నిన్నుచూశాక-నిరాశపర్చే చిత్రం

చెవిటితనం ఉన్న ఫ్రెండ్ ఉండడం వల్ల మీరు ఎప్పుడైనా నష్టపోయారా? లేదా! అయితే మీరు అదృష్టవంతులు. మాధవన్ లాంటి కొంతమంది అలాంటి ఫ్రెండ్ వల్ల ఏకంగా ప్రియురాలును కోల్పోయే ప్రమాదం వచ్చింది. చెవిటితనం ఉన్న ఫ్రెండ్ రాయబారం వల్ల కలిగే నష్టాల గురంచి వివరించే చిత్రం-నిన్ను చూశాక అని చెప్పొచ్చు. మాధవన్ ఆర్కెస్ట్రా నిర్వహిస్తుంటాడు. ఈ ట్రూప్ లో మరో ఇద్దరు స్నేహితులు పనిచేస్తుంటారు. ఒకతనికి అంధత్వం, మరో వాడికి చెవిటితనం. వీరంతా కలిసి మణివణ్ణన్ ఇంట్లో అద్దెకి ఉంటారు. మణివణ్ణన్ కూతురు స్నేహను చూడగానే మాధవన్ కు ప్రేమ కలుగుతుంది. కానీ స్నేహకు ఆల్రెడీ పెళ్ళి అవుతుంది. భర్త నుంచి విడాకులు తీసుకుంటుంది.
ఈ విషయం తెలిసినా ఆమెను ప్రేమిస్తాడు మన హీరో. ఆమెకు తన ప్రేమను వ్యక్తం చేస్తాడు. మొదట మాధవన్ ప్రపోజల్ ను స్నేహ తిరస్కరిస్తుంది. ఆ తర్వాత చాలా సేపు ఆలోచించిన స్నేహ మాధవన్ ప్రేమను అంగీకరిస్తున్నట్లు చెవిటి స్నేహితుడికి చెపుతుంది. ఈ చెవిటిమేళం మాధవన్ కు వేరే విధంగా చెప్పి ప్రేమ చెడగొడుతాడు. వీరి విషయం తెలిసిన మణివణ్ణన్ ఈ గ్యాంగ్ ను ఇంట్లోంచి వెళ్ళగొడుతాడు. వేరే అబ్బాయితో స్నేహ పెళ్ళి చేసేందుకు సిద్ధపడుతాడు. కొంత మెలోడ్రామా తర్వాత క్లైమాక్స్ లో మాధవన్ తోనే స్నేహ కలవడంతో సినిమా ముగుస్తుంది.
ప్రథమార్థం హాస్యభరితంగా రూపొందించిన నూతన దర్శకుడు సురేష్ సెకెండ్ హాఫ్ ను కలగాపులగంగా మార్చేశాడు. ద్వితీయార్ధంలో అనవసరమైన ట్విస్ట్ లతో బోర్ కలిగేలా రూపొందించాడు. మాధవన్ నటన బావుంది. తమిళ నటి స్నేహనటనలోనూ ఈజ్ ఉంది. మణివణ్ణన్ నటనే ఈ సినిమాలో హైలెట్. ఫర్వాలేదనిపించే సంగీతం.


Click it and Unblock the Notifications











