్స్ చక్కగా చిత్రీకరించాడు. ఓ కారణంగా తన కెరీర్‌ కోసం ప్రేమను త్యాగం చేయడానికి సిద్ధపడిన నాని ఢిల్లీకి వెళ్లిపోతాడు. ఆ తర్వాత నివేద, ఆదిల పెళ్లి జరిగిపోవడం లాంటిని మంచి కథనంతో సినిమా పరుగులు పెడుతుంది. ఇంటర్వెల్ ముందు సీన్‌లో నివేదా, ఆది ఇంటికి నాని చేరుకోవడంతో కథ కొత్త మలుపు తిరుగుతుంది.

    సెకండాఫ్ మరీ స్లో..

    సెకండాఫ్ మరీ స్లో..

    రెండో భాగంలో సినిమా ఆసక్తికరంగా ప్రారంభమవుతుంది. నివేదా, ఆది ఎప్పుడు విడిపోతాడా అని నాని ఎదురు చూస్తుంటాడు. తమ ప్రేమను చూసి నాని ఎప్పుడు రియలైజ్ అవుతాడు అని నివేదా ఆది చూస్తుంటాడు. ఇలా మూడు పాత్రల మధ్య సంఘర్షణతో సినిమా సాగుతుంటుంది. కానీ రొటీన్ కథకు ఎలాంటి నావెల్ ట్రీట్‌మెంట్ లేకపోవడంతో సినిమా నత్త నడకన సాగినట్టు అనిపిస్తుంది. సినిమాను క్లైమాక్స్ వరకు లాగడానికి అమెరికాలో బ్రేకప్ వ్యవహారాలకు సంబంధించిన రెండు ఏపిసోడ్స్‌తో కాలక్షేపం జరుగుతుంది. కానీ కథలో ఇంట్రెస్టింగ్ పాయింట్ లేకపోవడంతో చాలా రొటీన్ వ్యవహారంగా సాగిపోతుంటుంది. ఓ దశలో ఇదే గొడవరా బాబు అనే ఫీలింగ్ కలుగుతుంది. చివరకు రొటీన్ ముగింపుతో నిన్ను కోరి ముగియడంతో ప్రేక్షకుడు ఊపిరి పీల్చుకోవడం జరుగుతుంది. చాలా రొటీన్ కథకు నాని, నివేదా, ఆది, మురళీశర్మ లాంటి టాలెంటెడ్ నటులతో సినిమా నిలబడిందనే ఫీలింగ్ కలుగుతుంది.

    బరువైన కథతో దర్శకుడి తడబాటు

    బరువైన కథతో దర్శకుడి తడబాటు

    ప్రేమించి పెళ్లి చేసుకోవడం కంటే పెళ్లి చేసుకొని ప్రేమించాలి అనే సింగిల్ పాయింట్ కథకు తనదైన శైలిలో దర్శకుడు శివ నిర్వాణ సీన్లను అల్లుకొన్నాడు. కానీ రొటీన్ పాయింట్‌ను కొత్తగా చూపించడంలో కాస్త తడబడ్డాడు. బలమైన డైలాగ్స్‌తో అక్కడక్కడ మంచి ఫీలింగ్‌ను కలిగించాడు. నాని, ఆది, నివేదా లాంటి ఆర్టిస్లుల ఫెర్మార్మెన్స్‌తో తనలోని లోపాలను దర్శకుడు కప్పిపుచ్చుకొన్నాడు. తొలి సినిమాకే మంచి బడ్జెట్, అమెరికా లాంటి కాస్ట్‌లీ లొకేషన్స్, మంచి కెమెరామెన్ ఇవన్ని దర్శకుడికి కలిసి వచ్చే అంశాలు. కానీ నాని గత సినిమాలు ప్రేక్షకుడిని మెప్పించిన విధంగా నిన్ను కోరి లేకపోవడం కొంచెం డిజాపాయింట్‌మెంట్.

