twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నోటా మూవీ రివ్యూ అండ్ రేటింగ్

    |

    Recommended Video

    NOTA Movie Review నోటా మూవీ రివ్యూ

    Rating:
    2.0/5
    Star Cast: విజయ్ దేవరకొండ, మెహ్రీన్ ఫిర్జాదా, నాజర్, సత్యరాజ్, ప్రియదర్శి
    Director: ఆనంద్ శంకర్

    వరుస సినిమాలు, విజయాల తర్వాత విజయ దేవరకొండ క్రేజ్ ఊహించని విధంగా మారిపోయింది. అర్జున్ రెడ్డి, మహానటి, గీత గోవిందం చిత్రాల తర్వాత నోటా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. గత సినిమాల వరకు తెలుగుకే పరిమితమైన విజయ్ దేవరకొండ ప్రస్తుతం దక్షిణాదికి విస్తరించాడు. నోటా చిత్రం కేరళ, తమిళ, కన్నడ, తెలుగు భాషల్లో విడుదలవుతున్నది. తెలంగాణాలో ఎన్నికలు ఉన్నందున నోటా సినిమాను నిలిపివేయాలని రాజకీయ పార్టీలు కోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నోటా చిత్రం ఎలాంటి టాక్‌ను సంపాదించుకుందో తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.

    నోటా మూవీ స్టోరి

    నోటా మూవీ స్టోరి

    సీఎం వాసుదేవ్ (నాజర్) కుమారుడు వరుణ్ (విజయ్ దేవరకొండ) లండన్‌లో గేమ్ డెవలపర్. అమ్మాయిలు, మందు, జల్సాలతో మునిగి తేలే వరుణ్ తన తండ్రి అవినీతి కేసులో అరెస్ట్ కావడంతో అనూహ్య పరిస్థితుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి పదవిని చేపట్టాల్సి వస్తుంది. సీఎంగా మారిన తర్వాత తన తండ్రినే వ్యతిరేకించాల్సి వస్తుంది. తన కొడుకునే పదవి నుంచి దింపడానికి తండ్రి ప్రయత్నిస్తాడు. తన తండ్రి ఎత్తులకు పైఎత్తు వేసి తన పదవిని ఎలా కాపాడుకొన్నాడనేది ఈ చిత్ర కథ.

    కథలో ట్విస్టులు

    కథలో ట్విస్టులు

    రాజకీయాలపై కనీస అవగాహన లేని వరుణ్ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు ఎలా చక్కదిద్దారు. ప్రత్యర్థి రాజకీయ నేతలు సాగించే వ్యూహాలను ఎలా చిత్తు చేశాడు? జర్నలిస్టు (మెహ్రీన్)‌తో వరుణ్‌కు ఉన్న సంబంధమేమిటి? మహేంద్ర (సత్యరాజ్), సీఎంకు ఉన్న గొడవ ఏమిటి? కుళ్లు, కుట్రలతో ఉన్న రాజకీయాల్లో వరుణ్ ఎలా రాణించాడు అనే ప్రశ్నలకు సమాధానమే నోటా సినిమా కథ.

    ఫస్టాఫ్ అనాలిసిస్

    ఫస్టాఫ్ అనాలిసిస్

    జల్సాగా తిరిగే వరుణ్‌ను సీఎం చేయడంతో దర్శకుడు నేరుగా కథలోకి తీసుకెళ్లడం జరుగుతుంది. విజయ్ దేవరకొండ నటన తొలి భాగానికి స్పెషల్ ఎట్రాక్షన్. ఫస్టాఫ్‌లో బస్సు తగలబెట్టే సీన్ ప్రేక్షకుడికి ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతుంది. కుళ్లుపట్టిన రాజకీయాలపై వరుణ్ పాత్ర ప్రవర్తించే తీరు ఆకట్టుకొనేలా ఉంటుంది. దాంతో ఫస్టాఫ్‌పై ప్రేక్షకుడికి సానుకూలత ఏర్పడుంది.

     అనేక లోపాలతో సెకండాఫ్

    అనేక లోపాలతో సెకండాఫ్

    ఇక సెకండాఫ్‌లో పొంతన లేని లాజిక్కులు. నాసిరకంగా సన్నివేశాలు డిజైన్‌తో కొంత నిరుత్సాహానికి గురిచేస్తుంది. రొటీన్ రాజకీయ ఎత్తుగడలతో కథ, కథనాలు దారి తప్పాయనే ఫీలింగ్ కలుగుతుంది. నాజర్, సత్యరాజ్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ మరీ దారుణంగా ఉంటుంది. ఈ ఎపిసోడ్ సినిమాను పాతాళానికి తొక్కినట్టు అనిపిస్తుంది. బేసిగ్గా విజయ్ దేవరకొండ అంటే రొమాంటిక్ హీరో అనే ముద్ర ఉంది. మెహ్రీన్‌తో లవ్ ట్రాక్ ఉంటుందని భావిస్తే అది బాగా నిరాశకు గురిచేస్తుంది. చివరకు విజయ్ దేవరకొండ, మెహ్రీన్ బంధం అన్నా చెల్లెల్ల రిలేషన్ అనే విధంగా ప్రొజెక్ట్ చేయడంతో సినిమా తేలిపోయినట్టు ఖాయమవుతుంది.

