For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  భీష్మ మూవీ రివ్యూ అండ్ రేటింగ్

  |

  Rating:
  3.0/5
  Star Cast: నితిన్, రష్మిక మందన్న, అనంత్ నాగ్, సంపత్ రాజ్, జిషు సేన్ గుప్తా
  Director: వెంకీ కుడుముల

  ఛలో చిత్రంతో సక్సెస్‌ను సొంతం చేసుకొన్న దర్శకుడు వెంకీ కుడుములతో సరైన విజయం కోసం ఎదురుచూస్తున్న నితిన్ కలిసి చేసిన ప్రాజెక్ట్ భీష్మ. వీరికి తోడుగా వరుస విజయాలతో దూసుకెళ్తున్న లక్కీ ఛార్మ్ రష్మిక మందన్న జతకలిసింది. ఇలాంటి రేర్ కాంబినేషన్‌తో భీష్మ చిత్రం ఫిబ్రవరి 21న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆర్గానిక్ ఫార్మింగ్ కథా నేపథ్యంగా వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.

  భీష్మ కథ

  భీష్మ కథ

  భీష్మ (నితిన్) ఎలాంటి లక్ష్యం లేకుండా జీవితంలో ఒక్క అమ్మాయి ప్రేమలోనైనా పడాలనే కోరికతో పలు రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. చైత్ర (రష్మిక మందన్న) భీష్మ ఆర్గానిక్ కంపెనీలో పనిచేస్తుంటుంది. ఓ సందర్భంలో చైత్రతో భీష్మ పరిచయం ప్రేమగా మారుతుంది. ఇదిలా ఉండగా భీష్మ ఆర్గానిక్ కంపెనీ, ఫీల్డ్ సైన్స్ రెండు కంపెనీల మధ్య పోటీ వైరం ఉంటుంది. భీష్మ కంపెనీని తొక్కేయాలని ఫీల్డ్ కంపెనీ అధినేత (జిషు సేన్ గుప్తా) కుట్ర పన్నుతుంటాడు. ఆ క్రమంలో భీష్మ కంపెనీ అధినేత భీష్మ (అనంత నాగ్) తనకు వయసు పైబడటంతో తన వారసుడి కోసం ప్రయత్నాలు ప్రారంభిస్తాడు. ఈ క్రమంలో కనీసం డిగ్రీ పాస్ కానీ భీష్మ (నితిన్‌)‌ను కంపెనీ సీఈవోగా నియమిస్తాడు. 30 రోజుల్లో ప్రతిభను నిరూపించుకోవాలని సూచిస్తాడు.

  భీష్మ సినిమాలో ట్విస్టులు

  భీష్మ సినిమాలో ట్విస్టులు

  ఎలాంటి అర్హతలు లేని భీష్మ (నితిన్)ను సీఈవోగా నియమించడానికి కారణాలు ఏమిటి? 30 రోజుల్లో భీష్మ కంపెనీపై ఫీల్డ్ సైన్స్ కంపెనీ చేసే కుట్రల నుంచి ఎలా కాపాడాడు? తొలి చూపులోనే ప్రేమించిన చైత్ర ప్రేమను ఎలా పొందాడు? భీష్మ అంటేనే ఓ రకమైన అయిష్టాన్ని చైత్ర ఎందుకు పెంచుకొన్నది. చివరకు చైత్ర ప్రేమను ఎలా పొందాడు?, భీష్మ కంపెనీని ప్రత్యర్థి నుంచి ఎలా కాపాడాడు? చివరకు భీష్మ కంపెనీకి సీఈవోగా కావడానికి యువ భీష్ముడు ఎలాంటి పై ఎత్తులు వేశాడు అనే ప్రశ్నలకు సమాధానమే భీష్మ సినిమా కథ.

