twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Nootokka Jillala Andagadu movie review: అవసరాల శ్రీనివాస్ హిట్టు కొట్టాడా? అంటే..

    |

    Rating: 2.75/5

    నటీనటులు: శ్రీనివాస్ అవసరాల, రుహానీ శర్మ, రోహిణి, కృష్ణ భగవాన్, రమణ భార్గవ, రాకెట్ రాఘవ, శివన్నారాయణ తదితరులు
    దర్శకత్వం: రాచకొండ విద్యాసాగర్
    నిర్మాతలు: వై రాజీవ్ రెడ్డి, సాయిబాబా జాగర్లమూడి, దిల్ రాజు, శిరీష్
    సంగీతం: శక్తికాంత్ కార్తీక్
    సినిమాటోగ్రఫి: రామ (రాంరెడ్డి)
    బ్యానర్స్: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్, ఎస్‌వీసీ ఎఫ్ఎఫ్ఈ బ్యానర్స్
    రిలీజ్ డేట్: 2021-09-03

    కథ ఏమిటంటే..

    కథ ఏమిటంటే..

    రియల్ ఎస్టేట్ కంపెనీలో కస్టమర్ రిలేషన్ మేనేజర్ (సీఆర్ఎమ్)గా పనిచేసి సూరి అలియాస్ గొట్టి సూర్య నారాయణ ( జీఎస్ఎన్ (అవసరాల శ్రీనివాస్)) బట్టతల కారణంగా ఓ రకమైన అభద్రతాభావంతో ఉంటాడు. విగ్గు పెట్టుకొంటే కానీ కాన్ఫిడెన్స్‌గా కనిపించడు. తనకు బట్టతల ఉందనే విషయం గుర్తిస్తారనే భయంతో మానసికంగా ఓ రకమైన క్షోభకు గురవుతుంటాడు. ఆ క్రమంలో తన ఆఫీస్‌లో అంజలి ( రుహానీ శర్మ) అనే ఉత్తరాదికి చెందిన అమ్మాయి జాబ్‌లో చేరుతుంది. అంజలిని చూసి తొలిచూపులోనే సూరి మనసుపడేసుకొంటాడు? వారి ప్రేమాయణం పెళ్లి వరకు వచ్చిన నేపథ్యంలో సూరికి బట్టతల ఉందనే విషయం అంజలి, ఆమె కుటుంబ సభ్యులకు తెలుస్తుంది?

    నూటొక్క జిల్లాల అందగాడికి ఎదురైన సమస్యలు ఇవే..

    నూటొక్క జిల్లాల అందగాడికి ఎదురైన సమస్యలు ఇవే..

    బట్టతల కారణంగా సూరి మానసికంగా ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటాడు? సూరి జీవితంలో కొన్ని అనుభవాలు ఎలాంటి భావోద్వేగానికి గురిచేశాయి? సూరికి బట్టతల ఉందనే విషయం తెలిసిన అంజలి రియాక్షన్ ఏమిటి? అంజలి ఉద్యోగం మానేసి గుర్గావ్‌కు వెళ్లాలని నిర్ణయం తీసుకోవడం అసలు కారణం ఏమిటి? సూరి బట్టత లను చూసిన అంజలి కుటుంబ సభ్యులు ఎలాంటి నిర్ణయం తీసుకొన్నాడు? ఇలాంటి ఎమోషనల్ పరిస్థితుల మధ్య ఉద్యోగపరమైన ఒత్తిడులను సూరి ఎలా అధిగమించాడు? చివరికి సూరి, అంజలి మధ్య బంధానికి ఎలాంటి ముగింపు దొరికింది అనే ప్రశ్నలకు సమాధానమే నూటోక్క జిల్లాల అందగాడు.

    ఫస్టాఫ్ ఎలా ఉందంటే...

    ఫస్టాఫ్ ఎలా ఉందంటే...

