twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'ఖుషీ' ఖుషీగా... ('గుండె జారి గల్లంతయ్యిందే' రివ్యూ)

    By Srikanya
    |

    -సూర్య ప్రకాష్ జోశ్యుల

    Rating:
    3.0/5
    హిట్ కొట్టాలంటే కావాల్సింది గొప్ప కథ కాదు... ప్రేక్షకుల పల్స్... ఏ సిట్యువేషన్ కి వారు నవ్వుతారో... ఏ ఎమోషన్ కి వారు స్పందిస్తారో...ఏ డైలాగుకి విజల్స్ వేస్తారో... ఏ పాటకి లేచి డాన్స్ వేస్తారో... ఇవన్ని ఏర్చి కూర్చి సమకూర్చినట్లున్న చిత్రం 'గుండె జారి గల్లంతయ్యిందే'. 'ఇష్క్' తో హిట్ యాత్ర మొదలెట్టిన నితిన్ తన ఖాతాలో మరో విజయం జత చేసుకున్నాడు. పూర్తి రొమాంటిక్ కామెడీగా సాగిన ఈ చిత్రం విజయానికి పూర్తి కారణం స్క్రిప్టు మీద చేసిన వర్కే అని స్పష్టంగా కనపడుతుంది. నితిన్, నిత్యా మీనన్ కూడా మాంఛి హుషారుగా తమ పాత్రలను మోసుకుంటూ, దర్శకుడి విజన్ కి అండగా నిలిచారు. మరో ప్రక్క పవన్ ఫ్యాన్స్ కూడా పండుగ చేసుకునేలా సీన్స్, రీమిక్స్ సాంగ్ పెట్టి నితిన్ తగు జాగ్రత్తలు తీసుకున్నాడు. అయితే స్పెషల్ ఎట్రాక్షన్ అని ఊదరకొట్టిన గుత్తా జ్వాలా సాంగ్ మాత్రం పెద్దగా ఇంపాక్ట్ ఇవ్వలేదు.

    సాప్ట్ వేర్ ఎంప్లాయ్ అయిన కార్తీక్‌ (నితిన్‌) తొలిచూపులోనే చిన్న పాటి పరిచయం కూడా లేకుండా శ్రుతి(ఇషా తల్వార్) తో ప్రేమలో పడతాడు. అయితే ఆమె ఫోన్ నెంబర్ ట్రేస్ చేయటంలో పొరపాటు జరిగి శ్రావణి(నిత్యమీనన్)కి కనెక్టు అవుతాడు. శ్రావణి సున్నిత మనస్తత్వమున్న యువతి. తన కోసమే పుట్టిన యువకుడిని పెళ్లి చేసుకోవాలనేదే ఆమె ఆలోచన. శ్రావణినినే శ్రుతి అనుకుని కార్తీక్ లైన్ లో పెట్టడానకి ట్రై చేస్తాడు. ఈ క్రమంలో శ్రావణితో మానసికంగా అనుబంధం పెంచుకుంటాడు. అయితే ఒకానొక సిట్యువేషన్ లో అసలు నిజం తెలుస్తుంది. శ్రుతి వేరు.. తను ఫోన్ లో ప్రేమించే అమ్మాయి వేరు అని అర్దం అవుతుంది. అప్పుడు శ్రావణి ఏ నిర్ణయం తీసుకుంది. కార్తీక్‌ ఎవరితో కలిసి జీవితం పంచుకొన్నాడు? అనే విషయాల్ని తెరపైనే చూడాలి.