    నానీ మళ్లీ అదుర్స్

    నానీ మళ్లీ అదుర్స్

    నాని మరోసారి తన నటన ప్రతిభతో సినిమా మొత్తాన్ని తన భుజంపై మోశాడు. ఎలాంటి పాత్రనైనా అవలీలగా తనకు అనుకూలంగా మలుచుకొనే టాలెంట్ ఉండటంతో భగ్న ప్రేమికుడిగా ఆకట్టుకొంటాడు. తన మార్కు కామెడీ, పంచ్‌లు, ఎమోషన్ సీన్లను అద్భుతంగా పండించాడు. కథలో కొత్తదనంలో లేకపోవడంతో కొన్ని సార్లు ఆయన వేగానికి అడ్డుకట్ట వేసినట్టు కనిపిస్తాయి. ఉమా కార్యెక్టర్‌కు నాని వంద శాతం న్యాయం చేకూర్చాడు. ప్రేమికుడిగా, భగ్న ప్రేమికుడిగా, తన ఇష్టపడిన వ్యక్తి ప్రేమను పొందాలనుకొనే యువకుడిగా పలు కోణాల్లో నటనను అద్భుతంగా పండించాడు. క్లైమాక్స్‌లో నాని నటన కంటతడి పెట్టించేలా ఉంటుంది.

    సరికొత్తగా ఆది పినిశెట్టి

    సరికొత్తగా ఆది పినిశెట్టి

    ఇటీవల కాలంలో విలన్‌గా, హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా పలు రకాల పాత్రలతో దూసుకుపోతున్నాడు ఆది పినిశెట్టి. నిన్ను కోరి చిత్రం ద్వారా ఆది ఓ సాఫ్ట్ క్యారెక్టర్‌లో పరిచయం అయ్యాడు. భావోద్వేగాల మధ్య నలిగే పాత్రను చాలా సులభంగా తనకు తగినట్టుగా మలిచుకొన్నాడు. బాధ్యతాయుతమైన భర్తగా సరికొత్తగా కనిపించాడు. ఆది స్లయిలిష్ లుక్స్‌తో ఆలరించాడు. కెరీర్‌లో ఆదికి మంచి పాత్ర దక్కింది.

    అందంతో కాకుండా మళ్లీ అభినయంతోనే..

    అందంతో కాకుండా మళ్లీ అభినయంతోనే..

    నివేదా థామస్ మరోసారి నటనకు స్కోప్ ఉన్న పాత్రలో మెరిసింది. ఆమె అందంతో కంటే అభినయంతో ఆకట్టుకొన్నది. కొత్తగా సినీ పరిశ్రమలోకి ప్రవేశించిన నివేదా బరువైన పాత్రలను తనదైన శైలిలో మెప్పిస్తున్నది. పల్లవి పాత్రలో కనిపించిన నివేదా మంచి మార్కులే కొట్టేసింది.

    కామెడీ సో.. సో..

    కామెడీ సో.. సో..

    మురళీ శర్మ, పృథ్వీ తన పాత్రల పరిధి మేరకు మంచి ఫెర్మార్మెన్స్‌ను కనబరిచాడు. పృథ్వీ పాత్ర పెద్దగా కామెడిని పండించలేకపోయింది. మురళీ శర్మ పాత్రను మరింత తీర్చిదిద్దాల్సిన అవసరం కనిపించింది. పృథ్వీని కామెడీ కోసం వాడుకొన్నాడా లేక క్యారెక్టర్ ఆర్టిస్టుగా వాడుకొన్నాడా అనే అనుమానం కలుగుతుంది. ప్రొఫెసర్ మూర్తిగా తనికెళ్ల భరణిది చాలా రొటీన్ పాత్రే.

    కోన డైలాగ్స్ సూపర్..

    కోన డైలాగ్స్ సూపర్..

    రోటీన్ కథ, స్క్రీన్ ప్లే‌కు కోన వెంకట్ అందించిన డైలాగ్స్ అదనపు ఆకర్షణగా నిలిచాయి. గెలుపు మొదలవ్వడంతో కాదు.. ముగిసిన తర్వాత గెలుపు ఎవ్వరిదో తెలుస్తుంది. ఒక్కరితో ప్రేమ విఫలమైతే జీవితం ఆగిపోయినట్టు కాదు. లైఫ్ ముగిసిపోయినట్టు కాదు లాంటి డైలాగ్స్ ఆకట్టుకొన్నాయి. అలాగే నాని విసిరే పంచ్ డైలాగ్స్ కొన్ని బాగున్నాయి. చాలా రోజుల తర్వాత కోన మళ్లీ మాటలతో మ్యాజిక్ చేశారు.