    బట్టతల అనేది ప్రతీ ఒక్కరికి ఓ బలహీనతగా కనిపిస్తుంది. అలాంటి సూరి పాత్రలో అవసరాల శ్రీనివాస్ ఒదిగిపోయాడనే విషయం ప్రారంభంలో రెండు మూడు సీన్లలోనే స్పష్టమవుతుంది. ఇక డైలాగ్స్ కూడా పక్కాగా ఫైర్ కావడంతో పాత్రలతో కనెక్ట్ అయిపోయేందుకు సులభమైందనే ఫీలింగ్ కలుగుతుంది. ఇక రుహానీ శర్మ అంజలిగా ఎంట్రీ కావడం, హిందీ భాషలో డైలాగ్స్ ఫీల్‌గుడ్‌గా ఉండటంతో సినిమా ఫ్రెష్‌నెస్ కనిపిస్తుంది. అయితే తొలి భాగంలో బట్టతల వ్యవహారాన్ని కాస్త సాగదీసి అసలు కథను, సమస్యను చెప్పడానికి ఇంటర్వెల్ వరకు వెయిట్ చేయించారా అనే ఫీలింగ్ కలుగుతుంది. సూరి, అంజలి మధ్య ఇంట్రెస్టింగ్‌ సీన్‌ను ఎమోషనల్‌గా మార్చడమే కాకుండా హ్యుమర్‌తో ఇంటర్వెల్ బ్యాంగ్ వేయడంతో సెకండాఫ్‌పై ఆసక్తి పెరుగుతుంది.

    సెకండాఫ్ ఎమోషనల్‌గా

    సెకండాఫ్ ఎమోషనల్‌గా

    ఇక సెకండాఫ్‌లో బలమైన సీన్లతో కథ ఎమోషనల్ జోన్‌లో ప్రవేశిస్తుంది. అంజలి, సూరి మధ్య సీన్లు, అలాగే తల్లి (రోహిణి)తో సన్నివేశాలు, సత్తిపండు (రమణ భార్గవ)తో సీన్లు సినిమాను నిలబెట్టడానికి కారణమయ్యాయనే ఫీల్‌గుడ్ ఫ్యాక్టర్ క్రియేట్ అవుతుంది. అయితే ఇలాంటి పరిస్థితుల్లో హోటల్‌లో పెళ్లి సందర్భంగా సూరితో చేసిన సుదీర్ఘమైన ఎపిసోడ్ సినిమా ఎమోషనల్ ఫ్లోను దెబ్బ తీసినట్టు అనిపిస్తుంది. ఇక క్లెమాక్స్‌లో అంతా ఊహించినట్టే జరగడం, కథలో చివరకు ఎమోషనల్ ఫ్యాక్టర్ తేలిక కావడం రెగ్యులర్ ఎండింగ్‌తో ముగిసినట్టు అనిపిస్తుంది.

    దర్శకుడు టేకింగ్ ఇలా..

    దర్శకుడు టేకింగ్ ఇలా..

    దర్శకుడు రాచకొండ విద్యాసాగర్ పాయింట్ కొత్తదేమీ కాకపోయినా తెలిసిన పాయింట్‌నే సరికొత్తగా చెప్పేందుకు చేసిన ప్రయత్నం సక్సెస్ అయినట్టే చెప్పవచ్చు. కథను పరిగెత్తించేందుకు రాసుకొన్న సన్నివేశాలు, వాటికి తోడుగా డైలాగ్స్‌తో మ్యాజిక్ చేసేందుకు భారీగానే ప్రయత్నించాడు. కొన్ని సీన్లు సహజంగా ఉంటే.. మరొకొన్ని తేలిపోయనట్టు కనిపిస్తాయి. ఓవరాల్‌గా దర్శకుడిగా మంచి మార్కులే కొట్టేశాడని చెప్పవచ్చు.

    అవసరాల, రుహానీ శర్మ

    అవసరాల, రుహానీ శర్మ

    ఇక అవసరాల శ్రీనివాస్ టాలెంట్ గురించి కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నూటొక్క జిల్లాల అందగాడు సినిమాను పూర్తిగా తన భుజానికి ఎత్తుకొని కడవరకు జస్టిఫై చేయడానికి నూరుశాతం ప్రయత్నించాడు. సూరి పాత్రలో చక్కగా ఒదిగిపోయాడు. కామెడీ, ఎమోషన్స్‌ కలగలిపిన పాత్రను పండించడానికి పెద్దగా కష్టపడినట్టు ఎక్కడా కనిపించడు. తన కెరీర్‌లో సూరి పాత్ర ఓ బెస్ట్ వన్‌గా మారిపోవడం ఖాయం. రుహానీ శర్మ అంజలిగా గ్లామర్‌తోపాటు యాక్టింగ్‌లో చాలా ఈజ్‌ కనబరిచింది. సూరి అంజలి పాత్రల మధ్య కెమిస్ట్రీని పండిచడంలో రుహానీ తన వంతు న్యాయం చేసింది.