    క్లాసిక్ నేరేషన్ లో సాగిన ఈ రొమాంటిక్ కామెడీకి బలం.. కామెడీ.. సాధ్యమైన చోటల్లా.. డైలాగు ద్వారానో, సిట్యువేషన్ ద్వారానో కామెడీ పండించే ప్రయత్నం చేసారు. అలాగే.. స్క్రిప్టు కూడా చాలా టైట్ గా చేసారు. అయితే సెకండాఫ్ లో మాత్రం కొన్ని చోట్ల బిగి సడిలి, సీన్స్ సాగుతున్న ఫీలింగ్ వచ్చింది. ఎడిటింగ్ లో వాటిని సరిచేస్తే బాగుండేది. ముఖ్యంగా ఇంటర్వెల్ లీడ్, ఇంటర్వెల్ సిట్యువేషన్ మాత్రం సినిమాని రేస్ గుర్రంలా పరుగెత్తించాయి. థియేటర్స్ లో విజిల్స్ మ్రోగేలా ఆ సీన్స్ డిజైన్ చేసారు... నిజానికి క్లైమాక్స్ ఆ రేంజిలో పేలితే బాగుండేది. ఇక పవన్ కళ్యాణ్ పై తన అభిమానాన్ని నితిన్ చాలా చోట్ల ప్రదర్శించాడు. ముఖ్యంగా తొలిప్రేమలో పాట రీమిక్స్ కి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. కాని సెకండాఫ్ లో పడితే ఆ పాట మరింత కిక్ వచ్చి ఉండేది. ఖుషీ లో సీన్... ని ఉపయోగించుకున్న విధానం కూడా బాగుంది. నిజానికి ఇంటర్వెల్ తర్వాత ఇంకేం ప్లే ఉంటుంది... ఏ రకంగా డైరక్టర్ ప్లే చేస్తాడనేది చాలా ఆసక్తి కలిగించింది. అయితే అక్కడ నుంచి తేలిపోకుండా సెకండాఫ్ ని కత్తి మీద సాములా లాక్కెళ్లి సక్సెస్ అయ్యాడు. టెక్నికల్ గా కూడా సినిమా బాగుంది.

    మంచి వినోదం కోసం ఈ సినిమా మంచి ఆప్షన్. ఓ ఆదివారం సరదాగా ఫ్యామిలీలు కూడా వెళ్లి చూడదగ్గ సినిమా. పవన్ ఫ్యాన్స్ కూడా తొలి ప్రేమ రోజులను గుర్తు చేసే రీమిక్స్ పాట చూడ్డానికి అయినా తప్పనిసరిగా వెళ్లాలి.

    మిగతా రివ్యూ స్లైడ్ షోలో...

    'ఖుషీ' ఖుషీగా... ('గుండె జారి గల్లంతయ్యిందే' రివ్యూ)

    స్క్రీన్ ప్లే రచయిత హర్ష వర్ధన్.... చాలా తెలివైన స్క్రీన్ ప్లే తో మరీ స్లో, మరీ స్పీడ్ కాకుండా మంచి నేరషన్ తో కథని నడిపించాడు. దాదాపు ప్రతీ సీన్ లోనూ తర్వాత ఏం జరుగుతుందో అన్న ఉత్కంఠను నిలబెట్టగలిగాడు. ప్రీ క్లైమాక్స్ కూడా ఊహించని విధంగా చేసారు. కానీ మరింత డెప్త్ ఆ సీన్ ఉంటే బావుండేది.

    'ఖుషీ' ఖుషీగా... ('గుండె జారి గల్లంతయ్యిందే' రివ్యూ)

    అయితే అన్ని బాగానే ఉన్నా సినిమా లిబర్టీస్ బాగా తీసుకున్నారనిపిస్తుంది. కథలో కీలకమైన.. ఫోన్ లో ఒకరితో గంటల తరబడి ఫోన్ లో మాట్లాడినప్పుడు వారి గొంతు మనికి గుర్తు ఉండదా.. బయిటే అదే వ్యక్తి కనిపించి మాట్లాడినప్పుడు... గుర్తు పట్టలేమా అంటే ఈ కథే లేదు.

    'ఖుషీ' ఖుషీగా... ('గుండె జారి గల్లంతయ్యిందే' రివ్యూ)

    అలాగే సినిమాలో గే కామెడీ ఎక్కువైంది. మరీ వెగటు కలిగించింది. దాన్ని ట్రిమ్ చేసి ఎడిట్ చేస్తే బాగుంటుంది. మంచి లవ్ స్టోరీ నడుస్తున్నప్పుడు ఈ గే కామెడీ జుగుప్స కలిగించింది. గే గా చేసిన నటుడు ఎంత బాగా చేసినా సీన్ ఎంత బాగా పండినా భరించటం కష్టమే...

