Don't Miss!
- News ఈ ఒక్కటి ఇంట్లో ఉంటే డబ్బు ఆటోమేటిక్ గా వస్తుంది
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్‌తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్‌నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్‌బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
నిన్ను తలచి మూవీ రివ్యూ అండ్ రేటింగ్
Rating: 2/5
విభిన్నమైన కథాంశంతో రూపొందిన చిన్న సినిమాలు భారీ విజయాలను సొంతం చేసుకొంటున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వచ్చిన చిత్రం నిన్ను తలచి. నూతన హీరో వంశీ యాకసిరి, స్టెపీ పటేల్ హీరోహీరోయిన్లుగా నటించగా, దర్శకుడు అనిల్ తోట తెరకెక్కించారు. ఎస్.ఎల్.ఎం ప్రొడక్షన్స్, నేదురుమల్లి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. యూత్ ఫుల్ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ చిత్రం ఎలాంటి ఫలితాన్ని అందుకొన్నదనే విషయాన్ని తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.
కథ:
అభిరామ్ (వంశీ యాకసిరి) ఎలాంటి బాధ్యతలు తెలియని మధ్య తరగతి యువకుడు. అంకిత (స్టెపీ పటేల్) అనే అమ్మాయిని ఫస్ట్‌లుక్‌తోనే ప్రేమలో పడిపోడిపోతాడు. ఆమె ప్రేమను దక్కించుకోవడానికి అభి ఏం చేశాడు? మరి అంకిత అభితో ప్రేమలో పండిందా? అంకిత అభి ప్రేమను అంకిత నిరాకరించడానికి కారణాలు ఏమిటి? చివరకు అభికి ప్రేమ సఫలమయ్యాడా? అనే ప్రశ్నలకు సమాధానమే నిన్ను తలిచి సినిమా కథ.
విశ్లేషణ:
వంశీ తొలి చిత్ర నటుడనే ఫీలింగ్ కలుగదు. యాక్టింగ్, డ్యాన్సుల్లో మంచి ఈజ్ కనిపించింది. నటనలో కొన్ని అంశాల పట్ల ఇంకా పరిణతి సాధించాల్సి ఉంది. స్టెఫీ పటేల్ గ్లామర్‌పరంగా ఆకట్టుకొన్నది. నటనపరంగా ఒకే అనిపించింది. హీరో స్నేహితుడిగా నటించిన ఆర్టిస్టు ఆకట్టుకొన్నాడు. మిగితా నటీనటులు తమ పాత్రలకు న్యాయం చేశారు.
సాంకేతికంగా
దర్శకుడి అనిల్ తోట తన మార్కు రిజిస్టర్ చేసుకొనే ప్రయత్నం చేశారు. యూత్‌ను ఆకట్టుకొనే అంశాలతో ప్రేమ కథను సాఫీగా నడిపించడంలో సక్సెస్ అయ్యాడు. లవ్ స్టోరీలో ఫీల్ గుడ్ అంశాలు ఉన్నాయి. కథ, కథనాలు బాగా రాసుకొన్నాడు. టెక్నికల్‌గా సత్య సినిమాటోగ్రఫీ బాగుంది. మూవీ ఓపెనింగ్ షాట్స్, సినిమా రెండో భాగంలో కీలక సన్నివేశాలను చక్కగా తెరకెక్కించాడు. సంగీత దర్శకుడు మహావీర మ్యూజిక్ బాగుంది. సాయి ఎడిటింగ్ క్రిస్పీగా ఉంది. నిర్మాతలు నేదురుమల్లి అజిత్ కుమార్ , మోదిగిరి ఓబులేష్ ఉన్నత విలువను పాటించి సినిమాను రిచ్‌గా తెరకెక్కించారని చెప్పవచ్చు.