నిన్ను చూడాలని లేదు

By Staff

Ninnuchoodalani
- జలపతి గూడెల్లి
చిత్రం: నిన్ను చూడాలని
నటీనటులు: ఎన్టీఆర్‌, రవీనా రాజ్‌ పుత్‌, కె.విశ్వనాథ్‌, సత్యనారయణ
సంగీతం: ఎస్‌.ఎ.రాజ్‌ కుమార్‌
నిర్మాత: రామోజీరావు
దర్శకత్వం: వి.ఆర్‌.ప్రతాప్‌

వన్‌ ఫిల్మ్‌ వండర్‌ దర్శకుల జాబితాలకు వి.ఆర్‌.ప్రతాప్‌ కూడా చేరాడు. నువ్వువస్తావని వంటి హిట్‌ చిత్రం అందించిన ఈ దర్శకుడు రెండో చిత్రం-నిన్నుచూడాలని-తో తన అసలు 'ప్రతిభ' నిరూపించుకున్నాడు. కథలో కొత్తదనం లేకున్నా కథనం వినూత్నంగా ఉండి సినిమాలను ఆసక్తికరంగా మలుస్తున్న ఈ రోజుల్లో ఆ రెండూ అతిసాధారణంగా ఉండేలా తీయగలిగడం విశేషం. నందమూరి తారకరామరావును 'లాంఛ్‌' చేసేందుకు సినిమాను తీసినట్లుగా ఉంది తప్ప చిత్రంలో ఎక్కడా పట్టులేదు. టీనేజ్‌ లవ్‌ స్టోరీ అంటూ తీసిన ఈ చిత్రంలో ప్రేమలో ఎక్కడా ఇంటెన్సిటీ లేదు. టీనేజ్‌ లో ఉన్నంతగా ఇంటెన్సెటీ మరెప్పుడూ ఉండదు ప్రేమలో. అది లేకుండా టీనేజ్‌ ప్రేమకథ అంటూ తీస్తే దర్శకుడి 'ప్రతిభ' ఏమిటో తెలిసిపోతుంది.

ప్రేమకు కారణం ఉండకపోవచ్చు. కానీ మనుషుల చర్యలకు కారణం ఉండదా? ఉండదనే ఈ సినిమాలో కథారచయిత వర్మ, దర్శకుడు ప్రతాప్‌ చెప్పుతారు. అందుకే ఎన్టీఆర్‌ చూడగానే రవీనాను ప్రేమిస్తాడు. విశ్వనాథ్‌ మనవడు ఎన్టీఆర్‌. విశ్వనాథ్‌ పుల్లారెడ్డి టైప్‌ లో పెద్ద స్వీట్స్‌ షాప్‌ యాజమాని. మరో పుల్లారెడ్డి టైప్‌ యాజమాని సత్యనారయణ. ఆయన మనవరాలు రవీనా. విశ్వనాథ్‌, సత్యనారయణ ఇద్దరు మంచి ఫ్రెండ్స్‌. కానీ ఇద్దరికి ఒకరంటే ఒకరికి పడదట. దానికి కారణమేంటో ఎవరికీ తెలియదు.

రవీనా అంటే వాళ్ళ నాన్నకు కూడా ఇష్టం ఉండదు(దీనికి కారణం ఉండదు). రవీనా ప్రేమరాహిత్యంతో బాధపడుతుంటుంది. ఎన్టీఆర్‌ ఆప్యాయత(?), కన్సర్న్‌ చూసి తను కూడా ప్రేమిస్తుంది. చివరికి వీరి పెళ్ళికి రవీనా తండ్రి అడ్డుచెప్పుతాడు. విలన్‌ తండ్రి నుంచి ఎలా బయటపడుతారు అనేది క్లైమాక్స్‌.

ఎన్టీఆర్‌ శరీరాకృతి ప్రేమకథలకు అసలు సూటవదు. నటన కూడా అంతంతమాత్రమే. హీరోయిన్‌ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. సరిగా ఎక్స్‌ ప్రెషన్స్‌ కూడా ఇవ్వడం రాలేదు ఈ అమ్మాయికి. అందగత్తె కూడా కాదు. నిన్నే తలుచుకుంటా అన్న ఒకే ఒక పాట బాగుంది. ఎస్‌.ఎ.రాజ్‌ కుమార్‌ తమిళ సినిమాలకు పనిచేసుకోవడమే బెటర్‌.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X