    దర్శకుడిగా ఆనంద్ శంకర్ విఫలం

    దర్శకుడిగా ఆనంద్ శంకర్ విఫలం

    దర్శకుడు ఆనంద్ శంకర్ కథ, కథనాలను విడిచి స్వారీ చేసినట్టు అనిపిస్తుంది. బేసిగ్గా బలమైన పాయింట్ లేకుండా కథను అల్లుకొన్నట్టు అనిపిస్తుంది. విజయ్ దేవరకొండ క్రేజ్ తగినట్టు సీన్లుగానీ, కథనం గానీ ఉండదు. ముఖ్యంగా సెకండాఫ్‌లో కథ, కథనాలను పరిశీలిస్తే పూర్తిగా దర్శకుడు చేతులెత్తిసినట్టు అనిపిస్తుంది. ఈ సినిమా ప్రేక్షకులను అలరించకపోతే అందుకు బాధ్యత కేవలం దర్శకుడే అని చెప్పవచ్చు.

    విజయ్ దేవరకొండ యాక్టింగ్

    విజయ్ దేవరకొండ యాక్టింగ్

    విజయ్ దేవరకొండ వరుణ్ పాత్రలో ఒదిగిపోయాడు. తొలిభాగంలో నటన పరంగా ఆధిపత్యాన్ని కనబరిచాడు. నాజర్, సత్యరాజ్ లాంటి నటుల ముందు విజయ్ డామినేట్ చేశాడు. సెకండాఫ్‌లో స్టోరిలో ఇంటెన్సిటీ లేకపోవడంతో విజయ్ దేవరకొండ చేయడానికి ఏమీ లేకపోయింది.ఎన్నో లోపాలు ఉన్నప్పటికీ.. సినిమాను కాపాడేందుకు విజయ్ దేవరకొండ చాలానే ప్రయత్నం చేశారు. తమిళ వాసన లేకుండా, డబ్బింగ్, స్క్రిప్ట్‌పై మరింత జాగ్రత్తలు తీసుకొని ఉంటే జరిగే డామేజ్‌ను కొంత తగ్గించే అవకాశం ఉండేదేమో.

    మెహ్రీన్, యషికా ఆనంద్ గురించి

    మెహ్రీన్, యషికా ఆనంద్ గురించి

    మెహ్రీన్ ఫిర్జాదా జర్నలిస్టుగా నటించిందని చెప్పడం కంటే కనిపించిందని చెబితే బాగుంటుంది. కథకు పెద్దగా సంబంధం లేని, ప్రాధాన్యం లేని పాత్ర ఆమెది. అంతేకాకుండా హీరోకు చెల్లెలు అనే విధంగా ప్రొజెక్ట్ చేసే మెహ్రీన్ పాత్ర ఉండటం మైనస్ పాయింట్. ఇక ఈ చిత్రంలో ప్రతిపక్ష పార్టీ నేతగా యషికా ఆనంద్ కొన్ని సీన్లలో ఆకట్టుకొన్నారు. ఈమె తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేని నటి. కీలకమైన సన్నివేశాల్లో తన హావభావాలతో ఆకట్టుకొన్నది.

    నాజర్, సత్యరాజ్ నటన

    నాజర్, సత్యరాజ్ నటన

    సీఎంగా నాజర్ కనిపించాడు. నాజర్ చేతిలో అన్యాయానికి గురైన పాత్రలో సత్యరాజ్ నటించాడు. కథలోని బలాన్ని దెబ్బ తీసే విధంగా వీరిద్దరి ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. నాజర్ తన పాత్రకు న్యాయం చేసేందుకు ప్రయత్నించాడు. సత్యరాజ్ పాత్ర సినిమాకు బలంగా మారలేకపోయిందనే ఫీలింగ్ కలుగుతుంది. సత్యరాజ్, నాజర్ మధ్యలో ఉండే వైరాన్ని కనీసం బలంగా ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు.

    నామమాత్రంగా ప్రియదర్శి

    నామమాత్రంగా ప్రియదర్శి

    విజయ్ దేవరకొండ స్నేహితుడిగా ప్రియదర్శి కనిపించాడు. ప్రియదర్శి ట్రాక్ చాలా సిల్లీగా ఉంటుంది. మిగితా పాత్రలన్నీ తెలుగు ప్రేక్షకులకు తెలియని ముఖాలే. ముతక డబ్బింగ్ సినిమాను మరిపించే విధంగా నోటాలోని పాత్రలు కనిపిస్తాయి.

    శంతన కృష్ణన సినిమాటోగ్రఫి

    శంతన కృష్ణన సినిమాటోగ్రఫి

    నోటా సినిమాకు శంతన కృష్ణన్, రవిచంద్రన్ సినిమాటోగ్రఫిని అందించారు. కొన్ని సీన్లలో వారి పనితనం బాగుంటుంది. ఎక్కువగా ఇంటిరీయర్ వర్క్ కావడంతో వారి ప్రతిభ బయటకు కనిపించలేకపోయింది. సెకండాఫ్‌లో అనవసరమైన సీన్లు చాలానే ఉన్నాయి. ఎడిటర్ ఇంకా చేతినిండా పని ఉందనిపిస్తుంది.