  భీష్మ ఫస్టాఫ్ అనాలిసిస్

  భీష్మ ఫస్టాఫ్ అనాలిసిస్

  ఆర్గానిక్ ఫార్మింగ్ కంపెనీకి సీఈవోగా ఎవరు ఉంటారు? ఎవరిని ఎన్నుకోబోతున్నారనే పాయింట్‌తో భీష్మ మూవీ ప్రారంభమవుతుంది. పనీ పాట లేకుండా అమ్మాయిల ప్రేమను పొందడానికి ప్రయత్నించే భీష్మగా నితిన్ క్యారెక్టర్ ఎంట్రీ అవుతుంది. నితిన్ క్యారెక్టర్ తెరపైన మొదలైనప్పటి నుంచి వినోద ప్రధానంగా సాగే సన్నివేశాలు, వెన్నెల కిషోర్ కామెడీతో సరదాగా సాగిపోతుంది. ఓ విషయంలో పోలీసులకు చిక్కి ఏసీపీ పర్యవేక్షణలో భీష్మకు పనిష్మెంటుగా సాగే క్రమశిక్షణ కార్యక్రమం చాలా ఇంట్రస్టింగ్‌గా ఉంటుంది. ఇక చైత్రగా రష్మిక క్యారెక్టర్ ఎంట్రీ కావడంతో రొమాన్స్ అంశాలు కథలోకి చేరుతాయి.

  ఈ క్రమంలో ఓ విలేజ్‌లో జరిగే యాక్షన్ సీన్ కీలకంగా మారుతుంది. ఆ తర్వాత ఫీల్డ్ సైన్స్ ప్రతినిధుల కుట్రలను వాటిని ఎదురించేందుకు భీష్మ ఎంట్రీ ఇవ్వడం.. అదే ఊపులో ఇంట్రెస్టింగ్ బ్యాంగ్‌తో ఇంటర్వెల్ బ్యాంగ్‌తో సెకండాఫ్‌పై అంచనాలు పెరుగుతాయి.

  భీష్మ సెకండాఫ్ ఎనాలిసిస్

  భీష్మ సెకండాఫ్ ఎనాలిసిస్

  భీష్మ రెండో భాగంలో ఆరంభంలో మంచి ట్విస్ట్‌తో సినిమా తెరపైన పరుగులు పెడుతుంది. వినోదంతోపాటు యాక్షన్ సీన్లు, ఎమోషన్ అంశాలతో కథ ఫీల్‌గుడ్‌గా సాగుతుంది. ప్రధానంగా ఎంటర్‌టైన్‌మెంట్‌తో ఆర్గానిక్ ఫార్మింగ్, రైతుల కష్టాలు, దళారీల దోపిడి లాంటి అంశాలను ఎమోషనల్‌గా చెప్పడంలో దర్శకుడు ప్రతిభ చూపించడంతో భీష్మ సరైన ట్రాక్‌లోనే వెళ్తుందనే ఫీలింగ్ కలుగుతుంది. ఇక ప్రీ క్లైమాక్స్ నుంచి చివరి సీన్ వరకు దర్శకుడు తీసుకొన్న జాగ్రత్తలు భీష్మను సక్సెస్‌ఫుల్ ఫార్ములా సినిమాగా మార్చాయి. చివర్లో ప్రేక్షకుడు సంతృప్తి చెందేలా అజయ్ ఎపిసోడ్, అనంత నాగ్‌ పాత్ర ఇచ్చే ట్విస్టులు సినిమాకు ప్లస్‌గా మారాయని చెప్పవచ్చు.