    మిగితా క్యారెక్టర్లలో

    మిగితా క్యారెక్టర్లలో

    మిగితా క్యారెక్టర్లలో తరగతి గది దాటి ఫేమ్ రమణ భార్గవ స్పెషల్‌గా చెప్పుకోవాలి. సత్తిపండు పాత్ర కనిపించేంది కొన్ని సీన్లు అయినా.. మరోసారి తన మార్కు కామెడీతో విజృంభించాడు. ముఖ్యంగా బస్‌స్టాప్ సీన్ హృదయాన్ని టచ్ చేస్తుంది. ఇక సూరి స్నేహితుడిగా నటించి యాక్టర్ చేసిన కామెడీ ఫ్రెష్‌గా ఉంటుంది. సూరి తల్లిగా రోహిణి మరోసారి భారమైన పాత్రను సమర్ధవంతంగా పోషించడమే కాకుండా సినిమాకు మరింత ఎమోషనల్ కంటెంట్‌ను యాడ్ చేసిందని చెప్పవచ్చు. కుటుంబం, వారస్వతం లాంటి సీన్లలో రోహిణి ఎమోషనల్ పంచ్ ప్రేక్షకుడిని భావోద్వేగానికి గురిచేస్తుంది. బాస్ పాత్రలో నటించిన నటుడు చాలా నేచురల్‌గా, అలవోకగా సాఫ్ట్ విలనిజాన్ని పండించాడు.

    టెక్నికల్ అంశాల గురించి

    టెక్నికల్ అంశాల గురించి

    ఇక సాంకేతిక విభాగాల పనితీరుకు వస్తే.. రామ్ ఫోటోగ్రఫి బాగుంది. సినిమా మొత్తం ఇండోర్‌లోనే సాగడంతో చక్కటి ఇంటీరియర్ లుక్‌తో సినిమాను రిచ్‌గా మార్చాడని చెప్పవచ్చు. కొన్ని టాప్ యాంగిల్ షాట్స్ బాగున్నాయి. ఇక శక్తికాంత్ కార్తీక్ మ్యూజిక్ విషయానికి వస్తే... రీరికార్డింగ్ బాగుంది. పాటలకు పెద్దగా స్కోప్ లేకపోవడం, ఉన్న పాటలు కూడా క్యాచీగా అనిపించవు. ఎమోషనల్ సీన్లను తన రీరికార్డింగ్‌తో మరో లెవెల్‌కు తీసుకెళ్లాడనే విషయం స్పష్టంగా కనిపిస్తుంది. ఎడిటింగ్‌కు ఇంకా కొంత స్కోప్ ఉంది. కొన్ని సీన్లపై కత్తెర వేస్తే ఫీల్ గుడ్, ఎమోషనల్ రన్ ఎఫెక్టివ్‌గా ఉంటుంది. వై రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

    Recommended Video

    Avasarala Srinivas In Dil Raju & Krish Jagarlamudi Production || Nootokka Jillala Andagadu
    ఫైనల్‌గా..

    ఫైనల్‌గా..

    బట్టతల కారణంగా ఆత్మనూన్యతభావంతో బాధపడే ప్రతీ ఒక్కరి సమస్యను ఎమోషనల్‌గా తెరపైన చర్చించిన చిత్రం నూటోక్క జిల్లాల అందగాడు. అవసరాల శ్రీనివాస్, రుహానీ శర్మ, రోహిణి, రమణ భార్గవ తదితరులు ఫెర్ఫార్మెన్స్ సినిమాకు బలంగా మారాయి. కొన్ని చోట్ల ఎమోషన్స్, మరొకొన్ని చోట్ల ఫన్ మూమెంట్స్ పండాయి. పూర్తిస్థాయిలో ఈ రెండు అంశాలు పండి ఉంటే డెఫినెట్‌గా మంచి సినిమా అయి ఉండేది. ఏది ఏమైనా వినోదం కోసం ఎదురుచూసే ఫ్యామిలీ, యూత్ ఆడియెన్స్ ఈ సినిమా థియేటర్లలో మించి ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తుంది. వీకెండ్ ఫన్ కోసం ఈ సినిమా ఈ వారం కేరాఫ్ అడ్రస్ అనిచెప్పవచ్చు. కాకపోతే నూటొక్క జిల్లాల అందగాడు అనేంత గొప్పగా మాత్రం లేదనిచెప్పవచ్చు.

    ట్యాగ్ లైన్: Bold and Bald Show

    English summary
    Nootokka Jillala Andagadu review: Srinivas Avasarala, Ruhani Sharma are in lead. Directed by Rachakonda Vidya Sagar. This movie hits screen on September 3rd, 2021.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X