‘A’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్

రేటింగ్ 2.5
నటీనటులు : నితిన్‌ ప్రసన్న, ప్రీతి అస్రాని తదితరులు
నిర్మాణ సంస్థ : అవంతి ప్రొడక్షన్స్‌
నిర్మాత : గీతా మిన్సాల
దర్శకత్వం : యుగంధర్‌ ముని
సంగీతం : విజయ్‌ కురాకుల
ఎడిటింగ్‌: ఆనంద్‌ పవన్‌
సినిమాటోగ్రఫీ : ప్రవీణ్‌ కె బంగారి
విడుదల తేది : మార్చి 05, 2021

కొత్త కాన్సెప్ట్‌లతో వస్తోన్న చిత్రాలను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. రొటీన్ మాస్ మసాల సినిమాలు చూసి బోర్ కొట్టి ఉన్న ప్రేక్షకులు కొత్తదనంతో నిండిన చిత్రాలంటే మక్కువ చూపుతున్నారు. ఇలా ఈ వారంలో కొత్త కథలో ప్రయోగాలు చేసిన చిత్రాలు వచ్చాయి. ఆ కోవలోకి చెందిన చిత్రమే A. మరి ఈ మూవీ ప్రేక్షకులకు ఏ మేరకు ఎక్కిందో చూద్దాం.

ఓ మనిషికి పదే పదే ఓ కల రావడం.. దాని వెనుకున్న కథ ఏంటి.. అసలు ఆ కలకు అతనికి ఉన్న సంబంధం ఏంటి.. అదో అంతుచిక్కని రోగమా? లేదా నిజంగానే దాని వెనుక ఏమైనా కథ ఉందా? అంటే ఆ సంగతులేంటి? అని ప్రశ్నలు తలెత్తుతాయి A మూవీ ట్రైలర్ చూస్తే. అయితే సరిగ్గా ఇలాంటి ప్రశ్నలకు సమాధానంగానే నిలుస్తుంది A.

Nithin Prasanna A movie review and rating

గతాన్ని కోల్పోయిన సంజీవ్ (నితిన్ ప్రసన్న).. కొత్త పేరుతో జీవితాన్ని సాగిస్తుంటాడు. నర్స్ పల్లవి (ప్రీతి అస్రానీ) ప్రేమలో పడిపోతాడు. అయితే అతనికి ఓ కల పదే పదే వెంటాడుతూ ఉంటుంది. అసలు ఆ కలకు, సంజీవ్‌కు ఉన్న సంబంధం ఏంటి? ఆయన గతం ఏంటి.. ఆ గతంతో ఆ కలకు ఏదైనా సంబంధం ఉందా? మధ్యలో ఈ కిడ్నాప్ కేసు ఎందుకు వచ్చింది? ఇలా ఎన్నెన్నో ఆసక్తికరమైన అంశాలకు బదులు దొరకాలంటే A మూవీకి వెళ్లాల్సిందే.

ఇక ఈ సినిమాలో మరీ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది హీరో పాత్ర గురించే. నితిన్ ప్రసన్నా అన్ని ఎమోషన్స్ బాగా పలికించాడు. ప్రతీ అస్రానీ అందంతో పాటు అభినయంతోనూ ఆకట్టుకుంది. మిగతా పాత్రలేవీ అంతగా గుర్తుండవు కూడా. ఎక్కువగా ఈ రెండు పాత్రల చుట్టే సినిమా తిరుగుతూ ఉంటుంది. దర్శకుడు ఈ సినిమాను హ్యాండిల్ చేసిన విధానం, ప్రేక్షకుడిని కట్టి పడేసేలా రాసుకున్న కథనం అన్నీ చక్కగా కుదిరాయి.

సాంకేతిక విభాగాల పనితీరు గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ముఖ్యంగా సంగీత దర్శకుడి గురించి చెప్పుకోవాలి. పాటలే కాకుండా నేపథ్యం సంగీతంలోనూ తన మార్క్ చూపించాడు. విజయ్ కురాకుల కొట్టిన బ్యాగ్రౌండ్ స్కోర్ అందరినీ ఆకట్టుకుంటుంది. ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ అన్నీ కూడా అదిరిపోయాయి. మొత్తంగా ఈ సినిమా ప్రేక్షకుడికి ఓ కొత్త అనుభూతిని అందిస్తుందని చెప్పవచ్చు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X