  దర్శకుడు వెంకీ కుడుముల గురించి

  దర్శకుడు వెంకీ కుడుముల గురించి

  రొటీన్ లవ్ స్టోరికి సేంద్రియ వ్యవసాయం పాయింట్‌ను క్లబ్ చేయడంలోనే దర్శకుడు వెంకీ కుడుముల సక్సెస్ అయ్యాడనే ఫీలింగ్ సినిమా ఆరంభంలోనే కల్పించాడని చెప్పవచ్చు. సగటు ప్రేక్షకుడు ఏం కోరుకుంటున్నాడనే విషయాలను బేరీజు వేసుకొని పక్కాగా స్క్రిప్టును బ్యాల్సెన్ చేయడం డైరెక్టర్‌గా మరో మెట్టు ఎక్కడానిపిస్తుంది. వెన్నెల కిషోర్‌తో సున్నితమైన హాస్యాన్ని పండిస్తూ.. మరోవైపు సీరియస్‌గా ఆర్గానిక్ ఫార్మింగ్‌ను సాధారణ ప్రేక్షకులకు అరటిపండు ఒలిచిపెట్టినంత ఈజీగా తెరకెక్కించాడు. ఇక కమర్షియల్ విలువల కోసం లవ్ స్టోరీని, యాక్షన్ సీన్లను ఏకకాలంలో సమపాళ్లలో ఎగ్జిక్యూట్ చేయడం సినిమాకు మరో ప్లస్ పాయింట్‌గా మారింది. ఓవరాల్‌గా ఎలాంటి సాహసాలు చేయకుండా, తడబాటు లేకుండా సినిమాను ఫీల్‌గుడ్‌గా మలచడంలో వెంకీ కుడుముల పూర్తిస్థాయిలో సఫలమయ్యాడనే ఫీలింగ్ కలుగుతుంది. అలాగే ద్వితీయ విఘ్నాన్ని కూడా దాటేసే ప్రయత్నం సులభంగా జరిగిపోయిందని చెప్పవచ్చు.

   నితిన్ ఫెర్ఫార్మెన్స్ గురించి

  నితిన్ ఫెర్ఫార్మెన్స్ గురించి

  వరుస వైఫల్యాల బారిన పడిన నితిన్‌కు భీష్మ పెద్ద ఊరట అనిచెప్పవచ్చు. కథకు అనుగుణంగా, భీష్మ పాత్రకు తగినట్టుగా తన బాడీ లాంగ్వేజ్‌తో ఆకట్టుకొన్నాడు. అలాగే ఫెర్ఫార్మెన్స్ పరంగా, కామెడీ టైమింగ్ పరంగా నితిన్‌లో మెచ్యురిటీ కనిపించింది. రొమాంటిక్ సీన్లలో రష్మికతో కెమిస్ట్రీని బాగా పండించాడు. ఫైట్స్‌, యాక్షన్ సీన్లలో కూడా మంచి ఈజ్‌ను ప్రదర్శించాడు. భీష్మగా నితిన్‌‌లో కొత్త కోణం కనిపించిందని చెప్పవచ్చు.

  రష్మిక ఫెర్ఫార్మెన్స్

  రష్మిక ఫెర్ఫార్మెన్స్

  రష్మిక మందన్న చైత్రగా అటు గ్లామర్‌తోను, ఇటు ఫెర్ఫార్మెన్స్ బ్యాలెన్స్ చేస్తూ ఆకట్టుకొన్నది. వరుస విజయాలను చేజిక్కించుకొంటున్న రష్మిక ఖాతాలో మరో విజయం చేరిందనే చెప్పాలి. ఇప్పటి వరకు యాక్టింగ్‌పైనే దృష్టిపెట్టిన రష్మిక భీష్మ చిత్రంలో డ్యాన్సులతో ఇరుగదీసింది. ఫస్టాఫ్‌లో అల్లరి పిల్లలా కనిపించిన రష్మిక.. సెకండాఫ్‌లో ఎమోషనల్ సీన్లతో మెప్పించింది. ప్రీ క్లైమాక్స్ ముందు నితిన్‌తో ఓ ఎమోషనల్ సీన్‌లో రష్మిక నటన భావోద్వేగానికి గురిచేస్తుంది.