    మ్యూజిక్ గురించి

    మ్యూజిక్ గురించి

    నోటా సినిమాకు మరో ప్రధానమైన లోపం మ్యూజిక్. శ్యామ్ సీఎస్ అందించిన సంగీతం, పాటలు కనీసం వినసొంపుగా లేకపోవడం బాధాకరం. కొన్ని చోట్ల రీరికార్డింగ్ బాగుంది. కథలో బలమైన సన్నివేశాలు, భావోద్వోగమైన ఎపిసోడ్స్ లేకపోవడంతో మ్యూజిక్ విభాగం పనితీరు మూలన పడినట్టు అనిపిస్తుంది.

    ప్రొడక్షన్ వ్యాల్యూస్

    ప్రొడక్షన్ వ్యాల్యూస్

    స్టూడియో గ్రీన్ పతాకంపై కేజీ జ్ఞానవేల్ రాజా నోటా చిత్రాన్ని రూపొందించారు. ఇప్పటికే ఆయన రూపొందించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద భారీ సక్సెస్ సాధించాయి. నోటా తమిళ విషయానికి వస్తే నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపిక ఆయన ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయి. ప్రతీ ఫ్రేమ్‌ను శ్రద్ధపెట్టి చాలా రిచ్‌గా తెరకెక్కించడంలో స్టూడియో గ్రీన్ బ్యానర్ నిర్మాణ విలువలు కొట్టొచ్చినట్టు కనిపిస్తాయి. కానీ తెలుగు ప్రేక్షకులకు అభిరుచికి దూరంగా సినిమాను రూపొందించడం మైనస్ అని చెప్పవచ్చు.

    ఫైనల్‌గా

    ఫైనల్‌గా

    సమకాలీన రాజకీయ పరిస్థితులపై ఎక్కుపెట్టిన సినీ విమర్శనాస్త్రం నోటా చిత్రం. విజయదేవరకొండ నటనా ప్రతిభతో ఈ సినిమా ఎలాగోలా నెగ్గుకొచ్చింది. తెలుగు నేటివిటి లేకపోవడం ఈ సినిమాకు ప్రధానమైన లోపం. ఆనంద్ శంకర్ టేకింగ్, స్క్రీన్ ప్లే నాసిరకంగా ఉంది. డైలాగులు, పాత్రలకు ఎంపిక చేసిన నటులు తెలుగు ప్రేక్షకులకు కనెక్ట్ కాని విధంగా ఉంటుంది. అర్జున్‌రెడ్డి, గీతా గోవిందం చిత్రాల తర్వాత ప్రేక్షకుల్లో పెరిగిన అంచనాలను విజయ్ దేవరకొండ అధిగమించడం కష్టమే అని చెప్పవచ్చు. కథ, కథనాల పరంగా ఎన్నో లోపాలు ఉన్న ఈ చిత్రం సక్సెస్ సాధిస్తే అది కేవలం విజయ్ దేవరకొండకే క్రెడిట్ దక్కుతుంది.

    బలం, బలహీనత

    బలం, బలహీనత

    ప్లస్ పాయింట్స్
    విజయ్ దేవరకొండ యాక్టింగ్
    ఫస్టాఫ్
    సినిమాటోగ్రఫి

    మైనస్ పాయింట్స్
    సెకండాప్
    మెహ్రీన్ ఫిర్జాదా రోల్
    ఆనంద్ శంకర్ టేకింగ్
    నాజర్, సత్యరాజ్ ట్రాక్

    తెర వెనుక, తెర ముందు

    తెర వెనుక, తెర ముందు

    నటీనటులు: విజయ్ దేవరకొండ, మెహ్రీన్ ఫిర్జాదా, నాజర్, సత్యరాజ్, ప్రియదర్శి
    దర్శకత్వం: ఆనంద్ శంకర్
    నిర్మాత: కేజీ జ్ఞానవేల్ రాజా
    సంగీతం: శ్యామ్ సీఎస్
    సినిమాటోగ్రఫి: శంతన కృష్ణన్, రవిచంద్రన్
    ఎడిటింగ్: రేమండ్ డెర్రిక్ క్రస్టా
    బ్యానర్: స్టూడియో గ్రీన్
    నిడివి: 153 నిమిషాలు
    రిలీజ్: 2018-10-05

    English summary
    NOTA is an political thriller film directed by Anand Shankar, made in Tamil and Telugu languages. It stars Vijay Deverakonda, making his debut in Tamil cinema and Mehreen Pirzada, in the lead roles. Produced by Studio Green, this film will have Sam C. S. as the music director while Ravi K. Chandran's son, Santhana Krishnan Ravichandran handles the cinematography. The film is planned to be released on 5 October 2018. USA premieres on October 4th 2018. In this occassion, Telugu Filmibeat brings exclusive review.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X