    'ఖుషీ' ఖుషీగా... ('గుండె జారి గల్లంతయ్యిందే' రివ్యూ)

    రఘుబాబు లాంటి సీనియర్ ఆర్టిస్టుని ఎందుకలా వృధా చేసారో అర్దం కాదు. అతనిని కూడా సమర్ధవంతంగా ఉపయోగించుకుంటే బాగుండేది. అలాగే నితిన్ లాంటి యంగ్ హీరోకి అలీ ప్రెండ్ ఏమిటో అర్దం కాదు. అయితే అలీ మాత్రం తన పాత్రకు నవ్విస్తూ న్యాయం చేసాడు.

    'ఖుషీ' ఖుషీగా... ('గుండె జారి గల్లంతయ్యిందే' రివ్యూ)

    సినిమా హైలెట్స్ లో ఆండ్రూ కెమెరా వర్క్ ఒకటి. అలాగే అనూప్ సంగీతం కూడా యూత్ కి తగినట్లు సాగింది.

    'ఖుషీ' ఖుషీగా... ('గుండె జారి గల్లంతయ్యిందే' రివ్యూ)

    మల్టిఫుల్ షేడ్స్ తో నితిన్ పాత్ర బాగా డిజైన్ చేసారు. అలాగే నితిన్ కూడా బాగా పరిణితి వచ్చినట్లు నటన, డైలాగు డెలవరీలో కనిపించాడు. నిత్యా మీనన్ ఎప్పటిలాగే అదరకొట్టింది. ఇషా తల్వార్ మాత్రం ఆకట్టుకోలేకపోయింది.

    'ఖుషీ' ఖుషీగా... ('గుండె జారి గల్లంతయ్యిందే' రివ్యూ)

    సినిమాలో మొదటి నుంచి హైలెట్ గా చెప్తున్న గుత్తా జ్వాల మాత్రం జ్వాల రగిలించలేకపోయింది. ఒక్క స్టెప్ కూడా సరిగ్గా వెయ్యిలేకపోయింది.

    'ఖుషీ' ఖుషీగా... ('గుండె జారి గల్లంతయ్యిందే' రివ్యూ)

    ఫస్టాఫ్ ఉన్నంతగా సెకండా ఫ్ కూడా ఉంటే మరింత బాగుండేది. అయినా వినోదానికి లోటు లేదు కాబట్టి మంచి సక్సెస్ సాధిస్తుంది.

    'ఖుషీ' ఖుషీగా... ('గుండె జారి గల్లంతయ్యిందే' రివ్యూ)

    ఈ సినిమాతో నితిన్.. యాక్షన్ సినిమాల కన్నా ఇలాంటి రొమాంటిక్ డ్రామాలకు కరెక్టుగా సూటవుతాడనిపిస్తోంది. కొన్ని యాంగిల్స్ లో ఇష్క్ కన్నా ఈ చిత్రమే బాగుంది.

    'ఖుషీ' ఖుషీగా... ('గుండె జారి గల్లంతయ్యిందే' రివ్యూ)

    సంస్థ: శ్రేష్ఠ్‌ మూవీస్‌
    నటీనటులు: నితిన్‌, నిత్య మీనన్‌, ఇషా తల్వార్‌, గుత్తా జ్వాల, అలీ, తాగుబోతు రమేష్‌, ఆహుతి ప్రసాద్‌, రవిబాబు, సుధ, దువ్వాసి మోహన్‌, మధునందా తదితరులు.
    సంగీతం: అనూప్‌ రూబెన్స్‌
    కెమెరా: ఆండ్రూ బాబు,
    పాటలు: కృష్ణచైతన్య,
    డాన్స్‌: శేఖర్‌,
    మాటలు-కథనం: హర్షవర్ధన్‌,
    కళ: రాజీవ్‌నాయర్‌.
    నిర్మాత: నిఖితారెడ్డి
    దర్శకత్వం: విజయ్‌కుమార్‌ కొండా
    విడుదల: ఏప్రియల్ 19, 2013 (శుక్రవారం).

    English summary
    A year after the release of Ishq, actor Nitin Kumar Reddy has made his comeback with his latest outing Gunde Jaari Gallanthayyinde (GJG), which has been directed by Vijay Kumar Konda. It is good entertainer with rich production elements. When compared to Ishq, this movie has more comedy and romance. It has unique concept with a fresh approach towards the usual subject 'love'.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X