  అనంత్ నాగ్, సంపత్ రాజ్ యాక్టింగ్

  అనంత్ నాగ్, సంపత్ రాజ్ యాక్టింగ్

  మిగితా క్యారెక్టర్లలో భీష్మ కంపెనీ అధినేతగా భీష్మగా అనంత్ నాగ్ నటన చాలా బాగుంది. రాయల్ లుక్‌తో తెరపైన ఎమోషనల్‌గా కనిపించాడు. అనంత్ నాగ్ పలికించిన హావభావాలు, డైలాగ్ డెలివరీ చూస్తే భీష్మ పాత్రలో చక్కగా ఒదిగిపోయాడనిపిస్తుంది. ఇక విలన్‌గా జిషు సేన్ గుప్తా మరోసారి ఆకట్టుకొన్నాడు. క్లాస్ విలనిజం ఇంత తేలికగానా అన్నట్టు ఆ పాత్రలో దూరిపోయాడనిపిస్తుంది. జిషు లుక్, స్టయిల్ చాలా బాగుంది. ఇక ఏసీపీగా, రష్మిక ఫాదర్‌గా సంపత్ రాజ్ తనదైన శైలిలో మెప్పించాడు. పలు సీన్లలో సీరియస్ లుక్స్‌తోపాటు పలు సన్నివేశాల్లో కామెడీని బ్రహ్మండంగా పండించాడు.

  వెన్నెల కిషోర్, ఇతర నటీనటుల కామెడీ

  వెన్నెల కిషోర్, ఇతర నటీనటుల కామెడీ

  కామెడీ బృందంలో వెన్నెల కిషోర్ అన్ని మార్కులు కొట్టేసేలా హాస్యాన్ని పండించాడు. ఉన్నత ఉద్యోగం నుంచి కారు డ్రైవర్‌గా మారిన తర్వాత వెన్నెల కిషోర్ పంచ్ డైలాగ్స్‌తో ఆలరించాడు. అలాగే నర్రా శ్రీనివాస్‌ది కామెడీలో మరోరకమైన వేరియేషన్. సీరియస్‌ సీన్లలో అద్భుతంగా హాస్యాన్ని పండించాడు. రఘుబాబు సందర్బోచితంగా డైలాగ్స్‌ను పేల్చాడు. అలాగే మిర్చి కిరణ్‌ను సమయం దొరికితే తనదైన మార్కు కామెడీ డైలాగ్స్ అలరించాడు. వీకే నరేష్ ఎమోషనల్ టచ్‌తోపాటు కామెడీని ఇరగదీశాడు. సుదర్శన్, బ్రహ్మాజీ లాంటి పాత్రలు కూడా ఆకట్టుకొంటాయి. దర్శకుడు వెంకీ కుడుముల రాసిన ఫీల్ గుడ్, పంచ్ డైలాగ్స్‌లకు నటీనటులందరూ పూర్తిస్థాయిలో న్యాయం చేశాడని చెప్పవచ్చు.

  మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్

  మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్

  సాంకేతిక విభాగాల్లో మ్యూజిక్ విషయానికి వస్తే.. పాటలు అంతగా ఆకట్టుకోలేకపోయాయి. చివర్లో వచ్చిన మాస్ పాట తప్ప మిగితా పాటలు అంతగా అలరించలేకపోయాయి. పాటలు కూడా బాగా క్లిక్ అయితే సినిమా మరో రేంజ్‌లో ఉండేదనే ఫీలింగ్ కలగడం సహజం. మ్యూజిక్‌లో గొప్పగా చెప్పుకోవాల్సిన విషయం కూడా ఉంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పలు సన్నివేశాలను బాగా ఎలివేట్ చేయడం సినిమాకు అదనపు ఆకర్షణగా మారింది.

  సినిమాటోగ్రఫి, ఎడిటింగ్ గురించి

  సినిమాటోగ్రఫి, ఎడిటింగ్ గురించి

  భీష్మ సినిమాకు సినిమాటోగ్రఫి మరో ఎట్రాక్షన్. సాయి శ్రీరాం అందించిన విజువల్స్ బాగున్నాయి. పచ్చని పంట పొలాలు, స్టైలిష్ ఆఫీస్, ఇతర అంశాలను చాలా చక్కగా తెరకెక్కించడంలో సాయి శ్రీరాం తన ప్రతిభను చాటుకొన్నారు. యాక్షన్, ఎమోషనల్ సీన్లలో ఫర్‌‌ఫెక్షన్ కనిపిస్తుంది. అలాగే నవీన్ నూలి ఎడిటింగ్ కూడా ఫర్‌ఫెక్ట్‌గా ఉంది. ఆర్ట్ విభాగం పనితీరు కూడా బాగుంది.