    చక్కగా కార్తీక్ సినిమాటోగ్రఫీ

    చక్కగా కార్తీక్ సినిమాటోగ్రఫీ

    కార్తీక్ ఘట్టమనేని అందించిన సినిమాటోగ్రఫి సినిమాకు మరో సానుకూల అంశం. ఫారిన్ లోకేషన్స్‌తోపాటు వైజాగ్ అందాలను చక్కగా తెరకెక్కించాడు. గోపిసుందర్ సంగీతం సన్నివేశాలకు అనుగుణంగా బాగుంది. వన్సాపాన్ ఏ టైమ్‌లో పాట క్యాచీగా ఉంది. బదులు చెప్పవేయ్, అడిగా అడిగా పాటలు ఫర్వాలేదనిపించాయి. థియేటర్ బయటకు వచ్చిన తర్వాత కూడా పాటలు హాంటింగ్‌గా లేకపోవడం కొంత నిరాశ కలిగించే అంశం.

    ఇలాంటి కథలు లెక్కలేనన్నీ..

    ఇలాంటి కథలు లెక్కలేనన్నీ..

    ప్రేమించిన వ్యక్తిని వదిలేసి మరో వ్యక్తిని పెళ్లి చేసుకోవడం. ఆ తర్వాత ప్రేమించిన వ్యక్తి కోసం ఆరాటపడటం అనే లైన్‌తో వెండితెర మీద లెక్కలేనన్ని సినిమాలు వచ్చాయి. మళ్లీ మళ్లీ కనిపించినా ప్రతీ సారి కొత్తగా ట్రీట్‌మెంట్ ఇవ్వడంతో అవి సక్సెస్ సాధించాయి. అదే పంథాలో ప్రేమ, పెళ్లి మధ్య సంఘర్షణగ వచ్చిన సినిమాలో విభిన్నమైన పాయింట్ ఏదీ కనిపించలేదు. మల్టీప్లెక్స్ ప్రేక్షకులను పక్కన పడితే బీ, సీ సెంటర్ల ఆడియెన్స్‌ ఆదరిస్తే నాని కెరీర్‌లో మరో సక్సెస్‌గా నిన్ను కోరి నిలుస్తుంది.

    బలం, బలహీనతలు

    బలం, బలహీనతలు

    నాని, నివేదా థామస్, ఆది పినిశెట్టి పెర్ఫార్మెన్స్
    కెమెరా, మ్యూజిక్
    నిర్మాణ విలువలు
    డైలాగ్స్

    బలహీనతలు
    రొటీన్ స్టోరి
    స్క్రీన్ ప్లే

    తెర ముందు.. తెర వెనుక

    తెర ముందు.. తెర వెనుక

    నటీనటులు: నాని, నివేదా థామస్, ఆది పినిశెట్టి, మురళీ శర్మ, పృథ్వీ, తనికెళ్ల భరణి
    కథ, దర్శకత్వం: శివ నిర్వాణ
    స్క్రీన్ ప్లే, మాటలు: కోన వెంకట్
    నిర్మాత: డీవీవీ దానయ్య
    సంగీతం: గోపి సుందర్
    సినిమాటోగ్రఫీ: కార్తీక్ ఘట్టమనేని
    ఎడిటింగ్: ప్రవీణ్ పూడి
    నిర్మాణం: డీవీ ఎంటర్‌టైన్‌మెంట్, కోన కార్పోరేషన్
    రిలీజ్ డేట్: 2017 జూలై 7

    English summary
    Nani is hoping to continue his dream run at the box office with Ninnu Kori that is releasing on July 7th. Directed by debutant Shiva Nirvana, the film features Nani, Aadhi Pinisetty and Nivetha Thomas as the leads. Ninnu Kori has been making buzz on the social media with its emotionally charged promos and soulful songs.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X