  ప్రొడక్షన్ వ్యాల్యూస్

  ప్రొడక్షన్ వ్యాల్యూస్

  సేంద్రియ వ్యవసాయం అనే క్లిష్టమైన సబ్జెక్ట్‌కు అత్యంత సాదాసీదా ప్రేమ కథను జోడించి మంచి స్క్రీన్ ప్లేతో భీష్మను ఫీల్‌గుడ్ మూవీగా అందించడంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్ సఫలమైంది. సినిమా కథకు అవసరమైన లొకేషన్లు, పాత్రలకు ఎంచుకొన్న నటీనటుల అంశాలు వారి సినిమా నిర్మాణ విలువలకు అద్దం పట్టేలా ఉంది. క్లాస్,మాస్ ఆడియెన్స్‌ను మెప్పించేలా భీష్మను రూపొందించడంలో మెరుగైన నిర్మాణ విలువలను జోడించారని చెప్పవచ్చు.

  ఫైనల్‌గా

  ఫైనల్‌గా

  అంతర్లీనంగా సామాజిక సందేశంతోపాటు వినోదం, ప్రేమకథను జోడించి రూపొందించిన చిత్రం భీష్మ. అనంత్ నాగ్, జిషు సేన్ గుప్తా యాక్టింగ్, నితిన్, రష్మిక కెమిస్ట్రీ, వెన్నెల కిషోర్, రఘుబాబు, నర్రా శ్రీనివాస్ కాంబినేషన్‌లో హాస్యం ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్. రెండున్నర గంటలపాటు ఆస్వాదించే వినోదం.. సమకాలీన పరిస్థితుల్లో ఆహర కల్తీ గురించి ఆలోచింపజేసే పాయింట్ ఆకట్టుకొంటుంది. ప్రస్తుతం ఎలాంటి పోటీ వాతావారణం లేని పరిస్థితుల్లో భీష్మ రావడం ఓ సానుకూలం అంశం కాగా.. బీ, సీ సెంటర్ల ప్రేక్షకుల చేరవేయగలిగితే సినిమా కమర్షియల్‌గా మంచి ఫలితాన్ని రాబట్టే సత్తా భీష్మలో ఉందని చెప్పవచ్చు.

  బలం, బలహీనతలు

  బలం, బలహీనతలు

  ప్లస్ పాయింట్స్

  నితిన్, రష్మిక కెమిస్ట్రీ

  అనంత్ నాగ్, జిషు సేన్ గుప్తా ఫెర్ఫార్మెన్స్

  వెంకీ కుడుముల స్క్రీన్ ప్లే, డైరక్షన్

  బ్యాక్ గ్రౌండ్ స్కోర్

  సినిమాటోగ్రఫి

  ఆర్గానిక్ ఫార్మింగ్ అంశం

  మైనస్ పాయింట్స్

  రొటీన్ లవ్ స్టోరి

  ఊహించే విధంగా క్లైమాక్స్

  Nithiin Funny Speech At Bheeshma Pre Release Event || Filmibeat Telugu
  తెరముందు, తెర వెనుక

  తెరముందు, తెర వెనుక

  నటీనటులు: నితిన్, రష్మిక మందన్న, అనంత్ నాగ్, సంపత్ రాజ్, వీకే నరేష్, జిషు సేన్ గుప్తా, వెన్నెల కిషోర్ తదితరులు

  స్క్రీన్ ప్లే, డైరెక్షన్: వెంకీ కుడుముల

  నిర్మాత: సూర్యదేవర నాగవంశీ

  సంగీతం: సాగర్ మహతి

  సినిమాటోగ్రఫి: సాయి శ్రీరాం

  ఎడిటింగ్: నవీన్ నూలి

  ఆర్ట్: సాహీ సురేష్

  రిలీజ్ డేట్: 2020-02-21.

  English summary
  Bheeshma movie review. Actor Nithiin coming with Bheeshma after three flops. This movie getting good reports from all over the world. Female Actor Rashmika Mandanna has big movies in her kitty. He got very good success with Sarileru neekevvaru.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X